‘ఇండిపెండెన్స్ డే’ కథతో కామిక్ బుక్! | Independence Day Comic Book | Sakshi
Sakshi News home page

‘ఇండిపెండెన్స్ డే’ కథతో కామిక్ బుక్!

Published Mon, Dec 28 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

‘ఇండిపెండెన్స్ డే’ కథతో కామిక్ బుక్!

‘ఇండిపెండెన్స్ డే’ కథతో కామిక్ బుక్!

గ్రహాంతరవాసులు హఠాత్తుగా భూమ్మీద దాడి చేసి, విధ్వంసం సృష్టిస్తే ఎలా ఉంటుందనే దానికి వెండితెర రూపం ‘ఇండిపెండెన్స్ డే’. రోలాండ్ ఎమ్రిచ్ తెరకెక్కించిన ఈ చిత్రం 1996లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత  వచ్చిన ఏలియన్ తరహా చిత్రాలకు ఈ చిత్రం ఓ రిఫరెన్స్‌గా నిలిచిందనడం అతిశయోక్తి కాదు. ఇన్నేళ్ల తర్వాత ఈ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ రూపొందిస్తున్నారు దర్శకుడు రోలాండ్ ఎమ్రిచ్. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ యూ ట్యూబ్‌లో వీరవిహారం చేస్తోంది.
 
 ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక-నిర్మాతలు ఇప్పుడు దీన్ని కామిక్ బుక్ రూపంలో తీసుకురానున్నారు. హిట్ పిక్చర్స్‌కి కామిక్  టచ్ ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇటీవల జేమ్స్ కామెరూన్ కూడా తన ‘అవతార్’ను కామిక్ బుక్ రూపంలోగా తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ‘ఇండిపెండెన్స్ డే’ని కూడా పుస్తక రూపంలో విడుదల చేయడానికి రోలాండ్ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement