ఘంటసాలకు ‘భారతరత్న’ కార్యక్రమం: 200 టీవీ ఎపిసోడ్స్ పూర్తి | Bharat Ratna for Eminent singer Ghantasala campaign completed 200 tv episodes | Sakshi
Sakshi News home page

ఘంటసాలకు ‘భారతరత్న’ కార్యక్రమం: 200 టీవీ ఎపిసోడ్స్ పూర్తి

Published Wed, Jan 11 2023 4:49 PM | Last Updated on Wed, Jan 11 2023 9:24 PM

Bharat Ratna for Eminent singer Ghantasala campaign completed 200 tv episodes - Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా  ఘంటశాలకు ‘భారతరత్న’  అనే నినాదంతో యూఏఎస్‌ఏ నుంచి శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 200 టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా అమెరికా గానకోకిల శారద ఆకునూరి వ్యాఖ్యాతగా 8 జనవరి 2023, జనవరి 8న  నాడు జరిగిన అంతర్జాల (జూమ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి  కిషన్ రెడ్డి  పాల్గొన్నారు. పని ఒత్తిడి కారణంగా "200 వ టీవీ ఎపిసోడ్" ఉత్సవాల నిమిత్తం అమెరికాకు  రాలేక పోతున్నప్పటికీ  న్యూఢిల్లీ నుంచే ఘంటసాలకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా  అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగుతో పాటు అనేక భాషలలో వేలాది మధురమైన పాటలు అందించిన ఘంటశాల గారి గళం  ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే సుప్రభాతం కానీ, అనేక భక్తి గీతాలు కానీ, లేక భగవద్గీతగా వినినిపిస్తుందన్నీరు. వీటన్నిటికీ మించి  ఈ దేశ స్వాత్రంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో పాల్గొన్న స్వతంత్ర పోరాట యోధుడు...  చిన్నప్పుడు గాంధీజీ సిద్ధాంతాలకు స్పందించి స్వాతంత్ర పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.   భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తియైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆజాద్ కా అమృతోత్సవ్ పేరుతో ప్రపంచం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అలాగే ఘంటసాల శతజయంతి జన్మ ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో కూడా జరపాలని  నిర్ణయించామనీ, 4 డిసెంబర్  4న, చెన్నైలో భారత ప్రభుత్వం తరపున ప్రారంభించడంతోపాటు, రానున్న రోజుల్లో ఒక సంవత్సరం పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశ రాజధానిలో లాంటి అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తరపున శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనేక దేశాలలో కూడా మన ఘంటసాల అభిమానులు, కళాకారులు, అనేకమంది ప్రముఖులు వారి శతజయంతి ఉత్సవాలు  ఘనంగా  నిర్వహిస్తున్నారనీ,  మీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. మరొక్క సారి భారత ప్రభుత్వం , సాంస్కృతిక శాఖ తరపున ఆయన  ఘనమైన నివాళులర్పించారు.

రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలియని తెలుగు వారు ఉండరు, ఉదయాన్నే లేవగానే వారి గాత్రాన్ని భక్తి గీతాల రూపంలో, భగవద్గీత రూపంలో, సినిమా పాటలు రూపంలో  వింటూ ఉంటాము. చిన్నతనంలో తండ్రి గారు మరణించిన చాలా కష్టాలు పడి విజయనగం వెళ్లి వారాలు ఉండి సంగీతం నేర్చుకొని, వారికి సంగీతం నేర్పించిన గురువు గారు అయినా సీతారామ శాస్త్రి గారిని జీవితాంతం స్మరించుకున్నారు. 10వేల పైగా పాటలు, 110 ఎక్కువ సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. పిన్న వయస్సులోనే దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షను అనుభవించారు, తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గాయకుడు అని కొనియాడారు.

ఇంకా ఈ కార్యక్రమంలో 10 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన బిలియనీర్ వ్యాపారవేత్త డాక్టర్ MS రెడ్డి (జున్ను రాజు), ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు కోదండరామి రెడ్డి,  నటుడు మురళీ మోహన్, ఘంటసాల కుటుంబం నుంచి కృష్ణకుమారి, నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, TTA మాజీ అధ్యక్షుడు భరత్ మాదాడి, శంకర నేత్రాలయ ట్రస్టీ, SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు భాస్కర్ గంటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు,  NRIVA ఛైర్మన్, డాక్టర్ జయసింహ సుంకు, శంకర నేత్రాలయ ట్రస్టీ, శ్యామ్ అప్పాలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ, ఘంటసాల గారి పాటలతో వారికున్న అనుబంధాన్ని పంచుకొని ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయుడికి భారతరత్న గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా  కోరారు. 

ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం  విచారం వ్యక్తం చేశారు.  ఘంటసాలకి కేంద్రం తగిన రీతిలో గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు, అందుకు 33 దేశాల్లో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలు కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. 

33 దేశాలను చేరుకోవడానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ  నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే 200 TV కార్యక్రమాలకి సాంకేతిక సహాయాన్ని అందచేసిన శ్యాం అప్పాలి, ప్రమీల గోపు, హరీష్ కోలపల్లికి  ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమాలకి వ్యాఖ్యాతలుగా నిర్వహించిన శారద ఆకునూరి,   రత్న కుమార్,  శ్యామ్ అప్పాలి , విజు చిలువేరు, నీలిమ గడ్డమనుగు, Dr. రెడ్డి  ఉరిమింది, జయ పీసపాటి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్క,  శ్రీలత మగతలకు ప్రత్యేక అభినందనలందించారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement