Kick -2
-
పాంచ్ పటాకా
స్క్రిప్ట్ నచ్చితే ఎన్ని సినిమాలనైనా పట్టాలెక్కించేస్తుంటా అంటున్నారు బాలీవుడ్ భాయ్ సల్మాన్. లేటెస్ట్ మూవీ ‘రేస్ 3’ రిలీజ్‌కి రెడీగా ఉండగానే ‘భరత్’ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలు కాకుండా ‘కిక్’ సీక్వెల్ ‘కిక్ 2’, ‘దబాంగ్ 3’ కొరియోగ్రాఫర్,డైరెక్టర్ రెమో డిసౌజాతో ఓ డ్యాన్స్ ఫిల్మ్ కూడా ఓకే చేశారు. వరుసగా సినిమాలు ఒప్పుకోవడం గురించి సల్మాన్ మాట్లాడుతూ – ‘‘ఏదైనా స్క్రిప్ట్ వినగానే నచ్చిందంటే చేసేస్తాను. ఫస్ట్ నరేషన్లో ఎగై్జట్ చే స్తే ఓకే అనేస్తాను. కథ విన్న తర్వాత రేపు చెబుతాను, ఆ తర్వాత చెబుతాను అన్నానంటే ఆ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కదు. ఈ ఫేజ్‌లో నాకు నచ్చినన్ని, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఇవే కాకుండా సంజయ్ లీలా భన్సాలీతో కూడా ఓ సినిమా చేయడానికి అంగీకరించారట భాయ్. సో.. బాక్సాఫీస్ మీద భాయ్ పాంచ్ పటాకా పేల్చే పనిలో ఉన్నారని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. -
లిప్‌లాక్ సీన్లో నెర్వస్‌గా ఫీలయ్యా!
‘కిక్-2’లో తన మనసుకి నచ్చిన పాత్ర చేశానని, అభిమానులందరూ ఈ పాత్ర గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విషయాలు. ► రవితేజతో వర్క్ చేయడం సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఆయన తెరపై ఎంత ఎనర్జిటిగ్గా ఉంటారో, బయటా అలానే ఉంటారు. ► ఇందులో లిప్‌లాక్ సీన్ చేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కథకు అవసరం కాబట్టి ఆ సీన్‌ని వల్గారిటీ లేకుండా బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ► హీరో కల్యాణ్‌రామ్ నిర్మించిన ఇంత భారీ బడ్జెట్ సినిమాలో నేనూ ఉన్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. కల్యాణ్‌రామ్ సరసన నటించే అవకాశం వస్తే వదులుకోను. ► ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నా. ఎన్టీఆర్‌తో సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, రామ్‌చరణ్‌తో శ్రీను వైట్ల డెరైక్షన్‌లో మరో సినిమా, బన్నీ-బోయపాటి కాంబినేషన్లో ఇంకో చిత్రం చేస్తున్నాను. ఇంకా కొత్తవేవీ కమిట్ కాలేదు. -
ఒక్క షో...4 కోట్లు!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సిద్ధాంతాన్ని ‘కిక్-2’ ఫేమ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాగా వంటబట్టించుకుంటున్నారు. లక్నోకి చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమారుడి పెళ్లిని చాలా ఘనంగా చేయాలనుకొని ఆ వేడుకలో జాక్వెలిన్ ఆటాపాటా కావాలనుకున్నారు. జాక్వెలిన్‌ను సంప్రతిస్తే నాలుగు కోట్లకు రేట్ ఫిక్స్ చేసింది. ఇదంతా కేవలం ఆటపాటలకే. రెండు రోజుల పాటు పెళ్లి వారింట్లో సందడి చేయనున్న జాక్వెలిన్ రానూ పోనూ చార్జీలన్నీ ఈ కుటుంబానివే. సక్సెస్ వస్తే ఇలాగే ఉంటుందేమో!