బిగ్‌బాస్ కంటెస్టెంట్, టీవీ నటి దేవలీనా భట్టాచార్జీని చంపేస్తామంటూ ఓ మహిళ బెదిరింపులకు పాల్పడింది. తోటి బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్హాన్ ఖాన్ గురించి తప్పుడు మాటలు మానేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించింది. దీంతో దేవలీనా తనకు ప్రాణహాని ఉందంటూ ముంబై పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే హిందీ బిగ్‌బాస్ 13 సీజన్‌లో దేవలీనా భట్టాచార్జీ, రష్మీ దేశాయ్ మంచి మిత్రులు. ఇదిలావుండగా నటుడు అర్హాన్ ఖాన్ తనకు పెళ్లి అయిందన్న విషయం దాచిపెట్టి బిగ్‌బాస్ ఇంట్లో నటి రష్మీదేశాయ్‌తో రిలేషన్ కొనసాగించాడు. (ఆ రోజులను గుర్తుచేసుకున్న రేణు దేశాయ్..)
అయితే ఇదివరకే అతనికి పెళ్లయిందని, పిల్లాడు కూడా ఉన్నాడంటూ వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ గుట్టు రట్టు చేశాడు. దీంతో వారి ప్రేమ బీటలు వారింది. ఇది ఇక్కడితో ముగింపు పలికితేనే మంచిదని రష్మీ దేశాయ్‌కు దేవలీనా గతంలో సలహా ఇచ్చింది. అంతేకాక తన స్నేహితురాలిని మోసం చేసిన అర్హాన్ ఖాన్‌పై పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జీర్ణించుకోలేని అతని అభిమాని అర్హాన్‌ఖాన్‌ను ఒక్కమాట అన్నా ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు దిగింది. "నువ్వు అర్హాన్‌ను అదేపనిగా అవమానిస్తున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీతోపాటు ఇలా అనవసరంగా దూషిస్తున్న రష్మీ దేశాయ్, సిద్ధార్థ్ శుక్లా మృతదేహాలు కూడా దొరక్కుండా చేస్తా.
ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి.. కాదూ కూడదని ఇంకోసారి అర్హాన్ గురించి తప్పుగా మాట్లాడితే మీకు అదే ఆఖరి రోజవుతుంది" అంటూ ఫోన్‌కు వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది. దీంతో భయాందోళనకు గురైన దేవలీనా మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ముంబై పోలీసులకు ట్విటర్‌లో పంపించి విషయాన్ని వివరించింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆమెకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ నటి దేవలీనా ఆ తరువాత ‘సాథ్ నిభాయా సాథ్‌లో గోపీ బహూ’లో కోడలిగా బాగా పాపులారిటీ సంపాదించింది. ఇదే సీరియల్ తెలుగులో ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో డబ్ అయిన విషయం తెలిసిందే. (‘ఓ పోలీసు.. మీ వల్లే మేము పదిలం’)
Comments
Please login to add a commentAdd a comment