ఓ నటిగా అలా ఉండటం సులభంకాదు | Not easy being a public figure: Rashami Desai | Sakshi
Sakshi News home page

ఓ నటిగా అలా ఉండటం సులభంకాదు

Published Mon, Jun 13 2016 8:20 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

ఓ నటిగా అలా ఉండటం సులభంకాదు

ఓ నటిగా అలా ఉండటం సులభంకాదు

ఓ నటి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలని, ఇలా ఉండటం అంత సులభం కాదని టీవీ నటి రష్మీ దేశాయ్ అంటోంది. ప్రజల మధ్య సెలెబ్రిటీగా గడపడం తేలికకాదని చెప్పింది. వేసుకున్న డ్రెస్ నుంచి ప్రవర్తన వరకు అన్ని విషయాలను అభిమానులు గమనిస్తుంటారని అంది. అభిమానులు చుట్టుముట్టినపుడు వారితో అనుచితంగా ప్రవర్తించకుండా సహనంగా వ్యవహరిస్తుంటానని చెప్పింది.

తన కెరీర్లో విభిన్న దశలున్నాయని, తానెవరో తెలియని దశ నుంచి అభిమానులు గుర్తించే స్థాయికి చేరుకున్నానని రష్మీ దేశాయ్ అంది. గతంలో టీవీ సీరియళ్లు ఏళ్ల కొద్దీ సాగేవని, ఇటీవల కాలంలో కొన్ని నెలల్లోనే పూర్తవుతున్నాయని చెప్పింది. కథ, కథనం బాగుంటేనే నటులకు మంచి పేరు వస్తుందని, లేకుంటే ఎంత కష్టపడినా ఫలితం ఉండదని అంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement