ప్రియురాలితో మొబైల్‌ చాటింగ్‌ ... దెబ్బకు ఆగిపోయిన విమానం | IndiGo Flight Took Off 6 Hours Delay Man Chating With His Girlfriend | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో మొబైల్‌ చాటింగ్‌ ... దెబ్బకు ఆగిపోయిన విమానం

Published Mon, Aug 15 2022 11:52 AM | Last Updated on Mon, Aug 15 2022 1:11 PM

IndiGo Flight Took Off 6 Hours Delay Man Chating With His Girlfriend - Sakshi

బెంగళూరు: ఒక వ్యక్తి మొబైల్‌కి సందేశం రావడంతో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన విమానం ఆరుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఇండిగో విమానాన్ని ముంబై బయలుదేరడానికి అనుమతించే ముందు పోలీసులు ప్రయాణికులందర్నీ విమానం నుంచి దించి హఠాత్తుగా తనీఖీలు చేయడం మొదలు పెట్టారు.

పోలీసులు ఇంత అకస్మాత్తుగా తనీఖీలు చేయడానికి కారణం అందులో ఉ‍న్న ఒక మహిళా ప్రయాణికురాలు. ఆమె తన సహా ప్రయాణికుడి మొబైల్‌కి అనుమానాస్పద సందేశం రావడంతో ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ని అప్రమత్తం చేయడంతో టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానం కాస్త ఆగిపోయింది. తిరిగి ఎయిర్‌ పోర్టు బేకు చేరుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి తన మొబైల్‌లో ప్రియురాలితో చాటింగ్‌ చేస్తున్నాడు. అదే విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమానం ఎక్కేందుకు వచ్చిన తనప్రియురాలితో మొబైల్‌లో చాటింగ్‌ చేస్తున్నాడు.

తన స్నేహితురాలు కర్ణాటక రాజధాని వెళ్లే విమానం మిస్సైందని చెప్పుకొచ్చాడు. ఐతే పోలీసులు అతన్ని చాలా సేపు విచారించిన తర్వాత గానీ ప్రయాణించేందుకు అనుమతించ లేదు.  ఈ మేరకు ప్రయాణికులందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత దాదాపు 185 మంది ప్రయాణికులను ముంబై వెళ్లే విమానంలోకి తిరిగి అనుమతించారు. దీంతో విమానం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఐతే ఇది భద్రతల నడుమ ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహ పూర్వక సంభాషణే కావడంతో ఆ వ్యక్తి పై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని నగర పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌ శశికుమార్‌ అన్నారు.

(చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement