నువ్వు అతడిని లవ్‌ చేస్తున్నావా? 'నాగిని' బ్యూటీ ఆన్సరేంటంటే? | Rashami Desai Breaks Silence On Dating Rumours With Umar Riaz | Sakshi
Sakshi News home page

Rashami Desai: డేటింగ్‌ రూమర్స్‌పై ‍స్పందించిన నాగిని బ్యూటీ

Apr 1 2022 11:11 AM | Updated on Apr 1 2022 11:25 AM

Rashami Desai Breaks Silence On Dating Rumours With Umar Riaz - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు రష్మీ దేశాయ్‌, ఉమర్‌ రియాజ్‌. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ నడుస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా ఏదైనా అడిగేయండి అంటూ అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించింది రష్మీ.

బిగ్‌బాస్‌ హౌస్‌లో క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు రష్మీ దేశాయ్‌, ఉమర్‌ రియాజ్‌. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ నడుస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వారు డేటింగ్‌ చేసుకుంటున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్‌ పెట్టింది నటి.

'ఏదైనా అడిగేయండి' అంటూ అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించిన రష్మీకి 'నువ్వు ఉమర్‌ను ప్రేమిస్తున్నావా?' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఉమర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసిన ఆమె అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. ఒక ఫ్యామిలీలా కలిసిపోయామే తప్ప అంతకు మించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. 'మా బంధాన్ని మీరు ఇష్టపడుతున్నారని తెలుసు, అందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము' అంటూ సమాధానమిచ్చింది.

చదవండి: పరుచూరి వెంకటేశ్వరరావు షాకింగ్‌ లుక్‌పై స్పందించిన గోపాల కృష్ణ

కాగా బిగ్‌బాస్‌ హిందీ 15వ సీజన్‌లో పాల్గొన్న రష్మీ ప్రస్తుతం నాగిని (6వ సీజన్‌) సీరియల్‌లో నటిస్తోంది. అయితే ఇందులో నెగెటివ్‌ రోల్‌ చేస్తుండటంతో ఆమె అభిమాని ఒకరు పాజిటివ్‌ రోల్‌ చేయొచ్చు కదా అని అడిగింది. దీనికి నటి స్పందిస్తూ 'ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి జీవితంలో విలన్లే. అసలు విలన్‌ లేకపోతే హీరో ఏమీ చేయలేడు. పాజిటివ్‌ రోల్‌ అయినా, నెగెటివ్‌ రోల్‌ అయినా దేని ప్రాధాన్యత దానికుంటుంది. నాకు స్క్రిప్ట్‌ నచ్చింది, ఒప్పేసుకున్నాను' అని బదులిచ్చింది.

చదవండి: కోట్లలో మోసపోయిన హీరోయిన్‌ రిమీ సేన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement