కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది | Manchu Vishnu Announcement On Kannappa Movie | Sakshi
Sakshi News home page

కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది

Published Thu, Mar 21 2024 4:11 AM | Last Updated on Thu, Mar 21 2024 7:25 PM

Manchu Vishnu Announcement On Kannappa Movie - Sakshi

– విష్ణు మంచు

‘‘కన్నప్ప’ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్‌ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ్ర΄ారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని  ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం ‘కన్నప్ప’.

ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్‌ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్‌ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్‌ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ‘కన్నప్ప స్టోరీ బుక్‌ వాల్యూమ్‌ 1’ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్‌ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement