దారుణం.. బతికుండగానే నలుగురికి నిప్పు | Four members of a family burnt alive in Faridabad | Sakshi
Sakshi News home page

దారుణం.. బతికుండగానే నలుగురికి నిప్పు

Published Tue, Oct 20 2015 10:46 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

Four members of a family burnt alive in Faridabad

ఫరిదాబాద్: ఇదొక దిగ్భ్రాంతిని కలిగించే ఘటన. హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఫరిదాబాద్లో ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు బతికుండగానే నిప్పంటించారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.

మంగళవారం వేకువ జామున 4గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో అవతలి వర్గం వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. నలుగురు బాధితులను ఢిల్లీలోని సప్థార్ జంగ్ ఆస్పత్రికి చికిత్స కోసం అత్యవసరంగా తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement