![Bigg Boss Rashmi Desai Said She Faced Casting Couch At 16 - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/4/bigg.jpg.webp?itok=xksSQ5CI)
హిందీ ‘బిగ్‌బాస్ 13’ ఫైనలిస్ట్ రషమి దేశాయ్ తాను పరిశ్రమకు వచ్చిన మొదట్లో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోన్నానని తెలిపారు. తాజాగా ఆమె పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్యూలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘ప్రారంభంలోనే భయంకరమైన కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. ఓ వ్యక్తి నాకు సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఆడిషన్స్‌కు రమ్మనాడు. నేను అతను చెప్పిన చోటుకు వెళ్లాను. అక్కడ అతను తప్ప ఎవరూ లేరు. కనీసం సీసీ కెమారాలు కూడా లేవు.
అంతేకాదు ‘నా డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి.. లైంగిక దాడికి పాల్పడాలని చూశాడు. అయితే నేను అతని వలలో పడకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాను. అయినా కూడా అతను నాపై దాడికి పాల్పడేందుకు తీవ్రంగా యత్నించాడు. నాకు ఇదంతా ఇష్టం లేదని గట్టిగా చెప్పడంతో నన్ను వదిలేశాడు. అయితే చిత్ర పరిశ్రమలో రాణించాలంటే కాస్టింగ్ కౌచ్‌కు తలోగ్గాల్సిందే అని అతను నాతో చెప్పాడు. అప్పుడు నాకు 16 ఏళ్లు మ్రాతమే. లోక జ్ఞానం లేని అమ్మాయిలను ఈ లోకం సులభంగా మోసం చేయగలదని అప్పుడే నాకు అర్ధమైంది.
అతని బారి నుంచి తప్పించుకున్న నేను వెంటనే మా అమ్మను పిలిచి విషయం చెప్పాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడం తన వల్లకాదని, ఇక్కడ నాకు సౌకర్యవంతంగా లేదని చెప్పాను. ఆ మరుసటి రోజు మా అమ్మ అతడిని పిలిచి చెంపపై కొట్టి హెచ్చరించింది’ అని చెప్పారు. అతడి పేరు సురజ్. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదని కూడా నాకు తెలియదు’ అని తెలిపారు. కాగా రషమి ‘దిల్ సే దిల్ తఖ్’, ‘పరి హూన్ మే’, ‘ఇష్క్ క రంగ్ సఫేద్’ వంటి ప్రముఖ సీరియల్‌లో నటించారు. అదే విధంగా ‘గబ్బర్ సింగ్’, 2 బంధం నా థూట్ నా’, ‘దబాంగ్’ చిత్రాలలో కూడా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment