Glimpse of Tharunam Kishen Das Smruthi Venkat Liplock Video Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

వైరల్‌ అవుతున్న హీరోయిన్‌ లిప్‌లాక్‌ వీడియో

Published Mon, Jun 19 2023 8:40 AM | Last Updated on Mon, Jun 19 2023 12:40 PM

Glimpse of Tharunam Kishen Das Smruthi Venkat Liplock - Sakshi

 కోలీవుడ్‌లో మంచి స్థానం కోసం పోరాడుతున్న నటీమణులలో స్మృతి వెంకట్‌ ఒకరు. మొదట్లో హీరోలకు సిస్టర్‌ పాత్రలో నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు కథానాయికగా నటించే స్థాయికి ఎదిగింది. దీంతో సాదాసీదాగా నటిస్తే ప్రయోజనం ఉండదని గ్రహించిందేమో, అందాలారబోతతోనే కాకుండా ఏకంగా లిప్‌లాక్‌ సన్నివేశాలకు సిద్ధమైపోయింది. అదీ చిత్ర షూటింగ్‌కు ముందే ఆ చిత్ర హీరోతో ఘాటు చుంబనానికి రెడీ అయిపోయారు. దీంతో మూవీ లోకేషన్‌లోని వారు ఆశ్చర్యానికి గురయ్యారట.

(ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్‌,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్‌ మాస్టర్‌)

ఇంతకుముందు 'దేజావు' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అరవింద్‌ శ్రీనివాసన్‌ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం తరుణం. ఈ చిత్రంలో కిషన్‌దాస్‌ కథానాయకుడుగాను, స్మృతి వెంకట్‌ నాయకిగానూ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. అయితే అంతకుముందే ఒక టీజర్‌ను చిత్రీకరించి విడుదల చేశారు.

అందులో స్మృతి వెంకట్‌, కిషన్‌దాస్‌తో లిప్‌లాక్‌ సన్నివేశంతో కూడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీంతో నెటిజనుల స్మృతి వెంకట్‌పై రకరకాల సైటెర్లు వేస్తున్నారు. టీజర్‌లోనే ఇంత ఘాటు చుంబనాల సన్నివేశం ఉంటే ఇంకా మెయిన్‌ పిక్చర్‌ ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద దర్శకుడు టీజర్‌తోనే హైప్‌ క్రియేట్‌ చేశారు.

(ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్‌ అయిన రాకేష్‌ మాస్టర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement