19 ఏళ్లకే హీరోయిన్‌ ఆఫర్‌.. ఎగిరి గంతేశా! కానీ..: నటి | Ankita Lokhande Opens Up About Her Casting Couch Experience In South Film Industry | Sakshi
Sakshi News home page

Ankita Lokhande: సౌత్‌ ఇండస్ట్రీలో నటికి చేదు అనుభవం.. ఆఫీసుకు రమ్మని చివరకు..

Published Fri, Mar 1 2024 12:37 PM | Last Updated on Fri, Mar 1 2024 12:50 PM

Ankita Lokhande Opens Up About Her Casting Couch Experience In South Film Industry - Sakshi

హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో బుల్లితెర జంట అంకిత లోఖండే- విక్కీజైన్‌ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరి గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఈర్ష్య, అసూయలు.. ఇవన్నీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. అయితే ఈ షో వల్ల ఎక్కువ నెగెటివిటీని మూటగట్టుకుంది అంకితనే! తాజాగా ఈ బ్యూటీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ షోకి హాజరైన ఆమెకు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎప్పుడైనా ఫేస్‌ చేశావా? అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆమె అవునని తలూపుతూ ఆనాటి ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేసుకుంది.

ఎగిరి గంతేశా..
'దక్షిణాది చిత్రపరిశ్రమలో నేను ఓ ఆడిషన్‌కు వెళ్లాను. తర్వాత వాళ్లు కాల్‌ చేసి మీరు సెలక్ట్‌ అయ్యారు, వచ్చి సంతకం చేయండన్నారు. నేను సంతోషంతో ఎగిరిగంతేశాను. ఈ విషయం అమ్మకు చెప్పి సంబరపడ్డాను. అయితే ఇంత తేలికగా ఎలా సెలక్ట్‌ చేశారబ్బా అన్న అనుమానం కూడా వచ్చింది. నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తిని బయటే ఉండమన్నారు. లోపలికి వెళ్లాక నన్ను కాంప్రమైజ్‌ కావాలని అడిగారు. షాకయ్యాను.

నేనలాంటిదాన్ని కాదని..
నాకప్పుడు 19 ఏళ్లే. నన్ను హీరోయిన్‌ చేస్తారేమోనని కాంప్రమైజ్‌ అంటే ఏంటని అడిగాను. అందుకు వాళ్లు.. నిర్మాతతో ఒక రాత్రి ఉండాలని చెప్పారు. అప్పుడు నేను.. మీ నిర్మాతకు టాలెంట్‌ అవసరం లేదనుకుంటా.. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. అయితే సౌత్‌లో ఏ భాషా ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవం ఫేస్‌ చేసిందో వివరంగా చెప్పలేదు.

చదవండి: ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement