నార్వ(మహబూబ్‌నగర్): కల్తీ కల్లుకు అలవాటు పడి అది లభించకపోవడంతో పిచ్చి చేష్టలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కల్తీ కల్లు లభించక పోవడంతో మతిస్థిమితం కోల్పోయి.. గ్యాస్ తెరిచి ఉందని గమనించక బీడీ వెలిగించడానికి ప్రయత్నించిన వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కొకంణివారిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి(39) గత కొన్నెళ్లుగా కల్తీ కల్లుకు బానిసయ్యాడు.
ఈ క్రమంలో ఈరోజు కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లగా.. గుడిసెలో నిద్రిస్తున్న రవీందర్ రెడ్డి బీడీ వెలింగించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఇంట్లో ఉన్న వంట గ్యాస్ ఆన్ చేసి ఉంచడంతో, ఇంట్లో గ్యాస్ వ్యాపించి ఉండటాన్ని గమనించని రవీందర్ అగ్గిపుల్ల గీయడంతో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న అతను సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీడీ వెలిగించబోయి వ్యక్తి సజీవదహనం
Published Wed, Sep 23 2015 4:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM
Advertisement
Advertisement