పాంచ్‌ పటాకా | Interesting facts about the Salman Khan starrer | Sakshi
Sakshi News home page

పాంచ్‌ పటాకా

Published Tue, Jun 12 2018 12:57 AM | Last Updated on Tue, Jun 12 2018 12:57 AM

Interesting facts about the Salman Khan starrer - Sakshi

స్క్రిప్ట్‌ నచ్చితే ఎన్ని సినిమాలనైనా పట్టాలెక్కించేస్తుంటా అంటున్నారు బాలీవుడ్‌ భాయ్‌ సల్మాన్‌. లేటెస్ట్‌ మూవీ ‘రేస్‌ 3’ రిలీజ్‌కి రెడీగా ఉండగానే ‘భరత్‌’ షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. ఈ సినిమాలు కాకుండా ‘కిక్‌’ సీక్వెల్‌ ‘కిక్‌ 2’, ‘దబాంగ్‌ 3’ కొరియోగ్రాఫర్,డైరెక్టర్‌ రెమో డిసౌజాతో ఓ డ్యాన్స్‌ ఫిల్మ్‌ కూడా ఓకే చేశారు. వరుసగా సినిమాలు ఒప్పుకోవడం గురించి సల్మాన్‌ మాట్లాడుతూ – ‘‘ఏదైనా స్క్రిప్ట్‌ వినగానే నచ్చిందంటే చేసేస్తాను.

ఫస్ట్‌ నరేషన్‌లో ఎగై్జట్‌ చే స్తే ఓకే అనేస్తాను. కథ విన్న తర్వాత రేపు చెబుతాను, ఆ తర్వాత చెబుతాను అన్నానంటే ఆ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కదు. ఈ ఫేజ్‌లో నాకు నచ్చినన్ని, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఇవే కాకుండా సంజయ్‌ లీలా భన్సాలీతో కూడా ఓ సినిమా చేయడానికి అంగీకరించారట భాయ్‌. సో.. బాక్సాఫీస్‌ మీద భాయ్‌ పాంచ్‌ పటాకా పేల్చే పనిలో ఉన్నారని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement