అమరగాయకుడు ఘంటసాలకు భారతరత్న పురస్కారం: సంతకాల సేకరణ | Signature Campaign for Bharat Ratna Award to Eminent Singer Late Ghantasala | Sakshi
Sakshi News home page

అమరగాయకుడు ఘంటసాలకు భారతరత్న పురస్కారం: సంతకాల సేకరణ

Published Mon, Jun 6 2022 9:02 PM | Last Updated on Mon, Jun 6 2022 9:08 PM

Signature Campaign for Bharat Ratna Award to Eminent Singer Late Ghantasala - Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా  ఘంటసాలకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్‌ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ప్రచారాన్ని  చేపట్టారు. ఈక్రమంలో ఇప్పటివరకు 110 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూల ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

ఇందులో భాగంగా న్యూజిలాండ్ నుండి శ్రీలత మగతల వ్యాఖ్యాతగా 2022  జూన్‌ 5 న జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమంలో నంది పురస్కార గ్రహిత, గానసామ్రాట్ డా.మనో (నాగూరుబాబు) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 28 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అమరగాయకుడు,  పద్మశ్రీ ఘంటసాలకు భారత రత్న పురస్కారం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు.  ఘంటసాల గళంనుంచి జాలువారిన కొన్ని పాటల పల్లవులను పాడి  అలరించారు మనో. 

ముఖ్య ఉపన్యాసకులు శైలేష్ లఖ్టాకియా (ఐ.ఎఫ్.యస్) ఈ కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల స్వయంగా హిందీలో పాడి స్వరకల్పన చేసిన ఝండా ఊంచా రహే హమారా పాటను గుర్తు చేసారు.   అలాగే చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణకుమారి అతిథిగా పాల్గొని అందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న 28 దేశాల సేవలను సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు కొనియాడారు. 

శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు ప్రసాద్ రాణి, ఆస్ట్రేలియా సిడ్నీ నుండి తబలా విధ్వాంసులు, ఆదిశేషు కోట, తెలుగు భాగవత ప్రచారసమితి అధ్యక్షులు, భాస్కర్ వులపల్లి, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, అనిత మొగిలిచెర్ల,  ఇండియానుంచి జీవీ రమణ (RACCA, రాజమహేంద్రవరం) గాయకుడు, నిర్వాహకుడు, శివరామి రెడ్డి వంగ అడ్మిన్, మా నాన్నాఘంటసాల, తెలంగాణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, పాటలలోని మాధుర్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అనే  విషయాన్ని కేంద్రం గుర్తించాలని కోరారు.  ఇందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను  కూడా కలుపుకొని  భారతరత్న వచ్చేంతవరకు సమిష్టిగా కృషి చేయాలన్నారు.  

అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు స్విట్జర్లాండ్ ,నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 113 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. అలాగే ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందన్నారు. change.org ద్వారా తమ ఉద్యమానికి మద్దతు  తెలియజేయాలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement