Ravindarreddy
-
మోదీతో సమావేశంలో పాల్గొన్న భారతీ సిమెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి
-
రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్కు ఓకే
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన న్యాయాధికారి కె.రవీందర్‌రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణకు హైకోర్టు శుక్రవారం ఆమోదం తెలిపింది. మే 31వ తేదీ నుంచే ఆయన వీఆర్ఎస్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆయన నిర్వర్తించిన హైదరాబాద్ నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి బాధ్యతలను.. 8వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి అప్పగించాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఎస్ దరఖాస్తు నోటీసు కాలం ముగియక ముందే హైకోర్టు ఆమోదం తెలపడం విశేషం. తీర్పు వెంటనే రాజీనామా కలకలం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా ఉన్న రవీందర్‌రెడ్డి.. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు ఇచ్చిన గంటలోపే ఆయన తన న్యాయాధికారి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే)కి లేఖ పంపడం కలకలం సృష్టించింది. అవినీతి ఆరోపణల వల్లే రవీందర్‌రెడ్డి రాజీనామా చేశారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే రాజీనామా చేస్తే పదవీ విరమణ ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడంతో రవీందర్‌రెడ్డి పునరాలోచన చేశారు. తన పదవీ విరమణకు కొద్ది నెలలే గడువు ఉండటం, సర్వీసు పొడిగించే అవకాశాలు లేకపోవడంతో రాజీనామాకు బదులుగా... వీఆర్ఎస్ కోసం హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని కమిటీ ఇటీవల సమావేశమై.. దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్ను ఆమోదిస్తూ.. ఉత్తర్వులు వెలువడ్డాయి. -
బీడీ వెలిగించబోయి వ్యక్తి సజీవదహనం
నార్వ(మహబూబ్‌నగర్): కల్తీ కల్లుకు అలవాటు పడి అది లభించకపోవడంతో పిచ్చి చేష్టలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కల్తీ కల్లు లభించక పోవడంతో మతిస్థిమితం కోల్పోయి.. గ్యాస్ తెరిచి ఉందని గమనించక బీడీ వెలిగించడానికి ప్రయత్నించిన వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కొకంణివారిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి(39) గత కొన్నెళ్లుగా కల్తీ కల్లుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈరోజు కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లగా.. గుడిసెలో నిద్రిస్తున్న రవీందర్ రెడ్డి బీడీ వెలింగించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఇంట్లో ఉన్న వంట గ్యాస్ ఆన్ చేసి ఉంచడంతో, ఇంట్లో గ్యాస్ వ్యాపించి ఉండటాన్ని గమనించని రవీందర్ అగ్గిపుల్ల గీయడంతో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న అతను సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యేపై ఆరోపణలు అవాస్తవం
ఎవరి భూములూ కబ్జా చేయలేదు అప్రతిష్టపాలు చేసేందుకే ఆరోపణలు ధైర్యముంటే ఎర్రాపహడ్‌కు వచ్చి నిరూపించండి అఖిలపక్షానికి టీఆర్ఎస్ సవాల్ కామారెడ్డి : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏనుగు రవీందర్‌రెడ్డిని ఎదుర్కొనలేక, ఓటమి చెందినవారు ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎర్రాపహడ్‌కు వచ్చి ఎవరి భూములు ఆక్రమణకు గురయ్యాయో నిరూపించాలని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదాశివనగర్, గాంధారి జడ్పీటీసీ సభ్యులు రాజేశ్వర్రావ్, తానాజీరావ్, ఎల్లారెడ్డి ఎంపీపీ నక్క గంగాధర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నవారు ఎర్రాపహడ్‌లో ఆక్రమణలను రుజువు చేస్తే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని, గజం ఆక్రమించినట్టు తేలితే గజానికి ఎకరం భూమి ఇప్పిస్తామని స్పష్టం చేశారు. భూములను కొలవడానికి అధికారులు వ చ్చినపుడు అఖిలపక్ష నేతలంతా వచ్చి ప్రత్యక్షంగా చూసి ఎక్కడ ఆక్రమణకు గురయ్యూయో చూపించాలన్నారు. ఎన్నికలప్పుడే కనిపించే నాయకులు ఎమ్మెల్యేను ఎదుర్కొనలేక భూ ఆక్రమణలంటూ దళితులను మో సం చేస్తున్నారని ఆరోపించారు. అఖిల పక్ష నేతలు ఎల్లారెడ్డిలోనో, తాడ్వాయిలోనో, కామారెడ్డిలోనో మాట్లాడకుండా ఎర్రాపహడ్‌లో గ్రామ సభకు సిద్దం కావాలని అన్నారు. తేదీ ప్రకటిస్తే ప్రజల సమక్షంలో మాట్లాడి, ప్రజల సమక్షంలో కొలతలు వేయించేందుకు సిద్ధమని ప్రకటించారు. రవీందర్‌రెడ్డి దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, భూపంపిణీ కార్యక్రమంలో జిల్లాలో అన్ని మండలాల కంటే ఎక్కువగా తాడ్వాయి మండల దళితులకే ఇప్పించారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అమాయక ప్రజలను మోసం చేయడం మంచిది కాదన్నారు. ఎల్లారెడ్డిలో అఖిలపక్ష సమావేశానికి అనుమతి తీసుకోలేదని పోలీసులు అరెస్టు చేస్తే, ఎమ్మెల్యేనే చేయించాడంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఎమ్మెల్యే భూములను సర్వే చేసిన అధికారులు అక్కడ దళితుల భూములు లేవని ప్రకటించారని గుర్తుచేశారు. సమావేశంలో డీసీసీబీ డెరైక్టర్ సంపత్‌గౌడ్, ఎంపీపీలు బసంత, విజయ, జడ్పీటీసీలు కాశినారాయణ, సామెల్, సావిత్రి, టీఆర్ఎస్ నాయకులు నారెడ్డి లింగారెడ్డి, గడ్డం రాంరెడ్డి, మహేందర్‌రెడ్డి, ముదాం సాయిలు, శివాజీరావ్, భూంరెడ్డి, సాయిరెడ్డి, సంతోష్‌రెడ్డి, భూమాగౌడ్ పాల్గొన్నారు.