Navy officer
-
భారత నారీమణుల అరుదైన సాహసం
భారత నారీమణులు అరుదైన సాహసం పూర్తి చేశారు. భూగోళాన్ని చుట్టొచ్చి సరికొత్త చారిత్రక విజయానికి నాంది పలికారు. గురువారు ఈ ఇద్దరు నారీమణులు భూమిపై అత్యంత మారుమూల ప్రాంతమైన పాయింట్ నీమోను దాటి సరొకొత్త మైలురాయిని అధిగమించారు. ఆ నారీమణులు ఎవరు?. ఈ సాహసయాత్రని ఎప్పుడు ప్రారంభించారు తదితరాల గురించి చూద్దామా..!ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నారీమణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే, లెఫ్టినెంట్ కమాండర్ రూపలు. ఈ ఇద్దరు మహిళా నావికా అధికారులు గురువారం తెల్లవారుజామున 12:30 గంటలకు ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసెల్ (INSV) తరిణిలో న్యూజిలాండ్‌లోని లిట్టెల్టన్ నుంచి ఫాక్లాండ్ దీవులలోని పోర్ట్ స్టాన్లీకి వెళ్లే మూడో దశ జర్నీలో పాయింట్ నీమో(Point Nemo) గుండా వెళ్ళారు. ఇది భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం(Remote Location). చెప్పాలంటే సమీపం భూభాగం నుంచి దాదాపు 2,688 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాంటి అత్యంత రిమోట్ ఓషియానిక్ పాయింట్‌కి చేరుకున్న నారీమణులుగా నిలిచారు. నావికాదళం కూడా ఈ సాహసయాత్రను నావికా సాగర్ పరిక్రమ II మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొంది. అలాగే దీన్ని భారతదేశ నావికా అన్వేషణ చొరవలో భాగంగా ఇద్దరు మహిళా అధికారులు చేపట్టిన భూ ప్రదక్షిణంగా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ఇద్దరు మహిళా అధికారులు ఆ ప్రాంతం నుంచి నీటి నమునాలను సేకరించారు. దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్లేషిస్తుంది. ఈ నమూనాలు సముద్ర జీవవైవిధ్యం, నీటి రసాయన కూర్పుతో సహా సముద్ర పరిస్థితులపై విలువైన డేటాను అందిస్తాయని నేవీ పేర్కొంది. పైగా ఇది శాస్త్రవేత్తల సముద్ర శాస్త్ర పరిశోధనకు దోహదపడుతుందని తెలిపింది.సాహస యాత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే..ఈ ఇద్దరు నావికా అధికారులు అక్టోబర్ 2, 2024న భూమిని చుట్టి రావడానికి బయలుదేరారు. వారు గోవా నుంచి INVS తరిణిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు డిసెంబర్ 22న న్యూజిలాండ్‌లోని లిట్టెల్టన్ ఓడరేవుకు చేరుకుని, ఈ యాత్ర రెండొవ దశను పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ నెల ప్రారంభంలో లిట్టెల్టన్ నుంచి ఫాక్లాండ్ దీవులలోని పోర్ట్ స్టాన్లీకి వెళ్లే అత్యంత సుదీర్ఘ సాహస యాత్ర కోసం బయలుదేరారు. ఈ దశలో దూరం దాదాపు 5,600 నాటికల్ మైళ్లు.పాయింట్ నెమో గుండా INVS తరిణిలో ప్రయాణించడంతో పూర్తిగా నౌకాయానంతో చేసిన సాహసయాత్రగా నిలిచింది. ఈ సక్సెస్‌ని సముద్ర నావిగేషన్ పరంగా అత్యంత ఘన విజయంగా నేవీ పేర్కొంది. అత్యంత సంక్లిష్టమైన జలాల్లో చేసే ఈ యాత్ర చాలా సవాళ్లతో కూడుకున్నది. వాటన్నింటిని అలవొకగా దాటుకుని విజయవంతంగా భూమికి మారుమూలగా ఉండే పాయింట్ నీమోని దాటడం విశేషం. దీన్నిఅంత ప్రాచుర్యం లేని మహా సముద్ర ధ్రువంగా పిలుస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే మానవ నివాసానికి అత్యంత దూరంలో ఉండే ప్రదేశంగా పేర్కొంటారు.ఈ పాయింట్ నెమో అంతరిక్ష నౌక శ్మశానవాటికగా పనిచేస్తుంది. అంటే అంతరిక్ష కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా ఉపగ్రహాల కాలం పూర్తి అయ్యిన వెంటనే తిరిగి భూ వాతావరణంలోకి పంపించేటప్పడు..ఈ సముద్ర జలాల్లోకి పంపిస్తారు. ఎందుకంటే జననష్టం జరగకుండా మానవనివాసానికి అత్యంత మారుమూలగా ఉండే ఈ రిమోట్ ఓషయోనిక్ పాయంట్ నెమోని ఉపయోగించుకుంటారట ఖగోళ శాస్త్రవేత్తలు.#NavikaSagarParikrama_II#NSPIIUpdates#INSVTarini charts through the world’s most isolated waters!Lt Cdr Dilna K & Lt Cdr Roopa A cross Point Nemo - the Oceanic Pole of Inaccessibility. A testament to resilience, courage & the spirit of adventure.Fair winds & following… pic.twitter.com/CvcEegoAjF— SpokespersonNavy (@indiannavy) January 30, 2025 (చదవండి: పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!) -
‘మా కొడుకు ఎక్కడ?..’ ప్రధాని మోదీకి అభ్యర్థన
భారత నౌకా దళానికి చెందిన సాహిల్ వర్మ ఈ ఫిబ్రవరి 27 నుంచి ఆదృశ్యం అయ్యారు. ఆయన ఆచూకీ కోసం భారత నేవీ ఎయిర్ క్రాఫ్ట్, నౌకలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తమ కొడుకు ఆచూకీ ఇంకా తెలియకపోవటంపై సాహిల్ వర్మ తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి, సీబీఐ, రక్షణ శాఖమంత్రి, హోం శాఖ మంత్రి, జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్గవర్నర్ మనోజ్ సన్హా జోక్యం చేసుకొని తన కుమారుడిని క్షేమంగా వెతికి తీసుకురావాలని కోరుతున్నారు. సాహిల్ తల్లిదండ్రులు జమ్ములోని గౌ మన్హాసన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ‘మా కుమారుడు ఎక్కడ ఉన్నాడు’ అంటూ సాహిల్ వర్మ తల్లిదండ్రులు సుభాష్ చందర్, రామా కుమారి కన్నీరుమున్నీరవుతున్నారు. ‘మేము ఫిబ్రవరి 29న మా కుమారుడు రెండు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడనే సమాచారాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలుకున్నాం. మేము సాహిల్ వర్మతో ఫిబ్రవరి 25న చివరిసారి మాట్లాడాము’ అని సాహిల్ తండ్రి సుభాష్ చందర్ తెలిపారు. తమ కుమారుడి ఆచూకీని తొందరగా తెలుసుకోని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉండగా అదృశ్యమైన తమ కుమారుడి కేసును సీబీఐకీ అప్పగించాలన్నారు. 400 మంది నౌకలో ఉండగా తమ కుమారుడు మాత్రమే అదృశ్యమయ్యాడని అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి సాహిల్ వర్మ (సీమ్యాన్-2) కనిపించకుండా పోవడం దురదృష్టకరమని భారత నేవీకి చెందిన వెస్ట్రన్ కమాండ్ వెల్లడించింది. సాహిల్ భారత నేవీ షిప్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. సాహిల్ వర్మ ఆచూకీ తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి బోర్డును ఏర్పాటు చేసినట్లు వెస్ట్రన్ కమాండ్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు బోర్డును ఆదేశించింది. -
సీఎం జగన్‌ని కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ అజేంద్ర బహదూర్‌సింగ్
-
నేవీ అధికారి సజీవదహనం: ఆ 6 రోజులు ఏం జరిగింది?
ముంబై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్‌కు గురైన నౌకాదళ అధికారి సూరజ్ కుమార్ దుబేని ముంబైలో సజీవదహనం చేయడంతో హత్యకు గురైన సంగతి తెలిసందే. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. మృతి చెందిన సూరజ్‌కుమార్ దుబే షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాడని.. ఈ క్రమంలో బ్యాంక్, స్నేహితుల దగ్గర భారీగా అప్పు చేశాడని తెలిసింది. మరో విషాదకర అంశం ఏంటంటే దూబేకి గత నెల 15న నిశ్చితార్థం జరిగింది.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరికి వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన సూరజ్ కుమార్ దుబే బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు అతడు చనిపోవడానికి ముందు బ్యాక్ నుంచి 8 లక్షల రూపాయల లోన్, ఓ కొలిగ్ వద్ద నుంచి 5.75 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. ఇదే కాక కాబోయే మామగారి దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది అన్నారు. ఇంత భారీ మొత్తం అప్పుగా తీసుకున్నప్పటికి ప్రస్తుతం అతడి ఖాతాలో కేవలం 392 రూపాయలు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. సూరజ్ దూబే అప్పు చేసిన ఈ మొత్తాన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక అప్పు ఇచ్చిన స్నేహితుడు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా దూబేపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక జనవరి నెల మొత్తం సెలవుల్లో ఉన్న దూబే విధుల్లో తిరిగి చేరడం కోసం జనవరి 30న ఉదయం 8 గంటలకు రాంచీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కాడు. దిగాక తన కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన దూబే చెన్నైలో దిగగా ముగ్గురు వ్యక్తులు అతడిని గన్‌తో బెదిరించి కిడ్నాప్ చేశారు. మూడు రోజులు దూబేని చెన్నైలో ఉంచారు. ఇక దుబే నుంచి జనవరి 30 తర్వాత ఎలాంటి కాల్ రాకపోవడం.. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు నేవీ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 1న దూబే మూడు ఫోన్లలో ఒక నెంబర్ రింగ్ అయినట్లు అతడి స్నేహితుడు తెలపడంతో పోలీసులు దాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. దూబే ఈ నంబర్ని షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ కోసం వినియోగించేవాడని దర్యాప్తులో తెలిసిందన్నారు పోలీసులు. మరో నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 5న దుండగులు దూబేని పహల్గఢ్లోని ఎతైన కొండ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికి లాభం లేకపోయింది. మరణించాడు. ఈ క్రమంలో జనవరి 31-ఫిబ్రవరి 5 మధ్యన ఆ ఆరు రోజుల పాటు ఏం జరిగి ఉంటుందనే విషయం కీలకంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ చిక్కు ముడిని విప్పే ప్రయత్నం చేస్తున్నారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్, భారీ మొత్తంలో డబ్బు అప్పు చేయడం వంటి అంశాలే దూబే మరణానికి కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. దూబే మొబైల్‌కి ఓ నంబర్ నుంచి వరుసగా 13 కాల్స్ రావడంతో అది ఎవరిదనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి కొద్ది రోజుల్లోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు. ఇక దూబేకి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉందని కానీ.. అతడి దగ్గర మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయనే విషయం కానీ కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం. చదవండి: బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు.. చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం -
చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్‌నకు గురైన నౌకాదళ అధికారి ముంబైలో సజీవదహనం చేసి హత్యకు గురయ్యారు. జార్కండ్ రాష్ట్రం రాంచికి చెందిన సూరజ్‌కుమార్ దుబే కోయంబత్తూరు ఐఎన్ఎస్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల 31న ఆయన జార్కండ్ వెళ్లే నిమిత్తం చెన్నైకు వచ్చారు. అయితే, ఆయన కనిపించకుండా పోయారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన్ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. రూ.పది లక్షల కోసం డిమాండ్ చేసిన ఆ ముఠా, చివరకు ఆ అధికారిని హతమార్చింది. రోడ్డు మార్గంలో చెన్నై నుంచి ముంబైకు ఆయన్ను తీసుకెళ్లిన ఆ ముఠా సజీవదహనం చేసింది. చెన్నై, ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. -
53 ఏళ్లకు దొరికిన పర్స్, ఏదీ మిస్ అవ్వలేదు!
కాలిఫోర్నియా: దశాబ్దాల కిందట పోయిన పర్స్ ఇప్పుడు లభించింది. దీంతో పోగొట్టుకున్న ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబయ్యాడు. పర్స్‌లో ఉన్న వస్తువులన్నీ అలాగే ఉండడంతో పరమానందం పొందాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగింది. 1967లో పోగొట్టుకున్న పర్స్ 2021లో లభించడం ఆశ్చర్యమే. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన 91 ఏళ్ల పాల్ గ్రిశామ్ నౌక వాతావరణ శాస్త్రవేత్త. అమెరికా నౌక వాతావరణ శాస్త్రవేత్త పౌల్ గ్రిషమ్ రాస్ ద్వీపంలో 1967 ప్రాంతంలో ఏడాది పాటు వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేశారు. 13 నెలలు అక్కడ పనిచేసిన అనంతరం తిరిగి కాలిఫోర్నియాకు చేరుకోగానే ఆయన తన వాలెట్ ఎక్కడో మిస్ అయిందని గ్రహించాడు. అందులో నేవి ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ఐడీలు ఉన్నాయట. అలా మిస్ అయిన పర్స్ 52 ఏళ్ల తర్వాత తాజాగా దొరికింది. భూమి మీద దక్షిణ దిశలో చిట్టచివరి పట్టణంగా పేర్కొనే అంటార్కిటికా ఖండంలోని మెక్ముర్డో స్టేషన్లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో పనులు చేస్తున్న వారికి రెండు పర్సులు కనిపించాయి. వాటిని పరిశీలించగా అందులో ఒకటి గ్రిశామ్‌కు చెందిన పర్స్ కూడా ఉంది. అయితే ఆయన పోగొట్టుకున్న సమయంలో పర్స్‌లో ఉన్న నావీ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఇక కూల్చివేతల్లో దొరికిన మరో పర్స్ పౌల్ హావర్డ్ అనే వ్యక్తిదని గుర్తించారు. 2016లో పౌల్ హావర్డ్ మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు. -
రిటైర్డ్ నేవీ అధికారి దారుణ హత్య
సాక్షి, న్యూఢిల్లీ: రిటైర్డ్ నావికాదళ అధికారి బలరాజ్ దేశ్వాల్ (55) ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చోటు చేసుకున్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్టు సమాచారం. నిందితుడు దేశ్వాల్ను అతి సమీపంనుంచి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ పోలీసుల సమాచారం ప్రకారం ద్వారకలోని సెక్టార్ 12 లోని అపార్ట్మెంటును దేశ్వాల్ అతని వ్యాపార భాగస్వాములు కలిసి నిర్మించారు. ఇక్కడ నిందితుడు ప్రదీప్ ఖోకర్ కూడా ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అతను దేశ్వాల్కు 5 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆగ్రహంతో పార్కింగ్ ప్రాంతంలోకి వచ్చి దేశ్వాల్తో వాగ్వివాదానికి దిగాడు. ఈ సంఘర్షణలోఆవేశంగా అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో దేశ్వాల్ నోట్లో బుల్లెట్ దూసుకు పోయిందని తెలిపారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేశామని నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ద్వారకా డీసీపీ సంతోష్ కుమార్ మీనా తెలిపారు. -
శివసైనికుల దాడి : బీజేపీలో చేరిన నేవీ అధికారి
ముంబై : ఓ కార్టూన్ వివాదంపై శివసేన సభ్యులచే దాడికి గురైన రిటైర్డ్ నౌకాదళ అధికారి మదన్ శర్మ బీజేపీ, ఆరెస్సెస్‌లో చేరినట్టు మంగళవారం స్వయంగా వెల్లడించారు. తాను బీజేపీలో చేరానని, మహారాష్ట్రలో ఎలాంటి గూండాగిరి జరగకుండా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారితో తాను సమావేశమయ్యానని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరగా..దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారని శర్మ తెలిపారు. చట్టం రెండు రకాలుగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్ధం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతను మరోలా, సాధారణ పౌరుడిని మరో రకంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి ఘటనను గవర్నర్‌కు వివరించానని, ఈ ఘటనపై నిందితులపై ప్రయోగించిన సెక్షన్లు బలహీనంగా ఉన్నాయని చెప్పానన్నారు. తన వినతిపత్రంపై చర్యలు చేపడతానని గవర్నర్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరగా, కేంద్రంతో మాట్లాడతానని గవర్నర్ భరోసా ఇచ్చారని రిటైర్డ్ నేవీ అధికారి మదన్ శర్మ చెప్పుకొచ్చారు. కాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై కార్టూన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు శర్మపై సేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు సేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్ కేసు’ -
నేవీ కమాండర్ వికృత చేష్ట
న్యూఢిల్లీ : భార్య ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి ఆన్లైన్ ఫోటో యాప్‌లో అప్లోడ్ చేసిన ఓ నేవీ కమాండర్‌పై పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్న తన భర్త పోర్నోగ్రఫీకి బానిసయ్యాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఖండ్వా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహదేవ్ కుంభర్ తెలిపారు. భర్త అశ్లీల సైట్లకు అలవాటుపడి ఎంతకీ వాటిని వదిలేయకపోవడంతో తాను పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేశానని గతంలో సైనిక అధికారిగా పనిచేసిన బాధితురాలు వెల్లడించారు. తాను, కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పినా ఆయన మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిన మహిళ పూణేకు తిరిగివచ్చి ఇక్కడి ఫ్యామిలీ కోర్టులో గత నెలలో విడాకుల కేసును దాఖలు చేసినట్టు పోలీసు అధికారి మహదేవ్ వెల్లడించారు. ఆమె భర్త బాధితురాలి ఫోటోలను అప్లోడ్ చేయడంతో పాటు, తన కొలీగ్ భార్య, మరికొందరు ఇతర మహిళల అభ్యంతరకర ఫోటోలను ఆ యాప్‌లో అప్లోడ్ చేశాడని తెలిపారు. ఈమెయిల్ ఖాతా ద్వారా నిందితుడు ఫోటో యాప్‌లో తన భార్య చిత్రాలను అప్లోడ్ చేశాడని వెల్లడించారు. నిందితుడికి తన కొలీగ్ భార్యతో వివాహేతర సంబంధం కూడా ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసులో నిందితుడిని ప్రశ్నించేందుకు అనుమతి కోసం నేవీ అధికారులకు లేఖ రాస్తామని చెప్పారు. -
రిటైర్డ్ నేవీ ఆఫీసర్‌పై తల్వార్లతో దాడి
-
పాక్ మీడియా వేధింపులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ వెళ్లినప్పుడు పాక్ పాల్పడిన దురాగతాలు ఒక్కోటీ వెలుగుచూస్తున్నాయి. అవంతి, చేతాంకుల్ వద్దకు పాక్ ప్రభుత్వమే విలేకరుల పేరుతో కొందరిని పంపించి విపరీతమైన ప్రశ్నలు అడిగించి వారిని వేధించిన విషయం వెల్లడైంది. విదేశాంగ శాఖ కార్యాలయంలో జాధవ్‌ను కలిశాక తిరిగి వెళ్లేముందు వారి వద్దకు కొందరు జర్నలిస్టులు వచ్చారు. ‘అమాయకపు పాకిస్తానీల రక్తంతో మీ భర్త హోళీ ఆడుకున్నారు. దీనికి మీరేమంటారు? హంతకుడైన మీ కొడుకును కలిశాక మీకేమనిపిస్తోంది?’ తదితర ప్రశ్నలతో జాధవ్ భార్య, తల్లికి వేదన కలిగించారు. సంబంధిత వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ప్రశ్నలు అడిగిన విలేకరులకు ఆ తర్వాత పాక్ విదేశాంగ శాఖ నుంచి ‘బాగా పనిచేశారు’ అంటూ సంక్షిప్త సందేశాలు వచ్చాయని డాన్ పత్రికలో పనిచేసే ఓ సీనియర్ కరస్పాండెంట్ ట్వీటర్లో చెప్పారు. ‘దేశభక్తిని నిరూపించుకునేందుకు ఉత్తమ మార్గం 70 ఏళ్ల మహిళను వేధించడమే అనుకునే పాక్ జర్నలిస్టుల గురించి చెప్పేందుకు పదాలు రావడం లేదు’ అని మరో ప్రముఖ పాత్రికేయురాలు బేనజీర్ షా అన్నారు. అసలు అక్కడున్న వాళ్లంతా జర్నలిస్టులేనా లేక ఐఎస్ఐ మనుషులు ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జాధవ్‌ను ఆయన తల్లి, భార్య నేరుగా కలవకుండా గాజుతెర అడ్డుగా పెట్టడం, ఇంటర్‌కామ్ (ఫోన్)లో మాత్రమే మాట్లాడేందుకు అనుమతివ్వడం, మంగళసూత్రం, బొట్టు తీయించి, దుస్తులు మార్పించి లోపలకు పంపించడం తదితర పాక్ దుశ్చర్యలు ఇప్పటికే వెలుగుచూడటం తెలిసిందే. ‘ఫోరెన్సిక్’కు చేతాంకుల్ పాదరక్షలు చేతాంకుల్ పాదరక్షలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షకు పంపినట్లు పాక్ మీడియా తెలిపింది. షూలో కెమెరా, రికార్డింగ్ చిప్ లాంటి వస్తువేదైనా ఉందేమో తెలుసుకోడానికి ల్యాబ్‌కు పంపినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఫైజల్ చెప్పారంది. జాధవ్ కుటుంబ సభ్యులను వేధించామన్న భారత ఆరోపణలను నిరాధారమైనవిగా పాక్ కొట్టిపారేసింది. జాధవ్ భార్య, తల్లితో పాకిస్తాన్ అధికారులు ప్రవర్తించిన తీరు అమానవీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మొత్తం భారతీయులకు అవమానం: కాంగ్రెస్ అవంతి, చేతాంకుల్‌ను పాకిస్తానీ విలేకరులు వేధించడం మొత్తం 130 కోట్ల మంది భారతీయులకు జరిగిన అవమానమని కాంగ్రెస్ పేర్కొంది. భారతీయులుగా మనం ఈ చర్యను ఏ మాత్రం సహించకూడదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. -
'విశిష్ట సేవా పతక ధారి లైంగికంగా వేధించారు'
భారత నౌకాదళంలో లైంగిక వేధింపుల కేసులు ఎక్కువైపోతున్నాయి. తన సీనియర్ రెండుసార్లు తనను లైంగికంగా వేధించారని ఒక యువ డాక్టర్ ఆరోపించారు. దీంతో నిందితుడైన సర్జన్ కమాండర్‌ను నేవీ అధికారులు బలవంతంగా సెలవులో పంపారు. అతడిపై ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సంవత్సరం రిపబ్లిక్‌డే సందర్భంగా విశిష్ట సేవా పతకం అందుకున్న సదరు కమాండర్‌కు నావల్ అడ్మినిస్ట్రేటివ్, లాజిస్టిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇలాంటి అంశాలను నేవీ చాలా తీవ్రంగా తీసుకుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యవహారాలను సహించబోదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కెప్టెన్ ర్యాంకు అధికారి నేతృత్వంలో సర్జన్ కమాండర్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ బోర్డు నియమించారు. తొలిసారి తనను వైస్ అడ్మిరల్ నివాసంలో మే 6వ తేదీన లైంగికంగా వేధించినట్లు జూనియర్ డాక్టర్ చెప్పారు. వైస్ అడ్మిరల్ తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమెను చూసేందుకు తామిద్దరం వెళ్లామని, అక్కడ తాను బాత్రూంకు వెళ్లినప్పుడు చాలా అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు. దీనిపై ఆమె అప్పుడే సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో భారత త్రివిధ దళాలలో తరచు లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోధ్‌పూర్‌లో ఒక సీనియర్ అధికారి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఓ ఫైటర్ పైలట్‌ను వైమానిక దళం విధుల నుంచి తొలగించింది. ఇక నేవీ కూడా వివాహేతర సంబంధం, అసభ్య ఎస్ఎంఎస్లు పంపిన కేసుల్లో ఇద్దరి ఉద్యోగాలు ఊడబీకింది. -
రానా నేవీ ఆఫీసర్‌గా... ఘాజి
దేశంలోనే తొలిసారిగా సబ్‌మెరైన్ చిత్రం షురూ! యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రాలు తీయడం అంటే ఆషామాషీ విషయం కాదు. నిర్మాణ వ్యయం భారీగా ఉంటుంది. పనిదినాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే, ఆ సినిమాకి తెరవెనక పనిచేసేవాళ్లు, తెరపై కనిపించేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే, వార్ మూవీస్ జోలికి వెళ్లడానికి అంత త్వరగా ముందుకు రారు. ఈ తరంలో ఇటీవల రాజమౌళి చేసిన ‘బాహుబలి’, గుణశేఖర్ తీసిన ‘రుద్రమదేవి’, క్రిష్ రూపొందించిన ‘కంచె’ చిత్రాలు యుద్ధ నేపథ్యంలో సినిమాలు సాధ్యమేనని నిరూపించాయి. అవన్నీ ఒక ఎత్తయితే గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైన ‘ఘాజి’ మరో ఎత్తు అవుతుంది. ఎందుకంటే, ఇది నీటిలో జరిగే యుద్ధం. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. ‘‘ఈ కాన్సెప్ట్ వినగానే ఎంత బడ్జెట్ అయినా సరే తీయాలనుకున్నాను. ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌కే ఏడాది తీసుకున్నాం. చిత్రీకరణను మాత్రం ఆరు నెలల్లోనే పూర్తి చేస్తాం’’ అని పొట్లూరి వి. ప్రసాద్ తెలిపారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అప్పట్లో పాకిస్తాన్ ఉపయోగించిన సబ్‌మెరైన్ పీఎన్ఎస్ ఘాజి. ఆ యుద్ధ సమయంలో విశాఖపట్నం దగ్గర బంగాళాఖాతంలో భారత్ తన ప్రత్యర్థి దేశానికి చెందిన ఈ జలాంతర్గామిని జలసమాధి చేసింది. ఈ నేపథ్యంలో నడిచే కథలో రానా నేవీ ఆఫీసర్‌గా చేస్తున్నారు. యుద్ధం సందర్భంగా తన బృందంతో పాటు 18 రోజులు నీటిలోనే ఉండిపోయిన నేవీ ఆఫీసర్ చుట్టూ కథ తిరుగుతుంది. ‘‘మెయిన్ స్ట్రీమ్ సినిమాపరంగా నా ప్రయోగాన్ని ‘ఘాజి’తో కొనసాగి స్తున్నా. హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది భారత్‌లో వస్తున్న తొలి సబ్‌మెరైన్ మూవీ కావడం విశేషం’’ అని రానా పేర్కొన్నారు. నూతన దర్శకుడు సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరా: మది, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్. -
భార్యల మార్పిడి కేసు: మహిళ ఫిర్యాదు స్వీకరించిన సుప్రీంకోర్టు
తన భర్తతో పాటు కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌కు చెందిన కొంతమంది అధికారులు చేస్తున్న భార్యల మార్పిడి వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఓ నౌకాదళ అధికారి భార్య దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తనను బలవంతంగా భార్యల మార్పిడి పార్టీలలో పాల్గొనాలంటూ తన భర్త చిత్ర హింసలు పెడుతున్నాడని ఆమె అందులో పేర్కొంది. ఈ కేసును విచారణకు స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. దాంతో పాటు.. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి ఊరట ఇవ్వకుండా కేరళ హైకోర్టును ఆదేశించాలన్న పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించింది. కేరళ పోలీసులు తన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ చేయడంలేదంటూ ఫిర్యాదు చేసిన ఆమె.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కోరింది. స్థానిక పోలీసులపై తీవ్రమైన ఒత్తిళ్లు ఉండటంతో వారు దీన్ని కేవలం ఒక వివాహ వివాదంగా చూస్తున్నారని, కేసు తీవ్రతను నీరుగార్చి, నౌకాదళ అధికారులపైకి ఏమీ రాకుండా చూసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తనను చిత్రహింసలు పెట్టారనడానికి కావల్సిన ఆధారాలను కూడా ఆమె సమర్పించారు. 'భార్యల మార్పిడి' పార్టీల ఆహ్వాన పత్రాలను కూడా ఫిర్యాదుకు జతచేశారు. మార్చి ఐదో తేదీన నౌకాదళ ప్రధానాధికారికి కూడా దీని విషయమై ఓ లేఖ రాశానని, అయినా దాన్ని పట్టించుకోలేదని తెలిపారు.