కాంగ్రెస్ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు సంబంధించి ‘కాంగ్రెస్ ఫైల్స్’ అనే వీడియో ట్రైలర్‌ని బీజేపీ విడుదల చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అంటే అవినీతి అనే సిరీస్ పేరుతో కాంగ్రెస్ ఫైల్స్ అనే మొదటి ఎపిసోడ్‌ను ఆదివారం విడుదల చేసింది బీజేపీ . ఆ వీడియోలో కాంగ్రెస్ తన 70 ఏళ్ల హయాంలో ప్రజల నుంచి దాదాపు రూ. 4 లక్షల కోట్ల రూపాయలు వరకు దోచుకుందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ అంటే అవినీతి సిరీస్‌కి సబంధించిన వీడియోని రిలీజ్ చేసింది.
కాంగ్రెస్ దోచుకున్న మొత్తాన్ని ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పౌర భద్రత కోసం ఉపయోగించవచ్చని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు బీజేపి ట్విట్టర్ వేదికగా ఆ వీడియో రిలీజ్‌ను ప్రకటిస్తూ.. అందుకు సంబంధించిన వీడియో ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో.. ఈ మొదటి ఎపిసోడ్‌లో కాంగ్రెస్ పాలనలో ఒకదాని తర్వాత ఒకటిగా కుంభకోణాలు ఎలా జరిగాయో చూడండి. కాంగ్రెస్ కొట్టేసిన డబ్బుతో 24 ఐఎన్‌ఎస్ విక్రంత్, 300 రాఫెల్ జెట్‌లు, వెయ్యి మంగళ్ మిషన్‌లు కొనుగోలు చేయగలిగేవాళ్లం.
కాంగ్రెస్ చేసిన మోసం కారణంగా దేశం అవన్నీ నష్టపోవడంతో విజయంలో వెనకబడిపోయిందని బీజేపీ విమర్శలు చేసింది. 2004 నుంచి 2014 వరకు సాగిన కాంగ్రెస్ పాలనను బీజేపీని కోల్పోయిన దశాబ్దంగా అభివర్ణించింది. "ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయన హాయంలో జరిగిన అవినీతిని చూసి చూడనట్లు వదిలేసారని, ఫలితంగా వార్తపత్రికలన్నీ స్కామ్ వార్తలతో నిండిపోయాయి. దేశం సిగ్గుతో తలవంచుకుంది. అని వీడియోలో పెద్ద ఎత్తున విమర్శిలు చేసింది బీజేపీ. అంతేగాదు ఆ వీడియోలో ఇంకా బొగ్గు, 2జీ స్పెక్ట్రం వంటి పలు కుంభకోణాలు గురించి కూడా ప్రస్తావించింది. వీడియో చివర్లో సినిమా ఇంకా అయిపోలేదని ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది బీజేపీ.
Congress Files के पहले एपिसोड में देखिए, कैसे कांग्रेस राज में एक के बाद एक भ्रष्टाचार और घोटाले हुए… pic.twitter.com/vAZ7BDZtFi
— BJP (@BJP4India) April 2, 2023
(చదవండి: ఆ దేశాలకు అదోక చెడ్డ అలవాటు!పశ్చిమ దేశాలపై జైశంకర్ ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment