మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదికపై ప్రముఖ కోలీవుడ్ నటి రేఖ నాయర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉందన్నారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. మీడియా లేని కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. అప్పట్లో చాలామంది సర్దుకుపోయేవారని కామెంట్ చేశారు. కొంతమంది అడ్జస్ట్‌మెంట్ కాలేక సినిమాల నుంచి తప్పుకున్నారని రేఖా నాయర్ వెల్లడించారు.
కోలీవుడ్‌లోనూ ఇలాంటి వేధింపులు చాలానే జరుగుతున్నాయని రేఖా నాయర్ ఆరోపించారు. మలయాళంలో కేవలం పది నుంచి ఇరవై మంది మాత్రమే ఉంటారని.. తమిళంలో ఆ సంఖ్య భారీగానే ఉంటుందని అన్నారు. ఇక్కడైతే ఏకంగా 500లకు పైగానే ఉంటారని తెలిపారు. ఇవన్నీ బయటికి మాట్లాడితే సినిమా ఛాన్సులు రావని రేఖా నాయర్ వెల్లడించారు. అందుకే హీరోయిన్స్ వాటి గురించి మాట్లాడేందుకు భయపడతారని పేర్కొన్నారు. తమిళంలో సినిమా సంఘాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరన్నారు. కేవలం మలయాళం, తమిళం మాత్రమే అన్ని భాషల్లోనూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
కాగా.. తమిళంలో టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే గతంలో మహిళల పట్ల ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి కానీ.. ఏదో అయిపోయిందని హంగామా చేయొద్దని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment