క్యాస్టింగ్‌ కౌచ్‌.. 16 ఏళ్ల వయసులోనే చేదు అనుభవం: నటి | Rashami Desai About Facing Casting Couch When She Was 16 | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల వయసులో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఫేస్‌ చేశా.. అమ్మకు చెప్తే అతడిని..

Published Wed, Nov 13 2024 6:43 PM | Last Updated on Wed, Nov 13 2024 7:12 PM

Rashami Desai About Facing Casting Couch When She Was 16

నీకు ఛాన్సిస్తే నాకేంటి? అన్న ధోరణి ఎప్పటినుంచో ఉంది. కెమెరా ముందు నటించాలని కలలు గన్న ఎంతోమందికి ఎప్పుడో ఓసారి ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. కొందరు అలాంటి డిమాండ్లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తే మరికొందరు తమ కల కోసం తల వంచేందుకు మొగ్గుచూపుతారు.

16 ఏళ్ల వయసులో చేదు అనుభవం
అయితే 16 ఏళ్ల వయసులో తనకూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైందంటోంది బిగ్‌బాస్‌ బ్యూటీ రష్మీ దేశాయ్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. క్యాస్టింగ్‌ కౌచ్‌.. ఒకానొక సమయంలో నేనూ ఫేస్‌ చేశాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. ఆడిషన్‌ ఉందని పిలిస్తే వెళ్లాను. అక్కడున్న వ్యక్తి నేను స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు. 

ఎలాగోలా తప్పించుకున్నా
అప్పటికే నాకు అక్కడంతా అసౌకర్యంగా అనిపించడంతో ఎలాగోలా ఆ గది నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాను. కొన్ని గంటల తర్వాత జరిగిందంతా అమ్మకు చెప్పాను. ఆ మర్నాడు అమ్మతో కలిసి అతడి దగ్గరకు వెళ్లాను. అమ్మ అతడి చెంప చెళ్లుమనిపించి గుణపాఠం చెప్పింది. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది నిజంగానే ఉంది. ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా మంచీచెడు రెండూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది.

సీరియల్స్‌తో ఫేమస్‌
కాగా రష్మీ దేశాయ్‌.. కన్యాదాన్‌ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కబ్‌ హోయ్‌ గవ్నా హమర్‌ చిత్రంతో భోజ్‌పురి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఉత్తరన్‌, దిల్‌సే దిల్‌ తక్‌ సీరియల్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఖత్రోన్‌ కె ఖిలాడీ, నాచ్‌ బలియే 7, ద ఖత్ర ఖత్ర షో, బిగ్‌బాస్‌ 13, బిగ్‌బాస్‌  15వ సీజన్లలోనూ పాల్గొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement