JJ Hospital: ఆస్పత్రిలో 132 ఏళ్ల నాటి సొరంగం | 132 Year Old Tunnel Discovered Under Nursing Complex Of JJ Hospital | Sakshi
Sakshi News home page

JJ Hospital: ఆస్పత్రిలో 132 ఏళ్ల నాటి సొరంగం

Published Fri, Nov 4 2022 7:31 PM | Last Updated on Sat, Nov 5 2022 6:54 PM

132 Year Old Tunnel Discovered Under Nursing Complex Of JJ Hospital - Sakshi

ఒక ఆస్పత్రి భవనం పునాది కింద 132 ఏళ్ల నాటి బ్రిటిష్‌ కాలం నాటి సొరంగం బయటపడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లాలో చోటుచేసుకుంది. ముంబైలోని జేజే ఆ‍స్పత్రి అండ్‌ గ్రాండ్‌ మెడికల్‌​ కాలేజీ ప్రాంగణంలో ఈ టన్నెల్‌ని కనుగొన్నట్లు ఆస్పత్రి యజామాన్యం తెలిపింది. ప్రస్తుతం దీన్ని నర్సింగ్‌ కాలేజ్‌గా మార్చనున్నారు. కాలేజ్‌లో నీరు లీకేజీ అవుతుందంటూ ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది.

ఈ ఆస్పత్రి 1890లో నిర్మించినట్లు పునాదిరాయిపై కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ మెడికల్‌ కాలేజ్‌ 1843 మార్చి 30న గ్రాండ్‌ మెడికల్‌ కాలేజ్‌ భవనానికి శంకు స్థాపన చేసినట్లు అధికారలు తెలిపారు. రెండేళ్లలోనే భవనం పూర్తి అయ్యి 1845లో ప్రారంభించబడినట్లు పేర్కొన్నారు. ఈ కాలేజీ వ్యవస్థాపకుడు సర్‌ జంషెట్జీ జేజీబోయ్‌ రూ లక్ష రూపాయ విరాళంతో స్కూల్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ ఏకకాలంలో ఏర్పాటైందని చెప్పారు.

ఒక వైద్యురాలు ఉపరితలంపై ఏర్పడిన రంధ్రం గురించి తెలుసుకునే క్రమంలో ఈ సోరంగం ఆచూకి బయటపడినట్లు తెలిపారు. ఈ సోరంగంపై తదుపరి దర్యాప్తు విషయమై కలెక్టర్‌ కార్యాలయానికి, పురావస్తు శాఖకు తెలియజేసి ప్రాథమిక వివరాలను నివేదించనున్నట్లు జేజే ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. 

(చదవండి: 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement