లిప్‌లాక్ సీన్‌లో నెర్వస్‌గా ఫీలయ్యా!
‘కిక్-2’లో తన మనసుకి నచ్చిన పాత్ర చేశానని, అభిమానులందరూ ఈ పాత్ర గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విషయాలు.
► రవితేజతో వర్క్ చేయడం సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్. ఆయన తెరపై ఎంత ఎనర్జిటిగ్గా ఉంటారో, బయటా అలానే ఉంటారు.
► ఇందులో లిప్‌లాక్ సీన్ చేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కథకు అవసరం కాబట్టి ఆ సీన్‌ని వల్గారిటీ లేకుండా బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు దర్శకుడు సురేందర్‌రెడ్డి.
► హీరో కల్యాణ్‌రామ్ నిర్మించిన ఇంత భారీ బడ్జెట్ సినిమాలో నేనూ ఉన్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. కల్యాణ్‌రామ్ సరసన నటించే అవకాశం వస్తే వదులుకోను.
► ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నా. ఎన్టీఆర్‌తో సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, రామ్‌చరణ్‌తో శ్రీను వైట్ల డెరైక్షన్‌లో మరో సినిమా, బన్నీ-బోయపాటి కాంబినేషన్‌లో ఇంకో చిత్రం చేస్తున్నాను. ఇంకా కొత్తవేవీ కమిట్ కాలేదు.