
సాక్షి, మహబూబ్ నగర్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దాగుడు మూతలు ఆడేందుకు వెళ్ళి గడ్డివాములో దాక్కున్న ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం గ్రామానికి చెందిన విగ్నేష్, ప్రశాంత్ అనే ఇద్దరితో పాటు శివ అనే మరో బాలుడు కలిసి గ్రామశివారులోని గడ్డివాము పక్కన ఆడుకునేందుకు వెళ్ళారు. అక్కడే ఉన్న ట్రాక్టర్ కు సంబంధించిన కేజీ వీల్స్ పై గడ్డి కప్పి ఆడుకుంటున్నారు.
ఇదే సమయంలో విగ్నేష్, ప్రశాంత్‌లు గడ్డివాము పక్కన దాక్కున్నారు. శివ అనే బాలుడు గడ్డినీ అంటించగా... వారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా చిన్నారులిద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శివ వల్లే తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
చదవండి:
అంబర్‌పేట్‌లో విష వాయువుల కలకలం
గోదావరిలో ఏడుగురు గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment