JJ hospital
-
JJ Hospital: ఆస్పత్రిలో 132 ఏళ్ల నాటి సొరంగం
ఒక ఆస్పత్రి భవనం పునాది కింద 132 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి సొరంగం బయటపడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లాలో చోటుచేసుకుంది. ముంబైలోని జేజే ఆస్పత్రి అండ్ గ్రాండ్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఈ టన్నెల్‌ని కనుగొన్నట్లు ఆస్పత్రి యజామాన్యం తెలిపింది. ప్రస్తుతం దీన్ని నర్సింగ్ కాలేజ్‌గా మార్చనున్నారు. కాలేజ్‌లో నీరు లీకేజీ అవుతుందంటూ ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఆస్పత్రి 1890లో నిర్మించినట్లు పునాదిరాయిపై కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ మెడికల్ కాలేజ్ 1843 మార్చి 30న గ్రాండ్ మెడికల్ కాలేజ్ భవనానికి శంకు స్థాపన చేసినట్లు అధికారలు తెలిపారు. రెండేళ్లలోనే భవనం పూర్తి అయ్యి 1845లో ప్రారంభించబడినట్లు పేర్కొన్నారు. ఈ కాలేజీ వ్యవస్థాపకుడు సర్ జంషెట్జీ జేజీబోయ్ రూ లక్ష రూపాయ విరాళంతో స్కూల్ ఆఫ్ ప్రాక్టీస్ ఏకకాలంలో ఏర్పాటైందని చెప్పారు. ఒక వైద్యురాలు ఉపరితలంపై ఏర్పడిన రంధ్రం గురించి తెలుసుకునే క్రమంలో ఈ సోరంగం ఆచూకి బయటపడినట్లు తెలిపారు. ఈ సోరంగంపై తదుపరి దర్యాప్తు విషయమై కలెక్టర్ కార్యాలయానికి, పురావస్తు శాఖకు తెలియజేసి ప్రాథమిక వివరాలను నివేదించనున్నట్లు జేజే ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. (చదవండి: 21 రోజుల శిశువు కడుపులో ఎనిమిది పిండాలు) -
Covid-19: ప్రముఖ ఆస్పత్రిలో 61 మంది డాక్టర్లకు కరోనా
సాక్షి, ముంబై: నగరంలోని ప్రముఖ జేజే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 61 మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా సోకింది. ఈ విషయం స్వయంగా రెసిడెంట్ డాక్టర్ల సంఘం వెల్లడించింది. ఇప్పటికే ఈ ఆస్పత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికి తోడు 61 మంది నివాస డాక్టర్లకు కరోనా సోకడంతో ఇంటికే పరిమితం కావల్సిన పరిస్ధితి వచ్చింది. ఇది ఆస్పత్రి వైద్య సేవలపై తీవ్రంగా ప్రభావం చూపే ఆస్కారముందని మార్డ్ అధ్యక్షుడు డా.అవినాశ్ దహిఫళే బుధవారం తెలిపారు. ఒకేరోజు, ఒకే ఆస్పత్రిలో ఇంత పెద్ద సంఖ్యలో డాక్టర్లకు కరోనా సోకడం కలకలం కలిగిస్తోంది. డాక్టర్ల కొరత కారణంగా ఇప్పటికే ఓపీడీ సేవలు సక్రమంగా సాగడం లేదు. చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..) గడచిన 24 గంటల్లో మొత్తం 120 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. మరికొంత మంది సైతం కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అవినాశ్ అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం వార్డులో చికిత్స పొందుతున్న రోగులపై పడుతోందని చెబుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే అనేక మంది రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో తరుచూ ఆందో ళన, సమ్మెకు దిగుతున్నారు. ఫలితంగా అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లలో కరోనా పాజిటివ్ ఇలాగే పెరిగితే పరిస్థితి వైద్య సేవలలో అంతరాయం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా వైద్య, విద్యా శాఖ, రీసర్చ్ డైరెక్టర్ల మండలి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అవినాశ్ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం) -
వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు ఓకే!
ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విప్లవ కవి వరవరరావును జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు సుముఖంగా ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం వరవరరావు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను డిశ్చార్జ్ చేయవచ్చని నానావతి హాస్పటల్ వర్గాలు గతవారం కోర్టుకు తెలిపాయి. డిశ్చార్జ్ అనంతరం ఆయన్ను నవీ ముంబైలోని తలోజా జైలుకు పంపాల్సిఉంటుంది. అయితే ఇందుకు బదులుగా ఆయన్ను జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది దీపక్ ధాకరే చెప్పారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన కుటుంబసభ్యులు ప్రొటోకాల్స్‌కు లోబడి ఆయన్ను కలవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం తరఫు ఈ సడలింపులకు ఓకేఅని, మిగిలిన అంశాలు ఎన్ఐఏ పరిధిలోనివని చెప్పారు. వరవరరావు పట్ల మానవీయ ధృక్పధాన్ని అవలంబించాలన్న కోర్టు సూచన మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం ఎన్ఐఏ న్యాయవాది అనిల్ సింగ్ వాదిస్తూ, రావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు సుముఖమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అప్రస్తుతమైన అంశమని చెప్పారు. బెయిల్ ఇవ్వండి వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన భార్య తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. జైల్లో సరైన వైద్యసదుపాయం లేకుండా ఆయన్నుంచడం రావు ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. జైల్లో ఉన్నవారికి ఆరోగ్య సదుపాయాలు అందించకపోవడం క్రూరత్వమన్నారు. తలోజా జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యం మరలా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నట్లు నానావతి ఆస్పత్రి వర్గాలిచ్చిన రిపోర్టును న్యాయమూర్తులు గుర్తు చేశారు. డిశ్చార్జ్ అనంతరం జైల్లోకి మరలా వెళితే ఏమవుతుందో ఎవరూ చెప్పలేరని ఇందిరా వాదించారు. అందువల్ల కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే రావు బెయిల్‌కు ఎన్ఐఏ అభ్యంతరాలు చెప్పవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన్ను హైదరాబాద్ పంపితే తిరిగి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని ఎన్ఐఏ అభ్యంతరం చెప్పవచ్చని తెలిపింది. ప్రభుత్వాన్ని పడదోయడానికి యత్నించారన్నదే ఆయనపై అభియోగమని గుర్తు చేసింది. తాము బెయిల్ అడుగుతున్నది ఆరోగ్యకారణాలపై కనుక, ఎన్ఐఏ అభ్యంతరాలు వర్తించవని, అలాగే ఆయనపై అభియోగాలు నిజం కాదని న్యాయవాది పేర్కొన్నారు. ప్రధాని హత్య గురించిన ఉత్తరం కనుగొన్నట్లు ఎన్ఐఏ చెబుతోందని, ఎవరైనా అలాంటి ఉత్తరాలు కంప్యూటర్లలో దాచుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ కట్టుకధలన్నారు. కావాలంటే కఠిన నిబంధనలతో కూడిన బెయిల్‌నైనా మంజూరు చేయాలని కోరారు. అయితే రావుకు అన్ని రకాల వైద్యసాయం అందించేందుకు తాము కృషి చేశామని ధర్మాసనం గుర్తు చేసింది. ఉపా చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్ ఇవ్వాలంటే పలు అభ్యంతరాలుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా మానవహక్కులపై పలు డిక్లరేషన్లను ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. రావు బెయిల్ పిటీషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి. -
జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వరవరరావు కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి వెల్లడించారు. పరీక్షల అనంతరం ఆస్పత్రిలో చేర్పిస్తారా.. లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి, అమానుషంగా జైలులో దీర్ఘ కాలం నిర్బంధించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాత్కాలిక బెయిల్ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతోపాటు తన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఆర్.సత్యనారాయణ్ అయ్యర్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వరవరరావుకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ జూన్ 26న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషన్, వరవరరావు మెడికల్ రికార్డులను అందజేసేలా నవీ ముంబైలోని తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. -
వరవరరావుకు అస్వస్థత!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వరవరరావు అనారోగ్య సమాచారాన్ని చిక్కపడపల్లి పోలీస్ స్టేషన్‌కు అందించినట్టు పుణె పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు, ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వరవరరావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వరవరరావును ఉంచిన జైల్లోని కొందరు ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక ఖైదీ మరణించినట్టు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడైన తమ తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని వరవరరావు ముగ్గురు కూతుర్లు పి.సహజ, పి.అనల, పి.పవన మహారాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తప్పుడు అభియోగాలతో తమ తండ్రిని జైల్లో వేశారని వాపోయారు. కొవిడ్-19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని లేఖలో వారు పేర్కొన్నారు. (చదవండి: జీవించే హక్కు వీరికి లేదా?) -
ఫోన్‌కు బానిసైన కూతురిపై తండ్రి ఘాతుకం
సాక్షి, ముంబై : మొబైల్ ఫోన్ యువత జీవితాలను బలితీసుకుంటోంది. కన్నకూతురు నిత్యం ఫోన్లో మునిగితేలుతున్నదనే ఆగ్రహంతో తండ్రి ఆమెకు నిప్పుపెట్టిన ఘటన ముంబై మహానగరంలో వెలుగుచూసింది. పదేపదే ఫోన్లో సంభాషిస్తున్న కుమార్తె (16)ను తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, నిందితుడు మహ్మద్ మన్సూరీ ఆగ్రహంతో బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. కాగా,డెబ్బై శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలిక ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేరని పేర్కొన్నారు.బాలికను స్ధానికులు ఆస్పత్రిలో చేర్పించారని పోలీసులు వెల్లడించారు. నిందితుడు మన్సూరీని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి ముఖర్జియా
ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కాగా షీనా బోరా హత్య కేసులో భాగంగా కోర్టుకు హాజరైన ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మ గురువారం పలు సంచలన విషయాలు వెల్లడించారు. షీనా హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణి ముఖర్జియా తనచేత షీనా పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారని, తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణి అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా ఇంద్రాణి సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇంద్రాణి దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్ప తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రాణి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. కాగా ఆమె ఇది వరకు కూడా పలుమార్లు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
ఇంద్రాణీ ముఖర్జియాకు అస్వస్థత
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా(46) అస్వస్థతకు లోనయ్యారు. దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలులో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను అధికారులు శుక్రవారం రాత్రి ఇక్కడి జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇంద్రాణీకి సీసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి డీన్ ఎస్డీ ననంద్కర్ తెలిపారు. ఇంద్రాణీ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. 2012, ఏప్రిల్‌లో కుమార్తె షీనా బోరాను అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో ఇంద్రాణీని పోలీసులు 2015లో అరెస్ట్ చేశారు. -
స్పృహలోకి ఇంద్రాణి
-
స్పృహలోకి ఇంద్రాణి
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పృహలోకి వచ్చింది. దీంతో ఇక ఆమె ప్రాణానికి ఎలాంటి ముప్పులేదని వైద్యులు ధృవీకరించారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారిన విషయం తెలిసిందే. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలింది. దీంతో వెంటిలేటర్ ద్వారా ఆమెకు ఆక్సిజన్ అందించారు. కాగా, ఈ కేసు నేపథ్యంలో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి.కానీ ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడటం వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. -
'48 గంటలు గడిస్తే కానీ చెప్పలేం..'
ముంబై: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ముంబై జేజే ఆస్పత్రి వైద్యులు చెప్పారు. 48 గంటలు గడిస్తే కానీ ఆమె పరిస్థితిని చెప్పలేమని వైద్యులు తెలిపారు. షీనాబోరా హత్య కేసులో బైకలా జైల్లో రిమాండ్‌లో ఉన్న ఇంద్రాణి అపస్మారక స్థితికి చేరుకోవడంతో శుక్రవారం జేజే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఆమె మోతాదుకు మించి నిద్రమాత్రలు వాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జేజే ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
మరో 3 రోజులు ఆస్పత్రిలోనే ఇంద్రాణి
ఆత్మహత్యా యత్నం! ఆస్పత్రిలో అపస్మారకంలో.. ముంబై: జైల్లో ఉండి ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఇంద్రాణి ముఖర్జీ మరో మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె సగం స్పృహలో ఉందని.. ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తూ, మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంచుతామని ముంబై జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే శనివారం ఉదయం తెలిపారు. ఆమెకు అవసరమైన రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలను చేయించామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో సీబీఐ బృందానికి కూడా చెప్పామని ఆయన అన్నారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారింది. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె అపస్మారకంలో ఉన్నారని, పరిస్థితి విషమంగా ఉందని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే ప్రకటించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలిందని, వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు వివరించారు. తనకు ఒంట్లో బాగాలేదని ఇంద్రాణి చెప్పటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ మోహన్ దహికర్ చెప్పారు. ఆమె కడుపులోని ద్రవపదార్థాలను సేకరించి ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఇంద్రాణి ఆరోగ్యం ఉన్నట్టుండి దెబ్బతినటంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని జేజే ఆసుపత్రి డీన్ లహానే చెప్పారు. ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మాత్రమే, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. అయితే ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడారని.. దాని వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ఆమె ఈ మాత్రలు వేసుకుంటున్నారు. అధిక మోతాదులో మాత్రలు ఆమె దగ్గరకు ఎలా చేరాయో తెలియటం లేదని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. ఇప్పటికే ఆమె కేసును విచారించిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. -
'ఇంద్రాణి పరిస్థితి విషమం'
-
‘సర్ జేజే’ విస్తరణకు శ్రీకారం
- మరో 200 ప్రైవేట్ గదుల నిర్మాణానికి నిర్ణయం - రూ. 600 కోట్లు ఖర్చుకానున్నట్లు అంచనా సాక్షి, ముంబై : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్ జేజే గ్రూప్ ఆస్పత్రుల పరిపాలనా విభాగం కొత్త సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్ ప్రాజెక్టులో భాగంగా మరో 200 ప్రైవేట్ గదులను నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకు రూ.650 కోట్లు ఖర్చు కానున్నట్లు సంబంధిత అధికారి శనివారం వెల్లడించారు. ఆగ్నేయ ఆసియాలోనే ఈ జేజే ఆస్పత్రి అతి పురాతనమైన, అతి పెద్దదైన ఆస్పత్రిగా పేరు గడించింది. 1,352 పడకల ఈ ఆస్పత్రిని సర్ జెమ్‌షెట్‌జీ జీజీభాయ్ 150 ఏళ్ల కిందట నిర్మించారు. కొత్త భవనాన్ని నిర్మించే ముందు పురాతన రెండు భవనాలను కూల్చాల్సి ఉంటుంది. ఇందుకు టెండర్లను కూడా ఆహ్వానించా మన్నారు. డిసెంబర్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. చాలా రోజులుగా ఇక్కడ మరిన్ని ప్రైవేట్ గదుల నిర్మాణం చేపట్టాల్సిందిగా రోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోందని వారు తెలిపారు. ఆస్పత్రి డీన్ టి.పి.లహానే మాట్లాడుతూ సూపర్‌స్పెషాలిటీ డిపార్ట్మెంట్ భవనం ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైందని తెలిపారు. ప్రణాళిక ప్రకారం ఆస్పత్రి ఆవరణలో ఎనిమిది అంతస్తులు గల రెండు భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక భవనంలో దాదాపు 200 ప్రైవేట్ రూంలను నిర్మిస్తామన్నారు. ఈ గదుల అద్దె రూ.రోజుకు 500 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర ప్రైవేట్ ఆస్పత్రులతో పోల్చితే ఇది చాలా చౌకగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 30 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 16 ఆపరేషన్ థియేటర్లతోపాటు 38 డిపార్ట్మెంట్లు, రోజూ హాజరయ్యే 2,500 ఓపీడీ రోగుల కోసం కేటాయించనున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు 1,100 అడ్మిషన్లు, 200 శస్త్రచికిత్సలు జరుగుతాయని తెలిపారు. కొన్ని ఏళ్లుగా ఆస్పత్రి తీవ్రమైన స్థల కొరత సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సమస్యను ఛేదించేందుకు పరిపాలనా విభాగం ఇటీవలే పాత ఖైదీల వార్డును ఉపయోగించుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు తెలిపారు. -
‘రాజావాడి’.. మృత్యు ఒడి!
సాక్షి, ముంబై: రాజావాడీ ఆస్పత్రిలో చేరారంటే మృత్యువు నోట్లో తలపెట్టినట్లే.. సరాసరి యమలోకానికి టికెట్ తీసుకున్నట్లేనని స్థానికులు భావిస్తున్నారు. మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి చెందిన రాజావాడి ఆస్పత్రిలో రోజుకు సరాసరి 16 మంది దుర్మరణం చెందినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆందోళన కలిగించే ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో బయటపడింది. నగరంలో జే.జే. ఆస్పత్రి మినహా కేం, నాయర్, సైన్, రాజావాడి ఆస్పత్రులు బీంఎసీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కేం, నాయర్, సైన్ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య, అందులో చేరేవారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీటితో పోలిస్తే రాజావాడి ఆస్పత్రిలో చేరే రోగుల సంఖ్య అత్యల్పంగా ఉన్నప్పటికీ మృతుల సంఖ్యలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం జరిగిన స్థాయీ సమితి సమావేశంలో ఆస్పత్రుల స్థితిగతులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ ప్రవీణ్ చెఢా నాయర్ కేం, సైన్, రాజావాడి ఆస్పత్రుల్లో గత 13 సంవత్సరాల కాలంలో మృతి చెందిన వారి వివరాలు అందజేశారు. ఆస్పత్రి సూపరెంటెండెంట్ అందించిన వివరాల ప్రకారం రాజావాడి ఆస్పత్రిలో 2001 నుంచి 2014 మార్చి వరకు మొత్తం 55,75,716 రోగులు చేరారు. అందులో 76,663 మంది చనిపోయారు. దీన్ని బట్టి సరాసరి రోజుకు 16 మంది మృతి చెందుతున్నట్లు స్పష్టమైంది. ఇదే 13 సంవత్సరాల కాలంలో సైన్ ఆస్పత్రిలో దాదాపు 1.92 కోట్లు రోగులు చేరగా 63,373 మంది చనిపోయారు. అలాగే నాయర్ ఆస్పత్రిలో 33 లక్షల మంది రోగులు చేరగా 29,650 మంది చనిపోయారు. సైన్ ఆస్పత్రిలో సరాసరి రోజుకు 13 మంది చనిపోగా, నాయర్ ఆస్పత్రిలో సరాసరి రోజుకు ఆరుగురు చనిపోయినట్లు వెల్లడించారు. ప్రముఖ మూడు ఆస్పత్రులతో పోలిస్తే రాజావాడిలో చేరే రోగుల సంఖ్య అత్యల్పంగా ఉంది. కాని మృతుల సంఖ్యలో వీటిని అధిగమించింది. దీన్ని బట్టి రాజావాడి ఆస్పత్రి పనితీరుపై చెఢా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వివరాలపై బీఎంసీ అదనపు కమిషనర్ సంజయ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. గత సంవత్సర కాలంలో ఈ ఆస్పత్రిలో 1,008 మంది రోగులు మాత్రమే చనిపోయారని తెలిపారు. దీని ప్రకారం సరాసరి రోజుకు ముగ్గురే మృతి చెందినట్లు స్పష్టమవుతోందన్నారు. కాని రోజుకు 16 మంది మృతి చెందుతున్నట్లు వెల్లడి కావడం అతిశయోక్తిగా ఉందని, లెక్కల్లో ఇంత తేడా ఉండదని దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. -
ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం
-
ముంబైలో కూలిన ఐదంతస్తుల భవనం
ముంబయి : ముంబయిలో మరో భవనం కుప్పకూలింది. డాక్‌యార్డ్ రోడ్డు సమీపంలోని పురాతన అయిదు అంతస్తులు భవనం ఈరోజు ఉదయం ఆరున్నర ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పదిహేనుమందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 15 బృందాలతో సహాయక సిబ్బంది జెసిబీల సహాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40మంది వరకూ శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ముంబయిలో బహుళ అంతస్తుల భవనాలు కూలిన ఘటనలు ఈ ఏడాదిలో ఇది మూడవది. ఏప్రిల్ 4న ఏడంతస్తుల భవనం కూలి 76మంది, జూన్ 10న అయిదంతస్తుల భవనం కూలి మరో 10మంది మృతి చెందిన విషయం తెలిసిందే.