Rocky Aur Rani Kii Prem Kahaani: Dharmendra Breaks Silence On His Lip Lock Scene With Shabana Azmi - Sakshi
Sakshi News home page

Dharmendra: 87 ఏళ్ల వయసులో స్టార్‌ నటుడు లిప్‌లాక్‌ సీన్‌.. రొమాన్స్‌కు వయసుతో పనేంటి?

Published Sat, Jul 29 2023 7:51 PM | Last Updated on Sat, Jul 29 2023 8:20 PM

Rocky Aur Rani Kii Prem Kahaani: Dharmendra Breaks Silence On His Lip Lock Scene With Shabana Azmi - Sakshi

నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.. ఏమని చెప్పగలం? అన్నింటిలోనూ ఒక అడుగు ముందే ఉంటాడు ధర్మేంద్ర. ఆరు దశాబ్ధాలుగా బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్న ఈయన ఇప్పటివరకు 300కు పైగా చిత్రాలు చేశాడు. ఇప్పటికీ వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న ఈయన తాజాగా రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని సినిమాలో నటించాడు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న విడుదలైంది.

ఈ మూవీలో ధర్మేంద్ర, అలనాటి నటి షబానా అజ్మీ.. లిప్‌లాక్‌ సీన్‌లో నటించారు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. 87 ఏళ్ల వయసులో ముద్దు సన్నివేశంలో నటించడమేంట్రా బాబూ అని ఆశ్చర్యపోయారు. కొందరైతే ముసలాడికి దసరా పండగలా ఉంది.. అస్సలు బాగోలేదు అని విమర్శించారు. తాజాగా ఈ సన్నివేశంపై ధర్మేంద్ర స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నేను, షబానా కిస్‌ సీన్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసినట్లున్నాం. చాలామంది ఈ సీన్‌ చూసి చప్పట్లు కూడా కొట్టినట్లున్నారు. మా నుంచి జనాలిది అస్సలు ఊహించి ఉండరు కదా! అందుకే దీనికింతలా రెస్పాన్స్‌ వస్తోంది.

నేను ఇంతకుముందు చివరిసారిగా లైఫ్‌ ఇన్‌ ఎ మెట్రో అనే సినిమాలో నఫీసా అలీతో ముద్దు సన్నివేశంలో నటించాను. అప్పుడు కూడా జనాలు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో మా ముద్దు సన్నివేశం గురించి డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ మాకు ముందే చెప్పాడు. అప్పుడు నేనేమీ అంత సర్‌ప్రైజ్‌ అవలేదు. ఈ సినిమాకు అది అవసరం అనిపించింది. అందుకే నేను చేస్తానని చెప్పాను. అయినా రొమాన్స్‌కు వయసుతో పనేంటి? వయసు అనేది కేవలం నెంబర్స్‌ మాత్రమే సూచిస్తాయి. ఏ వయసు వాళ్లైనా ఇద్దరి మధ్య ప్రేమను ముద్దు ద్వారానే బయటపెడతారు. ఈ సీన్‌లో నటించేటప్పుడు నేను, షబానా ఏమాత్రం ఇబ్బందిగా ఫీలవలేదు' అని చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర.

చదవండి: ప్రేమకో దండం.. బ్రేకప్‌ చెప్పిన రీతూ వర్మ
ఆ సినిమాకు రూ.250 కోట్లా? దాన్నెవరు చూస్తారు?: కంగనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement