comic book
-
కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది
‘‘కన్నప్ప’ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ్ర΄ారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1’ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు. -
ఒక్క పుస్తకానికి రూ. 3 కోట్లు!
డల్లాస్: ఓ కామిక్ పుస్తకానికి 4,54,100 డాలర్లు (సుమారు రూ. 3.12 కోట్లు) చెల్లించి తన సొంతం చేసుకున్నాడో పుస్తక ప్రియుడు. ఆ పుస్తకంలో అంత విశేషం ఏముంది అనుకుంటున్నారా. స్పైడర్ మ్యాన్ మొట్టమొదటి సారిగా దర్శనమిచ్చిన కామిక్ బుక్ అది. డల్లాస్‌కు చెందిన ప్రముఖ వేలం సంస్థ హెరిటేజ్ నిర్వహించిన పుస్తక వేలంలో మరే ఇతర స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్కు లభించనంత ఆదరణ లభించింది. న్యూయార్క్ వాసి వాల్టర్ యకోబోస్కి 1980లో పలు కామిక్ పుస్తకాలను కొనుగోలు చేసే సందర్భంగా ఈ పుస్తకాన్ని 1200 డాలర్లకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్‌లో కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని వేలంలో ఓ పేరు తెలియని వ్యక్తి ఊహించనంత ఎక్కువ ధరకు కొనడంతో వాల్టర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అపురూప పుస్తకాలకు అమెరికన్లు అత్యధిక ధర చెల్లించడం ఇదే మొదటి సారి కాదు. 1962 ఎడిషన్ అమేజింగ్ ఫాంటసీ పుస్తకం 2011లో 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. -
‘ఇండిపెండెన్స్ డే’ కథతో కామిక్ బుక్!
గ్రహాంతరవాసులు హఠాత్తుగా భూమ్మీద దాడి చేసి, విధ్వంసం సృష్టిస్తే ఎలా ఉంటుందనే దానికి వెండితెర రూపం ‘ఇండిపెండెన్స్ డే’. రోలాండ్ ఎమ్రిచ్ తెరకెక్కించిన ఈ చిత్రం 1996లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన ఏలియన్ తరహా చిత్రాలకు ఈ చిత్రం ఓ రిఫరెన్స్‌గా నిలిచిందనడం అతిశయోక్తి కాదు. ఇన్నేళ్ల తర్వాత ఈ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ రూపొందిస్తున్నారు దర్శకుడు రోలాండ్ ఎమ్రిచ్. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ యూ ట్యూబ్‌లో వీరవిహారం చేస్తోంది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక-నిర్మాతలు ఇప్పుడు దీన్ని కామిక్ బుక్ రూపంలో తీసుకురానున్నారు. హిట్ పిక్చర్స్‌కి కామిక్ టచ్ ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇటీవల జేమ్స్ కామెరూన్ కూడా తన ‘అవతార్’ను కామిక్ బుక్ రూపంలోగా తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ‘ఇండిపెండెన్స్ డే’ని కూడా పుస్తక రూపంలో విడుదల చేయడానికి రోలాండ్ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. -
సరికొత్త సూపర్ ఉమన్!
స్పైడర్మాన్, సూపర్మాన్, హీమ్యాన్, శక్తిమాన్, ఆర్యమాన్... ఇలా అద్వితీయ శక్తులన్నీ టోకుగా పురుషులకు మాత్రమే పరిమితమా? మహిళలు కేవలం రక్షించబడడానికి మాత్రమే పరిమితమా? మహిళల్లో సూపర్ ఉమన్లు లేరా? బహుశా ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కావచ్చు... ‘ప్రియ’ అనే సరికొత్త (కామిక్ బుక్) సూపర్ ఉమన్ రంగం మీదికి వచ్చింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకొని చిత్ర నిర్మాత రామ్ దేవ్నేని ధీరోదత్తమైన ఈ ‘ప్రియ’ పాత్రకు రూపకల్పన చేశారు. సాధారణంగా కామిక్ పుస్తకాల్లో వినోదం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ‘ప్రియ’ మాత్రం సామాజిక స్పృహను దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో ఆత్మస్థైర్యం నింపడానికి రూపొందిన కామిక్ పుస్తకం. ఈ పుస్తకానికి డాన్ గోల్డ్‌మాన్ వేసిన ఇలస్ట్రేషన్లు అత్యద్భుతం అని చెప్పుకోవాలి. ఇక కథ విషయానికి వస్తే... ప్రియ అనే అందమైన యువతి పార్వతీదేవి భక్తురాలు. ఉపాధ్యాయురాలు కావాలనేది ప్రియ లక్ష్యం. పరిస్థితులు బాగో లేక చిన్నతనంలోనే చదువుకు స్వప్తి చెప్పి ఇంటి పనికే పరిమితమవుతుంది. ఒకానొక దురదృష్టకరమైన రోజు కొందరు దుర్మార్గుల చేతిలో ప్రియ అత్యాచారానికి గురవుతుంది. ఇంటికి దూరమవుతుంది. కొన్ని రోజుల తరువాత ఆమె పులిపై సవారీ చేస్తూ ఊరికి తిరిగి వస్తుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గులను శిక్షిస్తుంది. అంతేకాదు... స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక హింసలను నిరోధించడానికి కంకణం కట్టుకుంటుంది. ప్రపంచానికి సరికొత్త సందేశం ఇవ్వడానికి పూనుకుంటుంది. పార్వతిదేవి ప్రియకు అండగా ఉంటుంది. ప్రియ పాత్రకు విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ముంబాయి వీధుల్లోని గోడలపై చేయితిరిగిన సినీ చిత్రకారులతో ఆకర్షణీయంగా బొమ్మలు గీయిస్తున్నారు రామ్ దేవ్నేని. తెల్లటి గోడలపై గంభీరంగా, ధైర్యసాహసాలు ఉట్టిపడేట్లు కనిపించే ప్రియ చిత్రాలు... కేవలం వర్ణచిత్రాలుగా మాత్రమే కనిపించవు... మహిళల్లో ఆత్మవిశ్వాసం, సాహసం నింపడానికి ఉద్దేశించిన సరికొత్త ఆయుధాలుగా కనిపిస్తాయి. సామాజికస్పృహను దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో ఆత్మస్టైర్యం నింపడానికి రూపొందిన కామిక్ పుస్తకం ‘ప్రియాశక్తి’ స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక హింసలు నిరోధించడానికి కంకణం కట్టుకుంటుంది ఈ పుస్తకంలోని ప్రియ పాత్ర. -
కామిక్ కాన్‌దాన్..
-
19 కోట్లు పలికిన సూపర్‌మ్యాన్!!
సాధారణంగా ఏదైనా పాత పుస్తకం ఎంత పెట్టి కొంటారు.. మహా అయితే పదో, ఇరవై రూపాయలో అవుతుంది కదూ. కానీ.. సూపర్‌మ్యాన్ కామిక్స్‌ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అరుదైన పుస్తకం ఏకంగా 19 కోట్లకు పైగా పలికింది. తద్వారా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కామిక్ పుస్తకంగా ఇది రికార్డులకెక్కింది. ఈ పుస్తకం అసలు ధర 10 సెంట్లు కాగా, ఇప్పుడది 3.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. తనవద్ద ఉన్న అత్యంత అరుదైన 'మ్యాన్ ఆఫ్ స్టీల్' పుస్తకం కాపీని అమ్మాలని దాని యజమాని డారెన్ అడమ్స్ నిర్ణయించుకుని, దాన్ని 'ఈబే'లో వేలానికి పెట్టాడు. దానికి ఆయన కేవలం 99 సెంట్లతోనే బిడ్ ప్రారంభం పెట్టాడు. అయితే.. కేవలం రెండు గంటలు కూడా గడిచాయో లేవో.. దాని ధర ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు ఎగబాకింది. చివరకు ఆదివారం రాత్రి వేలం ముగిసేసరికి ఏకంగా 3,207,852 డాలర్లకు అమ్ముడుపోయింది.