ఫోన్‌కు బానిసైన కూతురిపై తండ్రి ఘాతుకం | Teenager Set On Fire By Father Over Phone Addiction | Sakshi
Sakshi News home page

ఫోన్‌కు బానిసైందని కూతురికి నిప్పుపెట్టిన తండ్రి

Published Tue, Jan 1 2019 3:59 PM | Last Updated on Tue, Jan 1 2019 4:01 PM

Teenager Set On Fire By Father Over Phone Addiction - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, ముంబై : మొబైల్‌ ఫోన్‌ యువత జీవితాలను బలితీసుకుంటోంది. కన్నకూతురు నిత్యం ఫోన్‌లో మునిగితేలుతున్నదనే ఆగ్రహంతో తండ్రి ఆమెకు నిప్పుపెట్టిన ఘటన ముంబై మహానగరంలో వెలుగుచూసింది. పదేపదే ఫోన్‌లో సంభాషిస్తున్న కుమార్తె (16)ను తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, నిందితుడు మహ్మద్‌ మన్సూరీ ఆగ్రహంతో బాలికపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు.

కాగా,డెబ్బై శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలిక ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేరని పేర్కొన్నారు.బాలికను స్ధానికులు ఆస్పత్రిలో చేర్పించారని పోలీసులు వెల్లడించారు. నిందితుడు మన్సూరీని అరెస్ట్‌ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement