Rashami Desai
-
క్యాస్టింగ్ కౌచ్.. 16 ఏళ్ల వయసులోనే చేదు అనుభవం: నటి
నీకు ఛాన్సిస్తే నాకేంటి? అన్న ధోరణి ఎప్పటినుంచో ఉంది. కెమెరా ముందు నటించాలని కలలు గన్న ఎంతోమందికి ఎప్పుడో ఓసారి ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. కొందరు అలాంటి డిమాండ్లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తే మరికొందరు తమ కల కోసం తల వంచేందుకు మొగ్గుచూపుతారు.16 ఏళ్ల వయసులో చేదు అనుభవంఅయితే 16 ఏళ్ల వయసులో తనకూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైందంటోంది బిగ్‌బాస్ బ్యూటీ రష్మీ దేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్.. ఒకానొక సమయంలో నేనూ ఫేస్ చేశాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. ఆడిషన్ ఉందని పిలిస్తే వెళ్లాను. అక్కడున్న వ్యక్తి నేను స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్నాఅప్పటికే నాకు అక్కడంతా అసౌకర్యంగా అనిపించడంతో ఎలాగోలా ఆ గది నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాను. కొన్ని గంటల తర్వాత జరిగిందంతా అమ్మకు చెప్పాను. ఆ మర్నాడు అమ్మతో కలిసి అతడి దగ్గరకు వెళ్లాను. అమ్మ అతడి చెంప చెళ్లుమనిపించి గుణపాఠం చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే ఉంది. ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా మంచీచెడు రెండూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది.సీరియల్స్‌తో ఫేమస్కాగా రష్మీ దేశాయ్.. కన్యాదాన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కబ్ హోయ్ గవ్నా హమర్ చిత్రంతో భోజ్‌పురి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఉత్తరన్, దిల్సే దిల్ తక్ సీరియల్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఖత్రోన్ కె ఖిలాడీ, నాచ్ బలియే 7, ద ఖత్ర ఖత్ర షో, బిగ్‌బాస్ 13, బిగ్‌బాస్ 15వ సీజన్లలోనూ పాల్గొంది. -
నువ్వు అతడిని లవ్ చేస్తున్నావా? 'నాగిని' బ్యూటీ ఆన్సరేంటంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో క్లోజ్‌గా మూవ్ అయ్యారు రష్మీ దేశాయ్, ఉమర్ రియాజ్. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వారు డేటింగ్ చేసుకుంటున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది నటి. 'ఏదైనా అడిగేయండి' అంటూ అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించిన రష్మీకి 'నువ్వు ఉమర్‌ను ప్రేమిస్తున్నావా?' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఉమర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఆమె అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. ఒక ఫ్యామిలీలా కలిసిపోయామే తప్ప అంతకు మించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. 'మా బంధాన్ని మీరు ఇష్టపడుతున్నారని తెలుసు, అందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము' అంటూ సమాధానమిచ్చింది. చదవండి: పరుచూరి వెంకటేశ్వరరావు షాకింగ్ లుక్‌పై స్పందించిన గోపాల కృష్ణ కాగా బిగ్‌బాస్ హిందీ 15వ సీజన్లో పాల్గొన్న రష్మీ ప్రస్తుతం నాగిని (6వ సీజన్) సీరియల్లో నటిస్తోంది. అయితే ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండటంతో ఆమె అభిమాని ఒకరు పాజిటివ్ రోల్ చేయొచ్చు కదా అని అడిగింది. దీనికి నటి స్పందిస్తూ 'ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి జీవితంలో విలన్లే. అసలు విలన్ లేకపోతే హీరో ఏమీ చేయలేడు. పాజిటివ్ రోల్ అయినా, నెగెటివ్ రోల్ అయినా దేని ప్రాధాన్యత దానికుంటుంది. నాకు స్క్రిప్ట్ నచ్చింది, ఒప్పేసుకున్నాను' అని బదులిచ్చింది. చదవండి: కోట్లలో మోసపోయిన హీరోయిన్ రిమీ సేన్ -
చంపుతానంటూ నటికి బెదిరింపులు
బిగ్‌బాస్ కంటెస్టెంట్, టీవీ నటి దేవలీనా భట్టాచార్జీని చంపేస్తామంటూ ఓ మహిళ బెదిరింపులకు పాల్పడింది. తోటి బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్హాన్ ఖాన్ గురించి తప్పుడు మాటలు మానేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించింది. దీంతో దేవలీనా తనకు ప్రాణహాని ఉందంటూ ముంబై పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే హిందీ బిగ్‌బాస్ 13 సీజన్లో దేవలీనా భట్టాచార్జీ, రష్మీ దేశాయ్ మంచి మిత్రులు. ఇదిలావుండగా నటుడు అర్హాన్ ఖాన్ తనకు పెళ్లి అయిందన్న విషయం దాచిపెట్టి బిగ్‌బాస్ ఇంట్లో నటి రష్మీదేశాయ్తో రిలేషన్ కొనసాగించాడు. (ఆ రోజులను గుర్తుచేసుకున్న రేణు దేశాయ్..) అయితే ఇదివరకే అతనికి పెళ్లయిందని, పిల్లాడు కూడా ఉన్నాడంటూ వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ గుట్టు రట్టు చేశాడు. దీంతో వారి ప్రేమ బీటలు వారింది. ఇది ఇక్కడితో ముగింపు పలికితేనే మంచిదని రష్మీ దేశాయ్‌కు దేవలీనా గతంలో సలహా ఇచ్చింది. అంతేకాక తన స్నేహితురాలిని మోసం చేసిన అర్హాన్ ఖాన్‌పై పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జీర్ణించుకోలేని అతని అభిమాని అర్హాన్ఖాన్ను ఒక్కమాట అన్నా ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు దిగింది. "నువ్వు అర్హాన్‌ను అదేపనిగా అవమానిస్తున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీతోపాటు ఇలా అనవసరంగా దూషిస్తున్న రష్మీ దేశాయ్, సిద్ధార్థ్ శుక్లా మృతదేహాలు కూడా దొరక్కుండా చేస్తా. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి.. కాదూ కూడదని ఇంకోసారి అర్హాన్ గురించి తప్పుగా మాట్లాడితే మీకు అదే ఆఖరి రోజవుతుంది" అంటూ ఫోన్‌కు వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది. దీంతో భయాందోళనకు గురైన దేవలీనా మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ముంబై పోలీసులకు ట్విటర్లో పంపించి విషయాన్ని వివరించింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆమెకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ నటి దేవలీనా ఆ తరువాత ‘సాథ్ నిభాయా సాథ్‌లో గోపీ బహూ’లో కోడలిగా బాగా పాపులారిటీ సంపాదించింది. ఇదే సీరియల్ తెలుగులో ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో డబ్ అయిన విషయం తెలిసిందే. (‘ఓ పోలీసు.. మీ వల్లే మేము పదిలం’) -
భయంకరమైన చేదు అనుభవం ఎదుర్కొన్నా..
హిందీ ‘బిగ్‌బాస్ 13’ ఫైనలిస్ట్ రషమి దేశాయ్ తాను పరిశ్రమకు వచ్చిన మొదట్లో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోన్నానని తెలిపారు. తాజాగా ఆమె పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్యూలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘ప్రారంభంలోనే భయంకరమైన కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. ఓ వ్యక్తి నాకు సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఆడిషన్స్‌కు రమ్మనాడు. నేను అతను చెప్పిన చోటుకు వెళ్లాను. అక్కడ అతను తప్ప ఎవరూ లేరు. కనీసం సీసీ కెమారాలు కూడా లేవు. అంతేకాదు ‘నా డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి.. లైంగిక దాడికి పాల్పడాలని చూశాడు. అయితే నేను అతని వలలో పడకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాను. అయినా కూడా అతను నాపై దాడికి పాల్పడేందుకు తీవ్రంగా యత్నించాడు. నాకు ఇదంతా ఇష్టం లేదని గట్టిగా చెప్పడంతో నన్ను వదిలేశాడు. అయితే చిత్ర పరిశ్రమలో రాణించాలంటే కాస్టింగ్ కౌచ్‌కు తలోగ్గాల్సిందే అని అతను నాతో చెప్పాడు. అప్పుడు నాకు 16 ఏళ్లు మ్రాతమే. లోక జ్ఞానం లేని అమ్మాయిలను ఈ లోకం సులభంగా మోసం చేయగలదని అప్పుడే నాకు అర్ధమైంది. అతని బారి నుంచి తప్పించుకున్న నేను వెంటనే మా అమ్మను పిలిచి విషయం చెప్పాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడం తన వల్లకాదని, ఇక్కడ నాకు సౌకర్యవంతంగా లేదని చెప్పాను. ఆ మరుసటి రోజు మా అమ్మ అతడిని పిలిచి చెంపపై కొట్టి హెచ్చరించింది’ అని చెప్పారు. అతడి పేరు సురజ్. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదని కూడా నాకు తెలియదు’ అని తెలిపారు. కాగా రషమి ‘దిల్ సే దిల్ తఖ్’, ‘పరి హూన్ మే’, ‘ఇష్క్ క రంగ్ సఫేద్’ వంటి ప్రముఖ సీరియల్లో నటించారు. అదే విధంగా ‘గబ్బర్ సింగ్’, 2 బంధం నా థూట్ నా’, ‘దబాంగ్’ చిత్రాలలో కూడా నటించారు. -
ఓ నటిగా అలా ఉండటం సులభంకాదు
ఓ నటి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలని, ఇలా ఉండటం అంత సులభం కాదని టీవీ నటి రష్మీ దేశాయ్ అంటోంది. ప్రజల మధ్య సెలెబ్రిటీగా గడపడం తేలికకాదని చెప్పింది. వేసుకున్న డ్రెస్ నుంచి ప్రవర్తన వరకు అన్ని విషయాలను అభిమానులు గమనిస్తుంటారని అంది. అభిమానులు చుట్టుముట్టినపుడు వారితో అనుచితంగా ప్రవర్తించకుండా సహనంగా వ్యవహరిస్తుంటానని చెప్పింది. తన కెరీర్లో విభిన్న దశలున్నాయని, తానెవరో తెలియని దశ నుంచి అభిమానులు గుర్తించే స్థాయికి చేరుకున్నానని రష్మీ దేశాయ్ అంది. గతంలో టీవీ సీరియళ్లు ఏళ్ల కొద్దీ సాగేవని, ఇటీవల కాలంలో కొన్ని నెలల్లోనే పూర్తవుతున్నాయని చెప్పింది. కథ, కథనం బాగుంటేనే నటులకు మంచి పేరు వస్తుందని, లేకుంటే ఎంత కష్టపడినా ఫలితం ఉండదని అంది.