అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సంవత్సర సందర్భంగా 366 రోజులపాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్ మరియు శుభోదయం గ్రూప్స్ సంయుక్తంగా చేపడుతున్నాయి.
2021 డిసెంబరు 04 నుంచి 2022 డిసెంబరు 04 వరకు ప్రతీ శని, ఆదివారాలలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు (భారత కాలమానం) వర్చువల్‌గా ఈ వేడుకలు జరుగుతాయి. ప్రారంభోత్సవ ప్రత్యేక కార్యక్రమం డిసెంబరు 4 సాయంత్రం 5:30 గంటలకు మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment