Ghantasala Venkateshwara Rao
-
ఘంటసాలది మా ఊరే అని నాకు తెలియదు
-
ఘంటసాలకు ‘భారతరత్న’ కార్యక్రమం: 200 టీవీ ఎపిసోడ్స్ పూర్తి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా ఘంటశాలకు ‘భారతరత్న’ అనే నినాదంతో యూఏఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 200 టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా అమెరికా గానకోకిల శారద ఆకునూరి వ్యాఖ్యాతగా 8 జనవరి 2023, జనవరి 8న నాడు జరిగిన అంతర్జాల (జూమ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పని ఒత్తిడి కారణంగా "200 వ టీవీ ఎపిసోడ్" ఉత్సవాల నిమిత్తం అమెరికాకు రాలేక పోతున్నప్పటికీ న్యూఢిల్లీ నుంచే ఘంటసాలకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుతో పాటు అనేక భాషలలో వేలాది మధురమైన పాటలు అందించిన ఘంటశాల గారి గళం ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే సుప్రభాతం కానీ, అనేక భక్తి గీతాలు కానీ, లేక భగవద్గీతగా వినినిపిస్తుందన్నీరు. వీటన్నిటికీ మించి ఈ దేశ స్వాత్రంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో పాల్గొన్న స్వతంత్ర పోరాట యోధుడు... చిన్నప్పుడు గాంధీజీ సిద్ధాంతాలకు స్పందించి స్వాతంత్ర పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తియైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆజాద్ కా అమృతోత్సవ్ పేరుతో ప్రపంచం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ఘంటసాల శతజయంతి జన్మ ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో కూడా జరపాలని నిర్ణయించామనీ, 4 డిసెంబర్ 4న, చెన్నైలో భారత ప్రభుత్వం తరపున ప్రారంభించడంతోపాటు, రానున్న రోజుల్లో ఒక సంవత్సరం పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశ రాజధానిలో లాంటి అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తరపున శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనేక దేశాలలో కూడా మన ఘంటసాల అభిమానులు, కళాకారులు, అనేకమంది ప్రముఖులు వారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారనీ, మీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. మరొక్క సారి భారత ప్రభుత్వం , సాంస్కృతిక శాఖ తరపున ఆయన ఘనమైన నివాళులర్పించారు. రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలియని తెలుగు వారు ఉండరు, ఉదయాన్నే లేవగానే వారి గాత్రాన్ని భక్తి గీతాల రూపంలో, భగవద్గీత రూపంలో, సినిమా పాటలు రూపంలో వింటూ ఉంటాము. చిన్నతనంలో తండ్రి గారు మరణించిన చాలా కష్టాలు పడి విజయనగం వెళ్లి వారాలు ఉండి సంగీతం నేర్చుకొని, వారికి సంగీతం నేర్పించిన గురువు గారు అయినా సీతారామ శాస్త్రి గారిని జీవితాంతం స్మరించుకున్నారు. 10వేల పైగా పాటలు, 110 ఎక్కువ సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. పిన్న వయస్సులోనే దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షను అనుభవించారు, తిరుమల తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గాయకుడు అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో 10 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన బిలియనీర్ వ్యాపారవేత్త డాక్టర్ MS రెడ్డి (జున్ను రాజు), ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు కోదండరామి రెడ్డి, నటుడు మురళీ మోహన్, ఘంటసాల కుటుంబం నుంచి కృష్ణకుమారి, నాటా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, TTA మాజీ అధ్యక్షుడు భరత్ మాదాడి, శంకర నేత్రాలయ ట్రస్టీ, SPB మ్యూజిక్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు భాస్కర్ గంటి, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు, NRIVA ఛైర్మన్, డాక్టర్ జయసింహ సుంకు, శంకర నేత్రాలయ ట్రస్టీ, శ్యామ్ అప్పాలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ, ఘంటసాల గారి పాటలతో వారికున్న అనుబంధాన్ని పంచుకొని ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయుడికి భారతరత్న గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం విచారం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం తగిన రీతిలో గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు, అందుకు 33 దేశాల్లో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలు కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. 33 దేశాలను చేరుకోవడానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే 200 TV కార్యక్రమాలకి సాంకేతిక సహాయాన్ని అందచేసిన శ్యాం అప్పాలి, ప్రమీల గోపు, హరీష్ కోలపల్లికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలకి వ్యాఖ్యాతలుగా నిర్వహించిన శారద ఆకునూరి, రత్న కుమార్, శ్యామ్ అప్పాలి , విజు చిలువేరు, నీలిమ గడ్డమనుగు, Dr. రెడ్డి ఉరిమింది, జయ పీసపాటి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్క, శ్రీలత మగతలకు ప్రత్యేక అభినందనలందించారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, -
ఘంటసాల శతజయంతి ఉత్సవాలు: సింగపూర్‌లో ఘన నివాళి
శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి, "శ్రీ సాంస్కృతిక కళాసారథి" వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి, నిర్వాహకబృంద సభ్యులు శ్రీధర్ భరద్వాజ్, చామిరాజు రామాంజనేయులు పాతూరు రాంబాబు జ్యోతి ప్రకాశనం గావించి ఘంటసాల మాస్టారు చిత్రపటానికి పూవులతో నివాళులు అర్పించారు. "గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూవస్తున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమం సమాపనోత్సవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశం నుండి అతిథులు గాయనీగాయకులు, వాద్య బృందం సింగపూర్‌కు విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం తమ సంస్థ ద్వారా జరగడం అదృష్టంగా భావిస్తున్నామని" రత్నకుమార్ కవుటూరు తెలియజేశారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి సందేశాన్ని పంపిన వామరాజు సత్యమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. కిషన్ రెడ్డి తమ అభినందన వీడియో సందేశంలో "ఈ కార్యక్రమం సింగపూర్ లో నిర్వహించడం అభినందనీయమని తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ, సింగపూర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున, కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు కూడా అందించారు." ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కుమార్తె సుగుణ ఈ కార్యక్రమానికి అభినందన సందేశాలు పంపుతూ "పైనుండి ఘంటసాల వారు ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తారన్నారు." శుభోదయం సమర్పణలో, మాధవపెద్ది సురేష్ సారధ్యంలో జరిగిన ప్రత్యేక సంగీత విభావరిలో, ప్రముఖ నేపథ్య గాయనీగాయకులు చంద్రతేజ, సురేఖ మూర్తి, చింతలపాటి సురేష్ అద్భుతమైన పాటలను ఆలపించగా, ప్రముఖ వాద్య కళాకారులు సాయి కుమార్ పవన్ కుమార్ సోదరులు, యుగంధర్, చక్రపాణి సోమేశ్వరరావు చక్కటి వాద్య సహకారాన్ని అందించారు.దుబాయ్ నుండి విచ్చేసిన నాట్య కళాకారిణి కుమారి తెన్నేటి శ్రావణి శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరిని ఆకర్షించింది. ఈ వేదికపై శుభోదయం వారి "షడ్రుచి" శాఖ ప్రకటనను సింగపూర్ లో విడుదల చేశారు. వారు నిర్మించిన 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ దర్శకులు రామారావు నిర్మాత జి వి భాస్కర్ లను శ్రీ సాంస్కృతిక కళాసారథి వారు ప్రత్యేకంగా సత్కరించారు. వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణగా పీఎస్ గోపాలకృష్ణ రచించిన 'మన ఘంటసాల' అనే పుస్తకాన్ని ఈ వేదికపై అతిధులు అందరూ కలిసి ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు ఈ సందర్భంగా కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ పర్యటనకు ఏర్పాట్లన్నీ గావించిన శుభోదయం బాలసుబ్రమణ్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగపూర్ గాయనీ గాయకులు అలనాటి అందమైన పాటలను పాడి ఘంటసాలవారికి జోహార్లు అర్పించగా, ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్త అయిన రాధిక మంగిపూడి సభా నిర్వహణ గావించారు. సింగపూర్‌లో పంగోల్ లోని జిఐఐయస్ ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్ లో వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరవగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, శిష్ట్లా వంశీ సాంకేతిక నిర్వహణా బాధ్యతలు వహించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు. -
ఘంటసాల జీవితం వడ్డించిన విస్తరి కాదు.. ఆయన పారితోషికం ఎంతో తెలుసా?
ఆ స్వరం వింటే చాలు తెలుగు వారు పులకించి పోతారు. ఆ పేరు విన్నా.. తలచినా.. పాట మురిసి పోతుంది. పద్యం పరవశించి పోతుంది. జానపదాల నుంచి జావళీల దాకా భక్తి గీతాల నుంచి అష్టపదుల దాకా ఆయన ముద్ర కనిపిస్తుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు కృష్టాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో పుట్టిన ఒక సామాన్యమైన వ్యక్తి తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారంటే స్వరస్వతీ దేవి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాయబట్టే. ఆయనే తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే ఘంటసాల వెంకటేశ్వరరావు. డిశంబరు 4 ఆయన శతజయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో 1922 డిసెంబరు 4 వ తేదీన సామాన్య కుటుంబంలో జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం వడ్డించిన విస్తరి కాదు. బాల్యంలో బాలారిష్టాలతో గడిచింది. 1936లో తన 14వ ఏట తన దగ్గరున్న బంగారు ఉంగరాన్ని అమ్మి సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం చేరుకున్నారు. విజయనగరం రాజులు కళా పోషకులు కావడంతో అనేక విద్యాలయాలను ప్రారంభించారు. వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రోత్సాహంతో పాట్రాయని సీతారామశాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. 1941లో విద్వాన్ పట్టాతో కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 1944లో మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం మద్రాసు ప్రయాణమైన ఘంటసాల సినీ ప్రస్థానం 1974 పిబ్రవరి 11న ముగిసింది. సినీ ప్రస్ధానం: ఘంటసాల మాస్టారి సమీప బంధువైన సినీరంగ ప్రముఖుడు సముద్రాల రాఘవాచారి ఆశీస్సులతో 1944లో మద్రాసు చేరుకున్నారు. అవకాశాల కోసం ఏడాది పాటు ఎదురు చూశారు. 1945లో తొలిసారిగా ఆయన స్వరం గాజులపిల్ల పాట(స్వర్గసీమ) ద్వారా తెలుగు వారికి పరిచయమైంది. ఇక ఆయన వెనక్కు తిరిగి చూసుకునే అవసరం లేక పోయింది. వేలాది గీతాలు పాడారు. భక్తి గీతాలు, విషాద గీతాలు. సోలో ఇలా... పాట ఏదైనా మాస్టారి పాటలకు మంత్రముగ్ధులు కాని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఘంటసాల కేవలం సినీ గాయకుడే కాదు...స్వాతంత్య్ర సమరయోధుడు, సినీ నిర్మాత, సంగీత దర్శకుడు. పలు భాషల్లోని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తన జీవిత చరమాంకంలో ఘంటసాల గానం చేసిన భగవద్గీత ఆయనకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది. విదేశాలలో సహితం అక్కడున్న తెలుగువారికి గాన విందు పంచి పెట్టారు ఘంటసాల. సినిమాలో ఆయన తొలి పారితోషికం 116 రూపాయలు. అప్పటి సినీ నేపథ్యగాయకులు, గాయనీమణులు దాదాపుగా ఆయనతో కలసి పాటలు పాడారు. హెచ్ఎంవీ సంస్థ తొలి దశలో ఆయన స్వరం రికార్డులకు పనికి రాదంది. తరువాత వారే ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఘంటసాల పేరుతో పోస్టల్ స్టాంప్ ఘంటశాల మరణానంతరం 2003లో ఆయన పేరుతో తపాలా శాఖ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసి ఆయన పట్ల తన భక్తిని చాటుకుంది. అభిమానులు ఊరూరా ఘంటసాల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని తమ అభిమానం చాటుకున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డిసెంబరు నాలుగవ తేదీన ఘంటసాల శత జయంతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. 1970 లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.1972లో రవీంద్రభారతిలో కచేరీ నిర్వహిస్తూ ఉండగా ఆయనకు తొలిసారిగా గుండెనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరారు.1974లో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అదే ఏడాది ఫిబ్రవరి 11న మద్రాస్‌లోని విజయా హాస్పిటల్లో తెలుగు ప్రేక్షకుల హృదయాలను విడిచి ఆయన గంధర్వలోకానికి తరలిపోయారు. టేకుపల్లిలో 4న ఘంటసాల కళామండపానికి శంకుస్థాపన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూర్యనారాయణ స్వగ్రామం కృష్ణాజిల్లా మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామం. ఘంటసాల గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో మేనమామ ర్యాలీ పిచ్చిరామయ్య ఇంటి వద్ద జన్మించారు. తండ్రి సూర్యనారాయణ స్థానిక రామేశ్వరస్వామివారి ఆలయంలో పూజారిగా ఉండేవారు. పేదరికం వల్ల తండ్రి మృదంగం వీపున కట్టుకుని, గ్రామాల్లో భగవత్ కీర్తనలు ఆలపిస్తుండగా ఘంటసాల నృత్యం చేస్తుండేవారు. 11వ ఏటనే తండ్రిని కోల్పోవడంతో చౌటపల్లిలో మేనమామ వద్దనే పెరిగారు. ఘంటసాల స్వగ్రామమైన టేకుపల్లిలో ఆయన శత జయంతి సందర్భంగా ఈ నెల 4వ తేదీన ఘంటసాల పేరుతో కళా మండపానికి శంకుస్థాపన చేయనున్నారు. ఘంటసాల పాటల చరిత్ర భావితరాలకు అందాలి అమరగాయకుడు ఘంటసాల గాన చరిత్ర భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఘంటసాల పాటలను సేకరించడం మొదలు పెట్టాను. వందలాది పాటలతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చాను. నేను సేకరించిన ఘంటసాల సంపూర్ణ తెలుగు పాటలను శతవర్ష ఘంటసాల పేరుతో వచ్చిన పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. –చల్లా సుబ్బారాయుడు ఘంటసాల పాటల సేవకుడు -
సింగపూర్‌లో శతాబ్దిగాయకుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాలు
శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్‌లో డిసెంబర్ 4వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. "గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహిస్తూవస్తున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమం యొక్క సమాపణోత్సవం, సింగపూర్ లో ఘంటసాల శతజయంతి రోజున నిర్వహిస్తున్నామని, దీనికై భారతదేశం నుండి వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, చంద్రతేజ, సురేఖ మూర్తి లాంటి ప్రముఖ నేపద్య గాయనీ గాయకులు, వాద్య కళాకారులు, హాంకాంగ్ నుంచి జయ పీసపాటి, తదితర అతిథులు హాజరు కానున్నారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారని" శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు తెలియజేశారు. భారతదేశం నుండి వస్తున్న ప్రముఖ గాయని గాయకులచే ప్రత్యేక సంగీత విభావరితో పాటు శుభోదయం ఆధ్వర్యంలో నిర్మించిన 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ ట్రైలర్ ఆవిష్కరణ, వంగూరి ఫౌండేషన్ వారి 'మన ఘంటసాల' పుస్తకావిష్కరణ అదనపు ఆకర్షణలుగా నిలవనున్నాయి. రాధిక మంగిపూడి ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. సింగపూర్ గాయనీ గాయకులు తమ పాటలతో ఘంటసాలకు జోహార్లు అర్పించనున్నారు. సింగపూర్‌లో Punggol లోని GIIS ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరిగే ఈ కార్యక్రమానికి నిర్వాహకబృందం సింగపూర్ తెలుగు ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టు ప్రకటించింది. -
'ఘంటసాలకు భారతరత్న వస్తే అవార్డుకే అందం'
స్వాతంత్ర సమరయోధుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్రం అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నీలిమ గడ్డమణగు వ్యాఖ్యాతగా సెప్టెంబర్ 18న వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అంశంపై అమెరికాలోని శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ' మీరందరు విదేశాల్లో ఉండి కూడా ఘంటసాలకి భారతరత్న రావాలన్న మీ ప్రయత్నాలకు మా అందరి తరఫున అభినందనలు. ముఖ్యంగా ఘంటసాల కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం, అందరినీ కలుపుకొని పోవడం అభినందనీయం. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద.. స్వాతంత్ర సమరయోధుడు. వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడటం ఇలా అన్ని విధాలుగా వారు భారతరత్నకు అర్హులు' అని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం గురించి ఈ మధ్యనే విన్నా. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకే అందం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు అందిస్తే మా నాన్న నాకు ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని అందించారు. అదే మా నాన్న నాకిచ్చిన వారసత్వం. ఆయన పాటలు, సాహిత్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తానని' తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మా ముందు తరాల వారికీ ఆయన ఒక దేవుడు. సంగీతం లో గాన గంధర్వుడు. మంచి గాయకుడే కాకుండా 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాకు ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన రెండు సినిమాలు మాయాబజార్, గుండమ్మ కథ. ఆ సినిమాలో వారు పాడిన పాటలు ఇప్పటికి ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన శతజయంతి ఉత్సవాలు జరపడం గొప్ప విషయం. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఆయనకు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలని కోరారు. విదేశాల్లోని తెలుగు సంస్థలు, ఇతర సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో గతంలో ఘంటసాల కార్యక్రమాలకు సాంకేతిక సహాయం అందించిన ప్రమీలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, ప్రముఖ సింగర్స్ గీత మాధురి, మాళవిక, ఇండియన్ ఐడల్ రన్నరప్ రోహిత్, అనురూప్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యూఎస్ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్, లక్ష్మయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఘంటసాల తెలుగు పాట చిరునామా మాత్రమే కాదు పాటల సౌధానికి పునాది: అనంత్ శ్రీరామ్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 190 టీవీ చర్చ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు అయిన రత్నకుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, శ్యాం అప్పాలి, విజు చిలువేరు, నీలిమ గడ్డమణుగు, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమంను నిర్వహించగా.. మొదటి మూడు భాగాలు 21, 28 ఆగస్టు, 4 సెప్టెంబర్ నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 11 సెప్టెంబర్ నాడు చివరి భాగం ప్రసారమైందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా బాల రెడ్డి ఇందూర్తి శత గళార్చన నాల్గవ (చివరి) భాగంలో పాల్గొన్న ముఖ్యఅతిథి ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలుగు పాటకి చిరునామె కాదు తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారని కీర్తించారు. ఘంటసాలతోనే తెలుగు పాట ప్రపంచవ్యాప్తమైందన్నారు. అలాగే జర్మనీ లాంటి తెలుగుకి ఏ మాత్రము సంబంధం లేని దేశాలలో కూడా ఆయన ప్రదర్శన అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది అంటే అది తెలుగు బాషాకి ఎంత ఔన్నత్యం ఉందొ తెలుగు బాషాని ప్రాచుర్యం చేసిన ఆయన గొంతుకి కూడా ఉన్నతి, ఆ ఘనత దక్కుతుందన్నారు. పాటలకు చమత్కారం జోడించి పాడటం అనేది అది వారికొక్కరికే సాధ్యమయ్యిందని తెలిపారు. నిజంగా ఇలాంటి గాయకుడు ఉండటం వల్లనే తెలుగు భాష ఇంత పరిఢవిల్లుతుంది అని అనిపించింది.. ఘంటసాల గారి పుష్పవిలాపం, కుంతి విలాపం, గోవిలాపం గాని పద్యాలు మనం వింటే చదువుతున్నప్పుడు ఆ పద్యం లోని భావం అర్ధం కొంతవరకు అవగతం అవుతుందేమో కానీ వారు పాడుతున్నప్పుడు భావం, అర్ధంతో పాటు కవిలోని ఆర్ద్రత కూడా ఆవిష్కరించబడింది. ఇలాంటి గాయకుడు దొరకడం తెలుగు వారిగా మన అదృష్టం.. ఇలాంటి గాయకుడు పాడిన బాషాని విని అర్థం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం, అటువంటి గాయకుడు నభూతో నభవిష్యత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. శత గళార్చన నాలుగు భాగాల స్వాగతోపన్యాసంతో మనల్ని అలరించిన శారద ఆకునూరి (హ్యూస్టన్, USA), ఈ చివరి భాగంలో తన బృందం నుంచి వరప్రసాద్ బాలినేని, పేరూరి వెంకట సోమశేఖర్, కృష్ణ నాలాది, రాజశేఖర్ సూరిభొట్ల, సురేష్ ఖాజా, జ్యోతిర్మయి బొమ్ము, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాది, సత్యనారాయణ ఉల్మురి, ఉష మోచెర్ల ఘంటసాల పాటల ద్వారా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమములో శ్యామ్ అప్పాలి (లాస్ ఏంజెలెస్, USA) బృందం నుంచి సాయి కాశీభొట్ల, శ్రీనివాస్ రాణి, ప్రసాద్ పార్థసారధి, సుధాకర్, వర్మ అల్లూరి, శ్రీహర్ష, శ్రీవల్లి శ్రీధర్, శ్రీయాన్ కంసాలి, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, అనూష వెన్నల, గౌరిధర్ మధు, రాజ్యలక్ష్మి వుదాతు, మీనాక్షి అనిపిండి, శాంత సుసర్ల, రఘు చక్రవర్తి, శ్రీధర్ జూలపల్లి, హరీష్ కొలపల్లి, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఇరువరం పాల్గొన్నారు. శ్యాం అప్పాలి శత గళార్చన 4 భాగాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందించారు. శతగళార్చన కార్యక్రమంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, వారి కోడలు కృష్ణకుమారి మాట్లాడుతూ ముందుగా "ఘంటసాల కు భారతరత్న" కోసం కృషి చేస్తున్న 33 దేశాల నుంచి 119 మంది పాల్గొనడం చాలా సంతోషం కలిగిందని, వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. అలాగే విశిష్ట అతిధులుగా దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, గేయ రచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులుకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇన్ని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించిన బాలరెడ్డి ఇందుర్తి, సింగపూర్ రత్న కుమార్ కవుటూరు ధన్యవాదములు తెలియచేసారు. శత గళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని. చాలా మంది ప్రముఖులు "ఘంటసాల గారికి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
ఘంటసాలను భారతరత్న పురస్కారంతో గౌరవించాలి : గీత రచయిత చంద్రబోస్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమంటూ శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 120 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకొస్తోంది. ఇందులో భాగంగా హాంకాంగ్ నుంచి జయ పీసపాటి (వ్యవస్థాపక అధ్యక్షురాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య) జూన్ 19న జరిగిన అంతర్జాల కార్యక్రమములో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఘంటసాలకు ‘భారతరత్న’ కోసం చేస్తున్న కృషి అభినందనీయం- చంద్రబోస్ నంది పురస్కార గ్రహిత, గీత రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఘంటసాలకు భారతరత్న పురస్కార కోసం 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కృషి చేయడం అభినందనీయమన్నారు. గాయకుడిగా ఘంటసాల ఎన్నో అత్యద్భుత గీతాలను ఆలపించి ఇప్పటికి ఎన్నటికీ తెలుగువాడి పాటను ప్రపంచ ఖ్యాతిని నలుచెరుగులా రెపరెపలాడించారన్నారు. సంగీత దర్శకుడిగా వందకుపైగా ఆణిముత్యాలు లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం భారతదేశ సినీ పరిశ్రమ మొత్తంలో వారికే చెల్లిందని కొనియాడారు. ఘంటశాల అమృతం గళంనుంచి జాలువారిన దేశభక్తి ప్రభోదించే గీతాలతోపాటు, కుంతీ విలాపం, పుష్ప విలాపము, బంగారుమామ జానపద గేయాలు, జాషువా గారి బాబాయ్ పాటలు మనుషుల జీవన ప్రమాణాలను ప్రభోదించే భగవత్గీత లాంటివాటిని గుర్తు చేశారు. బాల్యంలో కడు పేదరికాన్ని అనుభవంచి వారాలు గడిపి సంగీతం నేర్చుకొని సినీ పరిశ్రమలో ఎవరు అందుకొని మైలురాళ్ళను చేరుకోగలిగారనీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వ్యక్తి అని, ఇప్పటికైనా వారి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని, ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. భారతదేశ గర్వించదగ్గ మహోన్నత గాయకుడు ఘంటసాల అని మరొక ముఖ్య అతిధి, గాయకుడు, సంగీత దర్శకుడు, పార్థ నేమాని కొనియాడారు. 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాల గారిని మించిన భారతరత్నం ఏముంటుంది అని చెబుతూ వారు నిజంగా భారతరత్న'మే అని కొనియాడారు. పాటలతో సభికులను అలరించారు. చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 దేశాల సేవలను కొనియాడారు. యు.యెస్.ఏ నుండి డా. రాఘవ రెడ్డి గోసాల, ఉత్తర అమెరికాతెలుగు సంఘం నాటా మాజీ అధ్యక్షుడు, గంగసాని రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడాలి చక్రధరరావు తాన ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2003/05, వ్యవస్థాపక అధ్యక్షుడు టెన్నిస్సీ తెలుగు సమితి 1995/97, డాక్టర్ జయసింహ సుంకు, ఛైర్మన్, NRI వాసవి, ఐర్లాండ్ నుండి రాధా కొండ్రగంటి అధ్యక్షురాలు, ఐర్లాండ్ తెలుగుఅసోసియేషన్, జపాన్ నుండి శాస్త్రి పాతూరి, వాలంటీర్, జపాన్ తెలుగు సమాఖ్య, భారతదేశం నుండి కోలపల్లి హరీష్ నాయుడు, బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలోని తెలుగు సంస్థలతో 123 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. -
అమరగాయకుడు ఘంటసాలకు భారతరత్న పురస్కారం: సంతకాల సేకరణ
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఘంటసాలకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ప్రచారాన్ని చేపట్టారు. ఈక్రమంలో ఇప్పటివరకు 110 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూల ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా న్యూజిలాండ్ నుండి శ్రీలత మగతల వ్యాఖ్యాతగా 2022 జూన్ 5 న జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమంలో నంది పురస్కార గ్రహిత, గానసామ్రాట్ డా.మనో (నాగూరుబాబు) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 28 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అమరగాయకుడు, పద్మశ్రీ ఘంటసాలకు భారత రత్న పురస్కారం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాల గళంనుంచి జాలువారిన కొన్ని పాటల పల్లవులను పాడి అలరించారు మనో. ముఖ్య ఉపన్యాసకులు శైలేష్ లఖ్టాకియా (ఐ.ఎఫ్.యస్) ఈ కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల స్వయంగా హిందీలో పాడి స్వరకల్పన చేసిన ఝండా ఊంచా రహే హమారా పాటను గుర్తు చేసారు. అలాగే చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణకుమారి అతిథిగా పాల్గొని అందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న 28 దేశాల సేవలను సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు కొనియాడారు. శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు ప్రసాద్ రాణి, ఆస్ట్రేలియా సిడ్నీ నుండి తబలా విధ్వాంసులు, ఆదిశేషు కోట, తెలుగు భాగవత ప్రచారసమితి అధ్యక్షులు, భాస్కర్ వులపల్లి, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, అనిత మొగిలిచెర్ల, ఇండియానుంచి జీవీ రమణ (RACCA, రాజమహేంద్రవరం) గాయకుడు, నిర్వాహకుడు, శివరామి రెడ్డి వంగ అడ్మిన్, మా నాన్నాఘంటసాల, తెలంగాణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, పాటలలోని మాధుర్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని కోరారు. ఇందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా కలుపుకొని భారతరత్న వచ్చేంతవరకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు స్విట్జర్లాండ్ ,నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 113 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. అలాగే ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందన్నారు. change.org ద్వారా తమ ఉద్యమానికి మద్దతు తెలియజేయాలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. -
ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 100 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 8 మే 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో పద్మవిభూషణ్ డా కెజే ఏసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గొప్ప గాయకుడు, మానవతావాది, కళాకారులు అని చెపుతూ.. మా చిన్ననాటి రోజుల్లో దేవదాసు సినిమా పాటలు విని పెరిగానని, ముఖ్యంగా ఘంటసాల పాడిన శాంతినివాసం సినిమా మలయాళంలో అనువాదం అయినప్పుడు ఆ సినిమాకి ఘంటసాల తెలుగులో పాడిన తెలుగు పాటకు నేను మలయాళంలో పాడటం అది నా కెరీర్ లో రెండవ సినిమా అవడం చాలా అదృష్టమని తెలిపారు.. తన కెరీర్ ప్రారంభంలో ఘంటసాల గారితో కలసి పాడటం అప్పుడు వారి నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకోవడం అది తన అదృష్టం మరియు దైవ సంకల్పం అని చెప్పారు... అలాగే ఘంటసాల తెలుగులో ఎక్కువగా పాటలు పాడిన అక్కినేని నాగేశ్వర రావు గారి సినిమాలకు కొన్ని పాటలు పాడటం, మేఘసందేశం సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం లభించడం నా అదృష్టమని తెలిపారు. ఘంటసాల గొప్ప గాయకుడు అని చెపుతూ ఈ కాలం గాయకులలో 100 కు 99 మంది వారిని ఆదర్శంగా తీసుకొని గాయకులుగా రాణిస్తారని, ఇదే విషయాన్నీ SPB బాలు ఎప్పుడు చెపుతుండేవారిని ఈ సందర్భంగా బాలుని కూడా నెమరువేసుకున్నారు... వారి ఆలపించిన భగవద్గీత ఇప్పటికి మనందరి మదిలో ఉంటుందని... నేను ఇప్పటికి భగవద్గీతని పూర్తి గా ఆలపించలేపకపోయానని కానీ ఘంటసాల అతి తక్కువ సమయంలో పూర్తిచేయగలిగారని తెలిపారు. దక్షిణ భారత గాయకులు అందరికి ఎంత గొప్ప గౌరవం ఉందొ ఉత్తరాది గాయకులు అయిన లతా మంగేష్కర్, మహమ్మద్ రవి వంటి గాయకులు కూడా అంతే గౌరవం ఘంటసాల గారి మీద చూపే వారని తెలుపుతూ రెండు పాటల పల్లవులను పాడి టీవీ ప్రేక్షకులను అలరించారు... ఘంటసాల భారతరత్న పురస్కారానికి పూర్తిగా అర్హులు అని తెలియచేస్తూ తన పూర్తి మద్దతుని తెలియచేసారు... చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల అతిథిగా పాల్గొన్నారు.. వారు మాట్లాడుతూ నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. యు.యెస్.ఏ నుండి చైర్మన్, గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యు.యెస్.ఏ ప్రవాసీ భారతీయ సమ్మాన్, సుబాష్ రజ్దాన్ , FACC డైరెక్టర్, GAPI వాలంటీర్ క్లినిక్ డా. శ్రీని గంగసాని M.D, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు వంశి కృష్ణ ఇరువరం, మలేషియా నుండి మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకట ప్రతాప్, సింగపూర్ నుండి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, స్కాట్లాండ్ నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, UK అధ్యక్షుడు శివ చింపిరి, నైజీరియా నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా అధ్యక్షుడు మూగలమర్రి లోకనాథరెడ్డి, స్విట్జర్లాండ్ నుండి స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షురాలు గని కడలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ, పద్మవిభూషణ్ డా కెజే ఏసుదాస్ ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలపడం ఒక గొప్ప శుభపరిణామనని, ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి తోడ్పాటు అందించిందని తెలియచేస్తూ, ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అందరు ముక్త కంఠంతో కోరారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు స్విట్జర్లాండ్ ,నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 103 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, వివారాలు మీ అందరికోసం: -
100 రోజులకు చేరుకున్న ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’
ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, "వంశీ ఇంటర్నేషనల్" & "శుభోదయం గ్రూప్స్" కలిసి నిర్వహించిన అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించనున్న "ఘంటసాల స్వర రాగ మహాయాగం" కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ నేడు 100వ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. "2021 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఖతార్, బహరైన్, ఒమాన్, అమెరికా మొదలైన దేశాలనుండి గాయనీ గాయకులు పాల్గొని ఘంటసాల వారి గీతాలను ఆలపించారు. ఇదే ఉత్సాహంతో సింగపూర్‌లో జరగబోయే ముగింపు సభ, "ఘంటసాల శత జయంతి" ఉత్సవాలకు సిద్ధమవుతున్నామని" వంశీ సంస్థల అధ్యక్షులు డా. వంశీ రామరాజు తెలిపారు. 100వ రోజు సందర్భంగా ప్రముఖ సినీ కవి భువనచంద్ర, అమెరికా నుండి ఇందుర్తి బాల రెడ్డి నిర్వాహక సంస్థల అధినేతలు డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, సింగపూర్ నుండి కవుటూరు రత్న కుమార్, డా లక్ష్మీ ప్రసాద్, సమన్వయకర్త ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఘంటసాల వారికి 'భారతరత్న' పురస్కారం లభించడం సమంజసమని ప్రముఖులందరూ కలసి అభిప్రాయం వ్యక్తం చేశారు. అతిధుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీగాయకులందరకు ఇవ్వబడే ధృవపత్రాలను వంశీ సంస్థ ఆవిష్కరించింది. ప్రముఖ గాయకుడు తాతా బాలకామేశ్వర రావు ఘంటసాల వారి చక్కటి వైవిధ్యభరితమైన పాటలను, పద్యాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించగా, శుభోదయం మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలలోని తెలుగువారందరూ వీక్షించి ఆనందించారు. (చదవండి: క్యాబ్ డ్రైవర్‌గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?) -
సింగపూర్ వేదికగా ఘంటసాల స్వర రాగ మహాయాగం
అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర వేడుకలు నిరాటకంగా సాగుతున్నాయి. ఘంటసాల శతజయంతి సందర్భంగా 'ఘంటసాల స్వర రాగ మహాయాగం' పేరుతో 366 రోజులపాటు స్వర రాగ మహాయాగం కొనసాగుతోంది. 'ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్, 'వంశీ ఇంటర్నేషనల్' 'శుభోదయం గ్రూప్స్' సంయుక్త ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 366 రోజులపాటు నిర్వహింపబడే 'ఘంటసాల స్వర రాగ మహాయాగం' లో భాగంగా సింగపూర్ గాయకులచే 58 వ రోజు కార్యక్రమం జనవరి 30, 2022 సమయం: 12:30 గంటలకు (సింగపూర్ కాలమానం ప్రకారం) నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ కింది లింక్స్ లో చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు. https://www.facebook.com/events/2799312443705780/ https://www.youtube.com/watch?v=xJDLIPIYMvY చదవండి: నిరాటంకంగా ఘంటసాల స్వర రాగ మహాయాగం -
ఘంటసాల ఘన స్మరణ
ఇంటి నుంచి పారిపోయిన నౌషాద్ ముంబైలో పెద్ద సంగీత దర్శకుడయ్యాడన్న సంగతి ఇంట్లో తెలియదు. దర్జీ అని చెప్పుకున్నాడు. దర్జీ అనే తండ్రి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి లక్నో వెళ్లి గుర్రం మీద ఊరేగుతుంటే నౌషాద్ కట్టిన పాటలనే బ్యాండు మేళం వాళ్లు వాయించడం మొదలుపెట్టారు. గుర్రం మీద ఉన్న పెళ్లికొడుకే వాటికి సంగీత దర్శకుడని బ్యాండు వాళ్లకు తెలియదు. పెళ్లి వాళ్లకూ తెలియదు. ఘంటసాల ఆ నౌషాద్ కంటే మూడేళ్లు చిన్న. మేనమామ కూతురైన సావిత్రిని వివాహమాడి ఆ సాయంత్రమే అతిథుల కోసం నుదుట బాసికం, పెళ్లి చుక్కతో కచ్చేరీ చేశాడు. ఇలాంటి ఘనత, పరంపర ఉత్తరాన నౌషాద్కు, దక్షిణాన ఘంటసాలకే ఉంది. ‘శేష శైలావాస.. శ్రీ వెంకటేశా’... వేంకటేశ్వరుని ఎదుట ఘంటసాల పద్మాసనం వేసుకుని పాడుతుంటే ఘంటసాల ఇలా ఉంటాడా అని కళ్లు ఇంతింత చేసుకుని చూశారు సామాన్య జనం. నిన్న మొన్నటి వరకూ ప్రతి ఊళ్లో మార్నింగ్ షో మొదలెట్టే ముందు ఘంటసాల పాడిన ‘నమో వెంకటేశా..’ ప్లే చేయడం సెంటిమెంటు. ఘంటసాల బతికినంత కాలం సినిమా ఆయనకు సిరి, సంపద ఇచ్చింది. ఘంటసాల తాను పోయాక కూడా సినిమాకు స్ఫూర్తి ఇస్తూ వెళ్లాడు. కోట్ల మంది తెలుగువారికి మాత్రలు అక్కర్లేని స్వస్థతను ఇస్తూనే వెళుతున్నాడు. కనుకనే సుమతీ శతకకారుడు అప్పిచ్చువాడు, ఎడతెగక పారే ఏరు, ఘంటసాల పాట లేని ఊరు తక్షణమే వదిలిపెట్టమన్నాడు. సంస్కృతి కొందరిని పుట్టిస్తుంది. కొందరు పుట్టి సంస్కృతిగా మారుతారు. ఘంటసాల తెలుగువారి సంస్కృతి. తెలుగువారి ఉషోదయం... ఎండకాసే మధ్యాహ్నం... వీవెనలు వీచే రాత్రి కూడా. ‘దినకరా... శుభకరా’ ఉదయాన్నే వినాలి. ‘పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు’... మధ్యాహ్నం వినాలి. రాత్రి నిద్రపోయే ముందు ‘పాడుతా తీయగా చల్లగా’ వినాలి. ఉత్తమమైన తెలుగు సాహిత్యం పట్ల రుచి కలిగి ఆ సాహిత్యం జాతికి అందాలి అని సొంతగా రికార్డులు విడుదల చేసినవాడు ఘంటసాల. ‘కుంతీ విలాపం’, ‘పుష్ప విలాపం’, ‘తల నిండ పూదండ దాల్చిన రాణి’, ‘రావోయి బంగారి మామా’.... ఇక అనారోగ్యంతో ఉన్నానని తెలిసి కూడా బాధ్యతగా ఆథ్యాత్మిక సంపదగా ఇచ్చి వెళ్లిన ‘భగవద్గీత’ది చెల్లించలేని రుణం. భగవద్గీత శ్లోకాలకు బాణీ కట్టడంలో ఘంటసాల ఎంత జీనియస్నెస్ చూపించాడో మ్యూజిక్ రివ్యూయెర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ రాసిన వ్యాసాలు చదివితే తెలుస్తుంది. ‘నీవేనా నను పిలిచినది... నీవేనా నను తలచినది...’... ఘంటసాల కట్టిన పాట ఇది. ఆ కాలంలోనే వేరొక గొప్ప సంగీత దర్శకుడు ఉండేవాడు. అతడు బాణీలు కడుతుంటే హార్మోనియం మెట్లను చూస్తూ నిర్మాత నాగిరెడ్డి ‘ఎప్పుడూ తెల్లవే నొక్కకండి. నల్లవి కూడా నొక్కండి’ అనేవాడట. అంటే పాశ్చాత్య బాణీలను కాపీ చేయొద్దు అని సూచన. కాని ఘంటసాల బాణీలన్నీ దేశీయమైనవి. ఆయన తన హార్మోనియం మెట్ల మీద నల్ల మెట్లను నొక్కడానికే ఇష్టపడ్డాడు. ‘తెల్లవార వచ్చె తెలియక నా స్వామి...’. ఘంటసాల మహా గాయకుడైన బడే గులాం అలీఖాన్ ఏకలవ్య శిష్యుడు. కర్ణాటక సంగీతంతో పాటు హిందుస్థానీ ప్రియుడు. బడే ఎప్పుడు మద్రాసు వచ్చినా రెండు మూడు నెలలు ఘంటసాల ఇంట్లోనే బస. కనుకనే ఘంటసాల పాడిన పాట మాత్రమే కాదు కట్టిన పాట కూడా దేశీయమైనది. ‘కొండలే రగిలే వడగాలి... నీ సిగలో పూలేనోయ్’... రిక్షాలో వెళుతున్న పండితుడు పక్కనున్న వ్యక్తితో ‘ఈ మాటకు అర్థమేంటండీ’ అని తర్కిస్తూ ఉంటే రిక్షావ్యక్తి ‘తాగుబోతు మాటలకు అర్థాలేముంటాయి బాబయ్యా’ అన్నాడట. ఘంటసాల తెలుగువారి తొలి మాస్ సింగర్. ‘వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’.. రొమాంటిక్ సింగర్. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి...’ లేడీస్ ఫాలోయింగ్ ఉన్న సింగర్. ‘జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా’... మోటివేషనల్ సింగర్. ‘ఘనాఘన సుందర’... ఆధ్యాత్మిక సింగర్. ‘తెలుగు వీర లేవరా.... దీక్ష బూని సాగరా’... రివెల్యూషనరీ సింగర్. ‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’ ట్రాజెడీ సింగర్... ‘ఒహొ సుందరి నీ వంటి దివ్య స్వరూపం’... కామెడీ సింగర్. ఘంటసాల వంటసాలలో పక్వానికి రాని ఫలం లేదు. కుదరని పాకం లేదు. ఘంటసాలతో కలిసి రావు బాలసరస్వతి, పి.లీల, జిక్కి, సుశీల, జానకి... తెలుగువారికి తేనె రాసిన తమలపాకులను అందించారు. ఆ చరణమే చర్వితం. చర్వితమే ఆ చరణం. 1974 ఫిబ్రవరి 11న తన 52వ ఏట ఘంటసాల మరణించాడు. ఇది దేహ గతింపుకు సంబంధించిన వార్తే తప్ప తెలుగువారికి ఆయన గానంతో వచ్చిన ఎడబాటు కాదు. అలాంటి ఎడబాటు ఎన్నటికీ రాదు. ఘంటసాల పాట గతంలో ఉంది. నేడు ఉంది. రేపు ఉంటుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ 4న ఘనంగా మొదలయ్యాయి. 2022 డిసెంబర్ 4 వరకూ ఇవి ఊరు వాడలా జరుగుతాయి. ఘంటసాల ఘనతను స్మరించుకోవడం అంటే తెలుగవారు తమ కీర్తి కిరిటానికి కొత్త బంగారు నీరు ఎక్కించుకోవడం. ఆ మహనీయునికి వంద వందనాలు. ఈ సంవత్సరమంతా ఆయన పాటల చందనాలు. ప్రతి ఇంటా ఘంటసాల పాట ప్రాప్తిరస్తు. -
అమరగాయకునికి అద్భుత నివాళి.. 365 రోజుల పాటు ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా శనివారం(డిసెంబర్ 5) సాయంత్రం వారి జయంతిని పురస్కరించుకుని అమెరికా నుంచి ‘వంగూరి ఫౌండేషన్’, సింగపూర్ నుంచి ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, భారత్ నుంచి ‘ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్’, ‘వంశీ ఇంటర్నేషనల్’, ‘శుభోదయం’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 365 రోజుల పాటు జరగనున్న ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమాన్ని, అంతర్జాల వేదికపై ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ మహోత్సవానికి ఘంటసాల సతీమణి సావిత్రమ్మ శుభాశీస్సులు అందించగా, వారి కుమార్తెలు సుగుణ, శాంతి జ్యోతి ప్రకాశనం గావించి, ప్రార్థనాగీతం ఆలపించి శుభారంభాన్ని పలికారు. ప్రముఖ సినీ కవి భువనచంద్ర, ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు వంగూరి చిట్టెన్ రాజు, జగన్మోహనరావు, తదితర ప్రముఖులు, ఇతర నిర్వాహక బృంద సభ్యులు పాల్గొని ఘంటసాల ఔన్నత్యంపై ప్రసంగించారు. అత్యధిక కాలం నిరంతరాయంగా ఘంటసాల స్మరణలో జరిగే కార్యక్రమంగా ఈ కార్యక్రమం అంతర్జాతీయ రికార్డు సృష్టిస్తోందని అందరూ అభినందనలు వ్యక్తం చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన సంస్థలలో ఈ కార్యక్రమం రికార్డును నమోదు చేసుకోబోతోందని నిర్వాహకులు తెలిపారు. చదవండి: డల్లాస్ - తానా ఆద్వర్యంలో ఘనంగా పుస్తక మహోద్యమం! ఘంటసాల ట్రస్ట్ , వంశీ అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ... డిసెంబర్ 4వ తేదీ 2022 వరకు సంవత్సరకాలం పాటు ప్రతిరోజూ గంటసేపు ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాయనీగాయకులు ఘంటసాల పాటలను ఆలపిస్తారని, కవులు రచయితలు వక్తలు ఘంటసాల వారిపై వ్యాసాలను కవితలను వినిపిస్తారని’ ప్రకటించారు.ఎంతోమంది గాయనీ గాయకులకు అన్నం పెట్టిన ఘంటసాల పాటకు సమున్నతస్థానం కల్పిస్తూ కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తాము నిర్మించిన ‘ఘంటసాల స్మృతి మందిరం’ గురించిన వివరాలను తెలియజేసి అక్కడ జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వీడియో రూపంలో అందరికీ చూపించారు. ఈ కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు చంద్రతేజ, ఆర్ఎస్ఎస్ ప్రసాద్, తాతా బాలకామేశ్వరరావు, కె విద్యాసాగర్ చక్కటి గీతాలను పద్యాలను ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. సింగపూర్ నుంచి గుంటూరు వెంకటేష్ ఈలపై, 20 కు పైగా ఘంటసాల పాటల పల్లవుల పల్లకిని పలికించి అందరినీ ఆకట్టుకున్నారు. జీవి రామకృష్ణ సౌజన్యంతో చౌటపల్లి, టేకుపల్లి, ఘంటసాల గ్రామాల నుంచి అలాగే విజయనగరం సంగీత కళాశాల నుంచి ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఘంటసాల నడయాడిన ప్రాంతాలను చూపించారు. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ..ఇంతటి బృహత్కార్యంలో తమ సంస్థ సహ నిర్వాహకులుగా పాలుపంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవంగా ‘ఘంటసాల శతజయంతి ఆరాధనోత్సవం’ 2022 డిసెంబర్ 4వ తేదీన సింగపూర్ లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కార్యక్రమానికి అందరిని సింగపూర్ కు రావలసిందిగా కోరుతూ ఆహ్వానం పలికారు. ఘంటసాల వారితో పాటుగా ఇటీవల స్వర్గస్తులైన అతడి కుమారులు ఘంటసాల రత్న కుమార్‌ను కూడా స్మరిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధ, మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ కార్యక్రమానికి అభినందనలు తెలియజేశారు. భారత కాలమానం ప్రకారం...ప్రతి శని, ఆదివారాలలో ఉదయం 10 గంటలకు, ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సంవత్సరకాలం పాటు కొనసాగే ‘ఘంటసాల స్వర రాగ మహాయాగం’ కార్యక్రమాన్ని ‘వంశీ ఆర్ట్ థియేటర్స్’, ‘శుభోదయం మీడియా’ యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్..! భారత్‌కు వస్తోన్న ఎన్నారైలకు తప్పని తిప్పలు..! -
ఘంటసాల స్వర రాగ మహాయాగం
అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సంవత్సర సందర్భంగా 366 రోజులపాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్ మరియు శుభోదయం గ్రూప్స్ సంయుక్తంగా చేపడుతున్నాయి. 2021 డిసెంబరు 04 నుంచి 2022 డిసెంబరు 04 వరకు ప్రతీ శని, ఆదివారాలలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు (భారత కాలమానం) వర్చువల్‌గా ఈ వేడుకలు జరుగుతాయి. ప్రారంభోత్సవ ప్రత్యేక కార్యక్రమం డిసెంబరు 4 సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతుంది. -
‘పాట’శాల.. ఘంటసాల
తెలుగువారికి అపరిమితమైన మధురామృతాన్ని పంచారు. గానంతో వీనుల విందు చేశారు. స్వర కల్పనతో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. తేనెలూరు గళంతో పరవశింపజేశారు. సంగీత ప్రపంచానికి రారాజుగా వెలిగిపోయారు. అందుకే అమర గాయకుడయ్యారు. ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆ మహానుభావుడు నడయాడింది.. సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నది విజయనగరం ఒడిలోనే కావడం జిల్లా ప్రజల అదృష్టం. ఆ మహాగాయకుడి 97వ జయంతి సందర్భంగా కథనమిది. విజయనగరం టౌన్:ఘంటసాల వెంకటేశ్వరరావు పుట్టింది గుడివాడ సమీపంలో చౌటుపల్లి గ్రామంలో అయినప్పటికీ తండ్రి సూర్యనారాయణ కోరిక మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరానికి చేరుకున్నారు. సంగీతం నేర్చుకుందామనుకునే ఆత్రుతతో 1935 నుంచి 1942 మధ్యకాలంలో విజయనగరం చేరుకున్నారు. ఆయన వచ్చిన సమయానికి కళాశాల సెలవుల వల్ల మూసేసి ఉండటంతో ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లి అభ్యర్థించగా ఆయన బస చేసేందుకు అనుమతినిచ్చారు. ఘంటసాల అక్కడే ఉంటూ రోజుకో ఇంట్లో వారాల భోజనం చేస్తూ ఉండేవాడు. కళాశాలలోని ఏనుగుశాలలో ఘంటసాల నిద్రించిన గది పట్రాయుని సీతారామశాస్త్రి వద్ద శిక్షణ సంగీత కళాశాల అధ్యాపకుడు పట్రాయుని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు. వారాలు చేసుకుని కడుపు నింపుకొంటూ శ్రద్ధగా సంగీతాన్ని సాధన చేసేవారు. ఆ రోజుల్లో ప్రముఖ నర్తకి అయిన లక్ష్మీనరసమ్మ (కళావర్ రింగ్) ఘంటసాలను ఆదరించి, అన్నం పెట్టేది. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరారు. కళాశాలలో చేరినప్పటి నుంచి సింహాచల దేవస్థానం భోజనం ఉండేది. గుమ్చీ వద్ద కూర్చొని సాధన చేసేవారు. ఆయనకు అప్పట్లో సరస్వతుల వెంకటరావుతో సాన్నిహిత్యం ఉండేది. గురువు శాస్త్రి శిక్షణలో నాలుగేళ్ల కోర్సును ఘంటసాల రెండేళ్లలో పూర్తి చేశారు. తర్వాత కొన్నేళ్లు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. గురువు కుమారుడు పట్రాయుని సంగీతరావుతో కలిసి అనేక ఆర్కెస్ట్రాల్లో పనిచేశారు. ఘంటసాల పాడిన పాటలకు ఆయన పూర్తి సహకారమందించేవారు. అన్నీ ఆణిముత్యాలే.. ఘంటసాలతో తరచూ పాటలు పాడించుకుని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య , బీఎన్ రెడ్డి తమ సినిమా అయిన స్వర్గసీమలో తొలిసారి నేపధ్య గాయకుడిగా అవకాశమిచ్చారు. ఆ పాటకు ఆయనకు రూ.116 పారితోషికం లభించింది. మూగమనసులు, మంచి మనసులు, మహాకవి కాళిదాసు, పుష్పవిలాపం, భగవద్గీత, భక్త తుకారం, గుండమ్మ కథ, కన్యాశుల్కం, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలతో పాటు అక్కడి నుంచి వరుస చిత్రాలన్నీ దాదాపుగా ఆయన పాడినవే. ఎలాంటి పాటనైనా ఘంటసాల మాత్రమే పాడగలరన్న ఖ్యాతి సంపాదించారు. మనం వింటున్న భగవద్గీత ఆ మహానుభావుడు నోట నుంచి జాలువారిందే. 1970లో ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 1922 డిసెంబర్ 4న గుడివాడ చౌటపల్లి గ్రామంలో జన్మించిన ఘంటసాల 1974 ఫిబ్రవరి 11న 51 ఏళ్ల వయసులో తమిళనాడు చెన్నైలో మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. గాయకుడుమనోకి స్వర్ణకంకణ పురస్కారం ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో ఆనందగజపతి ఆడిటోరియంలో పద్మశ్రీ ఘంటసాల 97వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, చెన్నైకి చెందిన ఎస్.నాగూర్ బాబు (మనోహర్) ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆయనకు కళాపీఠం తరపున స్వర్ణకంకణ పురస్కారం అందజేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నిర్విరామ సినీ సంగీత స్వరార్చన చేస్తారు. బోల్‌బేబీ టీమ్, పాడుతా తీయగా ఫేమ్ లలిత, జీ సరిగమప విజేత సాయిదేవ హర్ష, వేద వాగ్దేవి, పవన్, సాయి, వర్ధమాన గాయకులు 50 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ పాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఆ రోజు ఉదయం గంటలకు గుమ్చీ వద్ద ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నట్టు కళాపీఠం అధ్యక్షుడు మేకా కాశీవిశ్వేశ్వరుడు తెలిపారు. మహా గాయకుడు అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, నిబద్దత, గురువు వద్ద విద్యనేర్చుకోవడానికి పడే తపన ఘంటసాలను మహా గాయకుడిని చేశాయి. ఆయన జయంతిని పురస్కరించుకుని కళాశాలలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.– బురిడి అనూరాధా పరశురామ్, ప్రిన్సిపల్, మహారాజా సంగీత, నత్య కళాశాల, విజయనగరం కళాపీఠం ఏర్పాటు ఘంటసాల అంటే ఎంతో ఇష్టంతోనే సంగీతాభిమానులందరం కలిసి ఘంటసాల స్మారక కళాపీఠం స్థాపించాం. గుమ్చీ దగ్గర ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి నెలా ఘంటసాల ఆపాత మధురాల పేరుతో క్రమం తప్పకుండా 22 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ఎమ్.భీష్మారావు,వ్యవస్ధాపకుడు, ఘంటసాల స్మారక కళాపీఠం -
శతవసంతాల కళాశాలకు మహారాజ వైభవం
విజయనగరం మహారాజా సంగీతసాహిత్య పోషణకు నిదర్శనాలు కోకొల్లలు. విజయనగరంలో ఆయన నిర్మించిన సంగీత కళాశాల నాటి కళావైభవాన్ని నేటికీ చాటుతోంది. ఒక చిన్న గాన సభగా మొదలైన ఈ కళాశాల నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో ఈ కళాశాల నుంచి ఎందరో కళాకారులు ఉద్భవించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరవాత 1957లో ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. విద్యార్థులంతా ఆంగ్ల విద్యవైపు మొగ్గు చూపుతుండటంతో ఒక దశాబ్ద కాలంగా ఇక్కడ చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రిన్సిపాల్, ఒక టీచర్, ఒక విద్యార్థి స్థాయికి పడిపోయింది. ఐదుసంవత్సరాల ఓరియెంటల్ బిఎ చదవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతుండడంతో. కాలేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది.దాంతో కళాశాల ప్రిన్సిపాల్ ఉద్యమదీక్ష పూని కాలేజీ గత వైభవాన్ని పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ‘‘సంస్కృతవిద్య కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అనే ఒక భ్రమ ఉంది చాలామందిలో. ఆ భ్రమను తొలగించేలా... కులమతాలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరికీ ప్రవేశం’’ అని కరపత్రాలు ప్రచురించి, కళాశాల చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాలలో పంచారు. ఈ ఒక్కమాటతో అనూహ్య స్పందన వచ్చింది. ఒకటి నుంచి నలభై రెండుకు... కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజులు కట్టడంతో విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి 42కు చేరింది. ఘన చరిత్ర... ఈ కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలో ఉద్యోగిగా పనిచేస్తున్న చాగంటి జోగారావుగారి కుమారుడు గంగబాబు అంధుడు. ఆ బాలుడి కోసం 1919, ఫిబ్రవరి 5వ తేదీన విజయరామ గజపతిరాజు విజయనగర గాన పాఠశాలను ఏర్పాటుచేశారు. ఆ రోజుల్లో ఆ పాఠశాలకు హరికథా పితామహుడు అజ్జాడ అదిభట్ల నారాయణదాసు అధ్యక్షులయ్యారు. అనంతరం ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు అధ్యక్షులయ్యారు. టౌన్ హాల్... విజయనగరం కోట వెనుక ప్రాంతంలోని నేటి ఈ కళాశాలను అప్పట్లో టౌన్‌హాల్ అని పిలిచేవారు. దక్షిణాదిన కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయొలిన్, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలలో శిక్షణ ఇచ్చేవారు. విచిత్రమేమిటంటే ఈకళాశాలలో నాటినుంచి నేటివరకు హరికథకు స్థానం కల్పించలేదు. ప్రముఖులు... ఘంటసాల, గాయని పి. సుశీల, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం వంటి వారంతా ఈ కళాశాల విద్యార్థులే. సినీరంగంలో సంగీత దర్శకులుగా ప్రసిద్ధులైన సాలూరి రాజేశ్వరరావు ఇక్కడ నుంచి వచ్చిన మాణిక్యమే. సంగీత చూడామణి నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం సత్యనారాయణ, ద్వారం దుర్గాప్రసాదరావు ఈ కళాశాల ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేశారు. వయొలిన్... పాశ్చాత్య తంత్రీ వాద్యమైన ఫిడేలును కర్ణాటక సంగీతం వాయించడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతం చేశారు ద్వారం వెంకట స్వామినాయుడు. ఈ కళాశాల నూరేళ్లు పూర్తి చేసుకుంది. నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం భావనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, బురిడి అనురాధా పరశురాం... వంటివారంతా ఈ కళాశాలకు అధ్యక్షులుగా పనిచేశారు. దూరం నుంచి వచ్చిన విద్యార్థులకు మేలు కలిగిస్తూ, ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా సంగీతోత్సవాలను అధ్యాపక, విద్యార్థి బృందాలు నిర్వహిస్తున్నాయి. సాంస్కృతిక శాఖ సహకరిస్తోంది. ఈ కళాశాలలోని సంగీత దర్బార్ ఎంతో విలక్షణమైనది. ఎందరో విద్వాంసులు ఈ కళాశాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. పదిసంవత్సరాలు నిండిన వారెవరైనా సంగీత, నృత్యాలలో ప్రవేశించడానికి అర్హులు. ప్రతి సంవత్సరం ఇక్కడ కళాపరిచయం ద్వారా శిక్షణ పొందినవారికి ఈ సంగీత, నృత్యకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు. పది సంవత్సరాలు నిండినవారు ఎవరైనా సంగీత, నృత్యాల్లో విద్యార్థులుగా చేరే అవకాశం ఉంది. ఒడిషా వాసులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వారికి ఇది అందుబాటులో ఉంది. ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు, ద్వారం భావనారాయణరావు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం దుర్గాప్రసాదరావు, పి.వి.యస్. శేషయ్యశాస్త్రి, బురిడి అనురాధ పరశురాం (ప్రస్తుతం) ఈ కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు. – జయంతి -
ఘంటసాలగారిలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు
‘‘ఘంటసాలగారికి సంబంధించిన నిజాలు చాలామందికి తెలియవు. ఆయన పాటలే కాదు.. ఆయన వ్యక్తిత్వం గురించి ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా సి.హెచ్.రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల’ సినిమా తెరకెక్కుతోంది. గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో, ఆయన సతీమణి మృదుల ఘంటసాల సతీమణి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంగీతంలో పద్యాలు ఎలా పాడాలో నాకు నేర్పించింది ఘంటసాలగారే. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిత్వంలో కూడా ఎంత వినయంగా ఉండాలి, ఎలా సంస్కారంగా ఉండాలనే విషయాలను ఆయన దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణుడంటే భారతం.. రామాయణం అంటే రాముడు.. పాటలంటే అందరికీ ఘంటసాలగారు గుర్తొస్తారు. సినిమాల్లోకి రాక మునుపు ఆయన స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఆయనతో కలిసి ఆరేళ్ల పాటు జర్నీ చేసి, ఐదారు సినిమాలకు పనిచేశా. ఘంటసాలగారిని నా తండ్రి సమానుడిగా భావిస్తా. ఆయన విగ్రహావిష్కరణ సమయంలో నేను పడ్డ కష్టాలెన్నో నాకే తెలుసు. ఆయనలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు. ఘంటసాల తర్వాతే.. ఎవరైనా గొప్పగా పాడుతున్నారని అంటారు. కానీ.. ఆయనంత గొప్పగా పాడుతున్నారని చెప్పరు. చెప్పలేరు.. చెప్పకూడదు కూడా. ఈ చిత్రం సెన్సార్ కావడానికి ముందే ఘంటసాలగారి భార్య సావిత్రమ్మకు సినిమా చూపించి ఏమైనా మార్పులుంటే చేస్తే మంచిది’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి బయోపిక్ ఘన విజయం సాధించాలి’’ అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ‘‘ఘంటసాలగారిపై సినిమా చేస్తే నేనే చేయాలనే స్వార్థంతోనే ఈ సినిమా చేశా. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు సి.హెచ్.రామారావు. ‘‘ఘంటసాలగారితో పోల్చదగ్గ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యంగారు మాత్రమే’’ అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. -
ఘంటసాలకు నృత్యాంజలి
⇒ నేడు గానగంధర్వ ఘంటసాల నృత్యరూపక ప్రదర్శన ⇒ రవీంద్రభారతిలో సాయంత్రం 6 గంటలకు... సిటీబ్యూరో: అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కోడలు పార్వతీ రవి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ‘గాన గంధర్వ ఘంటసాల’ పేరిట ప్రత్యేక నృత్యరూపకం ప్రదర్శిస్తున్నారు. రవీంద్రభారతి ఇందుకు వేదికవుతోంది. ఈ సందర్భంగా నగరానికి వచ్చిన పార్వతీ రవి సాక్షితో మాట్లాడారు. ఘంటసాల పాటలతో నృత్యరూపకం చేయాలనే ఆలోచన తనకు 2007లో వచ్చిందని చెప్పారు. భావితరాలు ఆయనను నిత్యం స్మరించుకునేలా చేయడమే ఈ ప్రదర్శన లక్ష్యమన్నారు. తొలిసారి పదేళ్ల క్రితం చెన్నై మ్యూజిక్ అకాడమీలో ఘంటసాల పాటలతో నృత్య ప్రదర్శన చేస్తే హాల్ పూర్తిగా నిండిపోయిందన్నారు. అప్పటి నుంచి పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు. ఘంటసాల స్ఫూర్తితోనే... అమరజీవి ఘంటసాల వెంకటేశ్వరావు స్ఫూర్తితోనే ఈ నృత్య ప్రదర్శన జాతీయంగా, అంతర్జాతీయంగా సాగుతోందని చెప్పారు. ఈ నృత్య ప్రదర్శనకు మల్టీమీడియాను జత చేశామన్నారు. ఘంటసాల పేరిట కళాకారులకు అవార్డులు ఇచ్చే యోచన కూడా ఉందన్నారు. ఘంటసాల వారసురాలిగా వీణ ఘంటసాల మూడో కుమారుడి కుమార్తె వీణ అద్భుతంగా పాటలు పాడుతుందని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తోందన్నారు. ఆమెను ఘంటసాలకు వారసురాలిగా చెప్పొచ్చని పార్వతి పేర్కొన్నారు. ఘంటసాల వారసులు స్థాపించిన ‘కళా ప్రదర్శిని సంస్థ’ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాగా ‘గాన గంధర్వ ఘంటసాల’ పేరుతో జరిగే నృత్యంలో పార్వతీ రవి ఘంటసాల, శైలజ, సంచిత భట్టాచార్య, కవితా రాము, గోపికా వర్మ(మోహినీ హట్టం), హరి, చేతన, ఎల్.నరేంద్ర కుమార్ తదితరులు పాలుపంచుకుంటారు.