'ఆటోడ్రైవర్ల సజీవదహనం' కేసులో ముగ్గురి అరెస్టు
నగరంలో సంచలనం రేపిన 'ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తుల సజీవదహనం' కేసు చిక్కుముడి వీడింది. ఏప్రిల్ 2న సికింద్రాబాద్ పరిధిలోని పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు.. బాటా షోరూం వద్ద ఫుట్పాత్పై పడుకున్న ఆనంద్ అనే ఆటోడ్రైవర్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనకు బాద్యులైన సిద్దీఖ్, అఖీర్ ఖాన్, అన్నును శుక్రవారం మహంకాళి పోలీసులు అరెస్టుచేశారు.
నిదితులు ముగ్గురూ హఫీజ్బాబానగర్కు చెందినవారని, హత్యకు దారితీసిన కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. సజీవదహన ఘటనల్లో తీవ్రంగా గాయపడిన నర్సింగరావు మృతి చెందగా, ఆనంద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.