రూ 200 కోట్ల క్లబ్‌లో భారత్‌ | Bharat Movie Enters Rs Two Hundred Cr Club | Sakshi
Sakshi News home page

రూ 200 కోట్ల క్లబ్‌లో భారత్‌

Jun 19 2019 5:54 PM | Updated on Jun 19 2019 5:54 PM

Bharat Movie Enters Rs Two Hundred Cr Club - Sakshi

బాక్సాఫీస్‌ వద్ద భారత్‌ దూకుడు

ముంబై : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారత్‌ మూవీ ఈనెల 5న విడుదలై బాక్సాఫీస్‌ వసూళ్లలో దుమ్మురేపుతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన భారత్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణనూ చూరగొని సంతృప్తికరమైన వసూళ్లను సాధిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ డబుల్‌ సెంచరీ సాధించిందని, రూ 200 కోట్ల వసూళ్లను అధిగమించిందని సినీ విమర్శకులు, ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీ్‌ట్‌ చేశారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూవీ వసూళ్లు కొంచెం నెమ్మదించినా ఉత్తరాదిలో భారీ కలెక్షన్స్‌ నమోదవుతున్నాయని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, మంగళవారం నాటికి భారత్‌ మూవీ దేశీయంగా రూ 201.86 కోట్లు రాబట్టిందని చెప్పారు. ఈ సినిమాలో సల్మాన్‌, కత్రినా జోడీతో పాటు టబూ, దిశాపటానీ, జాకీ ష్రాఫ్‌, నోరా ఫతేహి తదితరులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement