బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టించిన తాజా సినిమా 'రాధే'. ఈద్ కానుకగా ఈ సినిమా గురువారం నాడు(మే 13న) విడుదలైంది. అయితే ఈ సినిమాను కరోనా కారణంగా థియేటర్స్ తో పాటు, జీప్లెక్స్ ద్వారా జీ5 ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని చూసేందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యే ప్రయత్నం చేయడంతో ఈ ఓటీటీ సర్వర్లు.. స్తంభించిపోయాయి. రికార్డు వ్యూస్ సాధించిన ఈ సినిమా మొదటిరోజు దాదాపు 4.5 మిలియన్ హిట్స్ సాధించినట్లుగా జి ఫైవ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది ఒక చరిత్ర అని వాళ్ళు తమ అధికారిక ఖాతాల్లో పేర్కొన్నారు.
ఇక ఓవర్సీస్ మార్కెట్లో ‘రాధే’ మంచి వసూళ్లనే రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.39 కోట్లను రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి రోజున ఆస్ట్రేలియాలో 35 లక్షల రూపాయలు, న్యూజిలాండ్‌లో 7 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక గల్ఫ్ దేశాల్లో తొలి వారాంతానికి ఈ చిత్రం రూ.7.3 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్‌డే కలెక్షన్లను కరోనాపై పోరు చేస్తున్న స్వచ్ఛంధ సంస్థలకు, ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తామని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment