
సాక్షి, చెన్నై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్‌నకు గురైన నౌకాదళ అధికారి ముంబైలో సజీవదహనం చేసి హత్యకు గురయ్యారు. జార్కండ్ రాష్ట్రం రాంచికి చెందిన సూరజ్‌కుమార్ దుబే కోయంబత్తూరు ఐఎన్‌ఎస్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల 31న ఆయన జార్కండ్ వెళ్లే నిమిత్తం చెన్నైకు వచ్చారు. అయితే, ఆయన కనిపించకుండా పోయారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన్ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. రూ.పది లక్షల కోసం డిమాండ్ చేసిన ఆ ముఠా, చివరకు ఆ అధికారిని హతమార్చింది. రోడ్డు మార్గంలో చెన్నై నుంచి ముంబైకు ఆయన్ను తీసుకెళ్లిన ఆ ముఠా సజీవదహనం చేసింది. చెన్నై, ముంబై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment