విజిలెన్స్ ఆకస్మిక దాడులు
గుమ్మలక్ష్మీపురం : మండల కేంద్రంలోని మూడు అపరాల షాపులపై శనివారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బుడుమూరు గోవిందరావు షాపులో ఎనిమిదిన్నర క్వింటాళ్ల పౌరసరఫరాల బియ్యం, పెద్దిన ప్రసాద్‌కు చెందిన క్వింటాన్నర పీడీఎస్ బియ్యం, కింతలి కృష్ణారావు షాపులో రెండు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ ఉమాకాంత్ తెలిపారు. పౌరసరఫరాల బియ్యం పక్కదారి పట్టకుండా.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా ఈ ఆకస్మిక దాడులు చేపట్టామని చెప్పారు.
దాడుల తీరుపై విస్మయం
గతంలో విజిలెన్స్ దాడులు నిర్వహిస్తే మూడవ కంటికి తెలియకుండా ఆకస్మికంగా చేపట్టేవారు. అరుుతే శనివారం గుమ్మలక్ష్మీపురంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో ముందుగా సిబ్బంది(హెచ్‌సీ గౌరీశంకర్, కాని స్టేబుల్ ఈశ్వరరావు) దాడులు నిర్వహించవలసిన షాపుల వద్దకు చేరుకున్నారు. అక్కడే కూర్చొని షాపు యజమానులతో మాటామంతీ కొనసాగించారు. తమ ఉన్నత అధికారి వచ్చే దాకా.. అంటే సుమారు సాయంత్రం 4 గంటల వరకూ అక్కడే గడిపారు. ఈలోగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయన్న సమాచారం వ్యాపారులందరికీ చేరిపోరుుంది. దీంతో చాలామంది ముందుగానే షాపులు మూసివేశారు. అనంతరం సాయంత్రం 4 తర్వాత విజిలెన్స్ సీఐ ఉమాకాంత్ షాపుల వద్దకు చేరుకున్నారు. మూడు షాపుల్లో నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. 12 క్వింటాళ్ల బియ్యూన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించి, వెళ్లిపోయూరు. బియ్యాన్ని స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నిమ్మక శేఖర్, వీఆర్‌ఓ బోడమ్మలకు అప్పగించారు. వ్యాపారులపై 6ఏ కేసు నమోదుకు ఆదేశించారు.
బియ్యం నిల్వలు స్వాధీనం
గజపతినగరం : దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. పసుమర్తి కృష్ణ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్న ఎనిమిది క్వింటాళ్ల బియ్యం, 70 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉమాకాంత్ తెలిపారు. ప్రజా పంపిణీకి సరఫరా చేయూల్సిన బియ్యం, కిరోసిన్ ఈ వ్యక్తి వద్దకు ఎలా చేరుకున్నాయో విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. అదే విధంగా అలాగే గ్రామంలోని రేషన్‌డిపోలో తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌డీటీ మల్లికార్జునరావు, హెచ్‌సీ రమణ, పెదకాద, చినకాద గ్రామాల రెవెన్యూ అధికారులు తిరుపతి, జి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.