చైతన్యపురి (హైదరాబాద్) : కాలేజీకి వెళుతున్న ఇంటర్ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు బ్లేడ్‌తో దాడి చేసిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన కండె కృష్ణాజోష్, మంజు జోష్ దంపతులు నగరానికి వలస వచ్చి వాసవీ కాలనీలోని టీఎన్‌ఆర్ విహారి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.
వారి కుమార్తె (16) స్థానిక ఎస్‌ఆర్ గాయత్రీ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం ఆమె కాలేజీకి వెళుతుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె చేతులు గట్టిగా పట్టుకుని రెండు చేతులపై బ్లేడ్‌తో గాయపరిచారు. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ పరిశీలస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment