డల్లాస్: ఓ కామిక్ పుస్తకానికి 4,54,100 డాలర్లు (సుమారు రూ. 3.12 కోట్లు) చెల్లించి తన సొంతం చేసుకున్నాడో పుస్తక ప్రియుడు. ఆ పుస్తకంలో అంత విశేషం ఏముంది అనుకుంటున్నారా. స్పైడర్ మ్యాన్ మొట్టమొదటి సారిగా దర్శనమిచ్చిన కామిక్ బుక్ అది. డల్లాస్కు చెందిన ప్రముఖ వేలం సంస్థ హెరిటేజ్ నిర్వహించిన పుస్తక వేలంలో మరే ఇతర స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్కు లభించనంత ఆదరణ లభించింది.
న్యూయార్క్ వాసి వాల్టర్ యకోబోస్కి 1980లో పలు కామిక్ పుస్తకాలను కొనుగోలు చేసే సందర్భంగా ఈ పుస్తకాన్ని 1200 డాలర్లకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని వేలంలో ఓ పేరు తెలియని వ్యక్తి ఊహించనంత ఎక్కువ ధరకు కొనడంతో వాల్టర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అపురూప పుస్తకాలకు అమెరికన్లు అత్యధిక ధర చెల్లించడం ఇదే మొదటి సారి కాదు. 1962 ఎడిషన్ అమేజింగ్ ఫాంటసీ పుస్తకం 2011లో 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.
ఒక్క పుస్తకానికి రూ. 3 కోట్లు!
Published Sun, Feb 21 2016 6:40 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement