four members
-
కొడుకు రాసిన మరణశాసనం
తాండూర్: ఆన్లైన్ ట్రేడింగ్ ఆ ఇంటిల్లిపాది పాలిట మృత్యుపాశమైంది. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే కుమారుడి అత్యాశ.. కుటుంబం బలవన్మరణానికి కారణమైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల శివప్రసాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం, అప్పులు అధికం కావడం, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శీతల పానీయంలో గడ్డి మందు కలుపుకొని తాగిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంలో శివప్రసాద్(26)తోపాటు తల్లిదండ్రులు మొండయ్య(58), శ్రీదేవి(52), అక్క చైతన్య అలియాస్ చిట్టి(30) ఒక్కొక్కరుగా గంటల వ్యవధిలో నలుగురూ బుధవారం మృతిచెందారు.యూట్యూబ్‌కు ఆకర్శితుడై..శివప్రసాద్ బెల్లంపల్లిలో కొంతకాలం ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ వైపు ఆకర్శితుడయ్యాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. తొలుత కాస్త లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత వరుసగా నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేయడంతో వడ్డీలు పెరిగి భారమయ్యాయి.రూ.50 లక్షలకు పైగా..అప్పులు పెరిగిపోవడంతో ఏడాది క్రితం కొంతకాలం శివప్రసాద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో అప్పులు రూ.50లక్షలకు పైగా పెరిగిపోయాయి. బ్యాంకు రుణాల పేరుతో మరికొంత అప్పు చేయడంతో మోయలేని భారమైంది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారిలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.వైకల్యం నుంచి శాశ్వత నిద్రలోకి..చైతన్య పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. మరొకరి సాయం ఉంటే గానీ జీవనం సాగించలేని పరిస్థితి కావడంతో దగ్గరుండి చూసుకునేవారు. తామందరం లేకుండా కూతురు ఎలా జీవిస్తుందోనని, చివరికి ఆమె ఎవరికి భారం కాకూడదని ఆలోచించిన తల్లిదండ్రులు తమతోపాటే గడ్డిమందు తాగించి పేగుబంధాన్ని వెంట తీసుకెళ్లారు.గ్రామంలో విషాదఛాయలుమొండయ్య కుటుంబమంతా మృతిచెందడంతో కాసిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే దర్శనమిచ్చాయి. మొండయ్య చిరు వ్యాపారంతోపాటు ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు విక్రయించడంతో అందరికీ సుపరిచితుడయ్యాడు. అందరితో కలిసిమెలిసి ఉండడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నేరుగా కాసిపేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేయాలని బంధువులు నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహాలకు తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. కాగా, మృతుడు శివ ప్రసాద్ మేనమామ కోలేటి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
Madhya Pradesh Election 2023: బరిలో డిగ్గీ సొంత సైన్యం!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలపై తన పట్టును మాజీ రాజ కుటుంబీకుడు దిగ్విజయ్ సింగ్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది... న్యూఢిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి పని చేసే పరిస్థితి లేనప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపే అంశాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. తమతో వారి (కాంగ్రెస్) ప్రవర్తన లాగే వారితో తమ ప్రవర్తన ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను మోసగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో తమకు తగిన బలం ఉందని, గతంలో రెండో స్థానంలో నిలిచామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చివరకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల విడు దల చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయా లపై తన పట్టును మా జీ రాజ కుటుంబీకుడు దిగ్వి జయ్సింగ్ మరో సారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది...తొలి జాబితా చాలా కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం! వివాదాస్పదుడైన సోదరుడు లక్ష్మణ్‌సింగ్‌తో పాటు కుమారుడు జైవర్ధన్, అల్లుడు ప్రియవ్రత్, అదే వరుసయ్యే అజయ్‌సింగ్ రాహుల్ పేర్లకు జాబితాలో చోటు దక్కింది. అజయ్‌సింగ్ రాహుల్ 68 ఏళ్లు. దిగ్విజయ్‌కి వరసకు కోడలి భర్త. రక్త సంబంధీకుడు కాకున్నా డిగ్గీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఐదుసార్లు ఎమ్మెల్యే. వింధ్య ప్రాంతంలో గట్టి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సిద్ధి జిల్లాపై పలు దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం ఆయన కుటుంబానిదే. ‘మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగింది కేవలం కుటుంబ పాలన మాత్రమేనని దిగ్విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. నా కుమారుడు ఆకాశ్ తనకు టికెటివ్వొద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇవీ మా పార్టీ పాటించే విలువలు!’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో పార్టీ సీనియర్ నేత. లక్ష్మణ్‌సింగ్ 68 ఏళ్లు. దిగ్విజయ్ తమ్ముడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీనీ వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు! 2004లో బీజేపీలో చేరి రాజ్‌గఢ్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. 2010లో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని విమర్శించి బహిష్కారానికి గురయ్యారు. 2018లో రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రియవ్రత్‌సింగ్ 45 ఏళ్లు. దిగ్విజయ్ మేనల్లుడు. కిల్చీపూర్ సంస్థాన వారసుడు. ఆ స్థానం నుంచే 2003లో అసెంబ్లీకి వెళ్లారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకుని 2008లో మళ్లీ నెగ్గారు. 2013లో ఓడినా 2018లో మంచి మెజారిటీతో గెలిచారు. కమల్‌నాథ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ దక్కించుకున్నారు. జైవర్ధన్‌సింగ్ 37 ఏళ్లు. దిగ్విజయ్ కుమారుడు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో సింధియాల కంచుకోట లను చేజిక్కించుకోవడంపై ఈసారి దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయుల్లో పలువురిని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేర్చారు. డూన్ స్కూల్లో చదివిన ఆయన కొలంబియా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమ మాజీ సంస్థానమైన రాఘవ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి 59 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. 2018లో దాన్ని 64 వేలకు పెంచుకోవడమే గాక కమల్ నాథ్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించు కున్నారు. -
నాలుగు దేశాలు.. నలుగురు వ్యోమగాములు
కేప్ కెనవెరాల్: నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం కేప్ కెనవెరాల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ఆదివారం నలుగురు వ్యోమగాములు అడుగిడుతారు. మార్చి నెల నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాముల స్థానంలో వీరు బాధ్యతలు చేపడతారు. ఆరు నెలలపాటు అక్కడుంటారు. నలుగురిలో ఒకరు నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు డెన్మార్క్, జపాన్, రష్యా దేశస్తులు. అమెరికా ఇలా ఒకే అంతరిక్ష నౌకలో వేర్వేరు దేశాలకు చెందిన వారిని ఐఎస్ఎస్కు పంపించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నాసా పంపించిన స్పేస్ ఎక్స్ ట్యాక్సీ రాకెట్లలో ఇద్దరు లేదా ముగ్గురు అమెరికన్లు ఉండేవారు. తాజా బృందానికి నాసాకు చెందిన జాస్మిన్ మొఘ్‌బెలి అనే మెరైన్ పైలట్ నాయకత్వం వహిస్తున్నారు. జాస్మిన్ తల్లిదండ్రులు ఇరాన్ దేశస్తులు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో జర్మనీ వెళ్లిపోయారు. అక్కడే జాస్మిన్ పుట్టారు. న్యూయార్క్‌లో పెరిగారు. అమెరికా మెరైన్స్ చేరి అఫ్గానిస్తాన్‌లో యుద్ధ హెలికాప్టర్లు నడిపారు. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని ఇరాన్ బాలికలకు చూపుతున్నానని ఆమె అంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
ఘట్కేసర్: బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిని గుర్తు తెలియ ని వాహనం ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వద్ద గురువారం ఉదయం జరిగింది. సీఐ చంద్రబాబు తెలిపిన మేరకు.. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజుపల్లికి చెందిన పాలడుగు నవీన్ (25) ఊబర్‌లో బైక్ నడుపుతుండగా, జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్ (23), జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిత్తాపూర్ గ్రామానికి చెందిన నానాడం వినిత (21) పంజగుట్టలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితు లు ఒకే గదిలో ఉంటుండగా వినీత ఆబిడ్స్‌లోని ఓ వసతి గృహంలో ఉంటోంది. ఈ క్రమంలో ముగ్గురు స్నేహితులయ్యారు. బుధవారం కరీంనగర్ నుంచి కోచింగ్ కోసం సోదరుడు విశాల్, సోదరి విశాలి రాగ వారిని దిల్సుఖ్నగర్ వదిలిపెట్టి తిరిగి వసతి గృహానికి చేరుకుంది. గురువారం ఉదయం నవీన్, దాసరి నవీన్, వినిత బైక్‌పై బీబీనగర్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళుతూ అవుషాపూర్ వద్ద పెట్రోల్ పోయించుకొని సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 100 డయాల్ కాల్‌తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం, ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్లారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. (చదవండి: నలుగురిని కిడ్నాప్ చేసిన బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్) -
ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్‌కు యువతను బానిసలు చేసి, భారీగా డబ్బు కొల్లగొడుతున్న సంఘటనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ–కామర్స్ పేరుతో సంస్థల్ని, వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్న చైనా కంపెనీలు.. ఈ ముసుగులో ఆన్లైన్ గేమ్‌ను ప్రోత్సహిస్తూ ఆదాయం గడిస్తున్నాయి. తాజాగా కలర్ ప్రిడిక్షన్ పేరుతో రూపొందించిన ఓ గేమ్ యువతను నిండా ముంచుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే దేశంలో రూ.1100 కోట్ల టర్నోవర్ చేసిన ఈ గేమ్.. ఇప్పటికే రూ.110 కోట్లను విదేశాలకు తీసుకెళ్లింది. దీనిపై ఫిర్యాదు రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఓ చైనీయుడి సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం కొత్వాల్ అంజనీకుమార్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ గేమ్ నిర్వహిస్తున్న సంస్థలకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఎలా ఏ మారుస్తున్నారంటే.. నిర్వాహకులు ఈ గేమ్‌ను ఓ ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించారు. ఓ కొత్త వ్యక్తి ఇందులోకి ప్రవేశించినప్పుడు అతడి ఐపీ అడ్రస్, ఇతర వివరాలను అది సంగ్రహిస్తుంది. అనంతరం తొలుత కొన్నిరోజులపాటు అతడు పందెం గెలిచేలా చేసి బానిసగా మారుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు కొన్ని గేమ్‌లలో ఓడేలా.. పూర్తిగా బానిసగా మారిన తర్వాత అన్నీ ఓడిపోయేలా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఉంటోంది. దీంతో దీని వలలో చిక్కి గేమ్ ఆడినవాళ్లు నష్టపోవడమే తప్ప.. లాభపడటం అనేది జరగట్లేదు. ఇలా నష్టపోయినవారిని దళారులుగా మార్చుకుంటూ మరికొంత మందిని తమ వలలో చిక్కేలా గేమ్ నిర్వాహకులు పథకం వేశారు. ఈ గేమ్‌లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా కొత్తవారిని ఆకర్షించి వారికి రిఫరల్ కోడ్ ఇస్తే.. రూ.1000 కమీషన్‌గా ఇస్తున్నారు. అంతేకాకుండా అతడు ఆడి, కోల్పోయే మొత్తం నుంచి 10 శాతం కూడా ఇస్తున్నారు. ఇలా మరింతమందిని ఈ ఉచ్చులో దింపేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు: లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ గేమ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ ఉచ్చులో చిక్కి రూ.లక్షల్లో కోల్పో యిన అనేక మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. హైదరాబాద్‌లో రూ.6 లక్షలు కోల్పోయిన ఎస్సార్‌నగర్ యువకుడితో పాటు రూ.15 లక్షలు కోల్పోయిన ఆదిలాబాద్ యువకుడు, తమిళనాడులో పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు రూ.97వేలు, మరో యువకుడు రూ.1.64 లక్షలు పోగొట్టుకోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ సంస్థలు, వ్యవహారాలను చైనాకు చెందిన బీజింగ్ టి పవర్ అనే సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు నిర్ధారిం చారు. ఈ ఆధారాలను బట్టి ఢిల్లీలో ఉంటున్న ఈ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్న చైనా జాతీయుడు యా హౌతో పాటు డైరెక్టర్లుగా పని చేస్తున్న ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను అరెస్టు చేశారు. వీరిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 28 కేసులు నమోదు కావడంతో అరెస్టు సమాచారాన్ని ఆయా అధికారులకు తెలపాలని నిర్ణయించారు. ఏమిటీ కలర్ ప్రిడిక్షన్? చైనాకు చెందిన సూత్రధారులు భారత్‌లో ఉంటున్న యువతను టార్గెట్ చేస్తూ కలర్ ప్రిడిక్షన్ గేమ్‌ను తయారుచేశారు. ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఈ సూత్రధారులు.. ఈ–కామర్స్ లావాదేవీల పేరుతో అక్కడి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో (ఆర్వోసీ) ఎనిమిది సంస్థల్ని నమోదు చేశారు. ఇవన్నీ ఆన్లైన్లో వివిధ ఈ–కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. ఈ సైట్స్‌లోకి ప్రవేశించినవారు ఓ మూలన ఉండే లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా కలర్ ప్రిడిక్షన్ గేమ్‌లోకి వెళ్లొచ్చు. అయితే ఎవరికి వారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. అప్పటికే ఈ గేమ్ ఆడుతున్న వారు ఇచ్చే రిఫరల్ ఐడీ ద్వారా గేమ్‌లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గేమ్‌లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న ఆçప్షన్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఒకటి ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత గేమ్‌లో ప్రోగ్రామింగ్ రన్ అయి, ఓ రంగు వచ్చి ఆగుతుంది. పందెం కాసినవారు ఎంచుకున్న రంగు వస్తే ఆ మొత్తానికి రెండు నుంచి నాలుగు రెట్ల డబ్బు వారి పేటీఎం ఖాతాలోకి జమ అవుతుంది. రాకపోతే పందెం కాసిన మొత్తం ఆ సంస్థకు చెందుతుంది. -
నలుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ ఓబులేసు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దొరసానిపల్లెకు చెందిన గుర్రం రాము, సగిలిగొడ్డుపల్లె గ్రామానికి చెందిన పెడవల్లి వెంకటసుబ్బారెడ్డి కొంత కాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు. ఈ క్రమంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి దొరసానిపల్లెలోని సాయిబాబా గుడి సమీపంలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో.. ఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు బుకీలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.60,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైపాస్ రోడ్డులోని చిన్నశెట్టిపల్లెకు వెళ్లే రహదారిలో ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన వజ్జల వెంకట అమర్నాథ్, పల్లా వెంకటరమణ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఆ ప్రాంత వాసులు సమాచారం అందించడంతో.. ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.37,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
భార్య, ముగ్గురు పిల్లలను చంపి గొంతుకోసుకున్నాడు
-
భార్యా, పిల్లలను హతమార్చి, ఆత్మహత్యాయత్నం
సాక్షి, చెన్నై : కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి భార్యా,పిల్లలను దారుణంగా హతమార్చి, అనంతరం అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద సంఘటన మంగళవారం ఉదయం తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై పమ్మల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దామోదరన్ అనే వ్యక్తి ఇవాళ ఉదయం భార్య, ముగ్గురు పిల్లలను కొడవలితో దాడిచేసి నరికి చంపాడు. ఈ సంఘటనలో అతని భార్య, ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందగా దాడి అనంతరం తను కూడా కత్తితో గొంతు కోసుకున్నాడు. ఇంట్లోంచి అరుపులు, కేకలు వినపడడంతో ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉన్న దామోదరన్‌ను తాంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విషాద వీచిక
ఏలూరు అర్బన్ : ధర్మం.. సంపాదన.. సంసారం వంటి అన్ని విషయాల్లో తోడు, నీడగా ఉంటామంటూ ‘ధర్మేచ.. అర్థేచ.. కామేచ.. నాతిచరామి’ అని పెళ్లినాడు ప్రమాణం చేసిన ఆ ఇద్దరినీ ఏడాదిన్నర వ్యవధిలో మృత్యువు కాటేసింది. భర్తను పోగొట్టుకున్న తల్లి తన తండ్రి ఇంట ఆశ్రయం పొందుతుండగా.. ఆ వెనుకే కుమార్తె సైతం భర్త వియోగంతో తన ఇద్దరు బిడ్డల్ని తీసుకుని తల్లి చెంతకు చేరింది. నిండు నూరేళ్లు తమతో ఉంటారనుకున్న వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లీకూతుళ్లు ఒంటరులయ్యామనే ఆవేదనతో కుమిలి పోయారు. జీవితంపై విరక్తి పెంచుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డల భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళనతో సతమతమయ్యారు. చివరకు.. చిన్నారులిద్దరికీ విషమిచ్చి, తామూ అదే విషం తాగి ఈ లోకాన్ని వీడిపోయారు. వారం రోజుల తరువాత గాని ఈ విషాదాంతం బాహ్యప్రపంచానికి తెలియలేదు. వారిదో అందమైన కుటుంబం. రేపటిపై బెంగలేని ఆనందమయ జీవితం. ఇంటి యజమాని పేరు అడ్డగూడూరు వెంకట సూర్యనారాయణమూర్తి. ఏలూరులో రైల్వే ఎస్సైగా పనిచేశారు. మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఆయన భార్య నాగపద్మావతి (52). ఆ దంపతుల ఏకైక గారాలపట్టి సంతోషిరూప (37). ఆమెను పదేళ్ల క్రితం ఒడిశా రాష్ట్రం రాయగఢలోని ఓ పేపర్ మిల్లులో ఏజీఎంగా పనిచేస్తున్న దేవరకొండ శ్రీధర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులకు సాయిసిద్ధార్థ్, సాయిరామ్ అనే కుమారులు కలిగారు. సిద్ధార్థ్ వయసు తొమ్మిదేళ్లు కాగా, సాయిరామ్ వయసు ఐదేళ్లు. వారందరి జీవితాలు చీకూచింత లేకుండా సంతోషంగా సాగిపోతున్నాయి. వారిమధ్య పెనవేసుకున్న అనుబంధాన్ని, అన్యోన్యతను చూసి విధికి కన్నుకుట్టింది. ఇంటిపెద్ద అడ్డగూడూరు సూర్యనారాయణమూర్తిని రెండేళ్ల క్రితం మృత్యువు తీసుకెళ్లిపోయింది. అతని మరణాన్ని భార్య నాగపద్మావతి తట్టుకోలేకపోయింది. దుఃఖాన్ని దిగమింగుకుని.. ఏలూరు బీడీ కాలనీలోని ద్వారకా నగర్లో నివాసం ఉంటున్న తన తండ్రి, విశ్రాంత ఇంజినీర్ కౌతవరపు వెంకటరమణ పంచన చేరింది. భర్త పోయిన బాధనుంచి క్రమంగా కోలుకుంటున్న సమయంలో ఆమె మరో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. తన కుమార్తె సంతోషిరూప భర్త శ్రీధర్ గత ఏడాది నవంబర్‌లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడని.. కూతురు సంతోషిరూప తీవ్రంగా గాయపడిందని తెలిసి తల్లడిల్లిపోయింది. తండ్రితో కలిసి హుటాహుటిన అక్కడకు వెళ్లి.. షాక్‌కు గురైన కుమార్తెను మామూలు మనిషిని చేసేందుకు శతవిధాలా యత్నించింది. చాలారోజులపాటు అల్లుడు మరణించాడన్న విషయాన్ని కుమార్తెకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడింది. చివరకు సంతోషరూపను, మనుమళ్లు సాయిసిద్ధార్థ్, సాయిరామ్లను తాను ఆశ్రయం పొందుతున్న తండ్రి ఇంటికి తీసుకొచ్చింది. బెంగ కుంగదీసింది కుమార్తెను, మనుమళ్లను తండ్రి ఇంటికి తీసుకొచి్చన తరువాత అల్లుడు శ్రీధర్ మరణించాడనే విషయం కూతురికి చెప్పింది. కాంతులీనిన జీవితాల్లో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయని తల్లీకూతుళ్లు బెంగప డ్డారు. నాగపద్మావతి తండ్రి కౌతవరపు వెంకటరమణ ఏడు పదుల వయసుతో వార్ధక్యంలో ఉన్నారు. మనుమలు ముక్కుపచ్చలారని చిన్నారులు కావడంతో వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లగలమో లేదోనని తల్లీకూతుళ్లు కుమిలిపోయారు. ఆ పెద్దాయనపై ఎంతకాలం ఆధారపడగలమని ఆందోళన చెందారు. మూడు నెలలుగా వారిద్దరూ ఇదే ఆవేదనతో కుంగిపోతున్నారు. పరిస్థితిని గమనించిన వెంకటరమణ వారిని మరో ప్రాంతానికి తీసుకెళితే కుదుటపడతారనే అభిప్రాయానికి వచ్చారు. ఒడిశాలోని జంషెడ్‌పూర్‌కు నివాసం మారిస్తే వారి మనోవేదన తగ్గుతుందనే ఉద్దేశంతో ఈనెల 15వ తేదీన జంషెడ్పూర్ వెళ్లి అద్దె ఇంటిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అక్కడి నుంచి రోజూ కుమార్తె, మనుమరాలు, మునిమనుమళ్లతో ఫోన్లో మాట్లాడుతూ వచ్చారు. ఈనెల 18న వారికి వెంకటరమణ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. బాధలో ఉండి ఫోన్ తీయడం లేదని భావించిన ఆయన.. ఎట్టకేలకు అక్కడో ఇంటిని అద్దెకు ఖాయం చేసుకున్నారు. గురువారం జంషెడ్పూర్నుంచి ఏలూరులోని ఇంటికి చేరుకున్నారు. కాలింగ్ బెల్ నొక్కినా.. తలుపు కొట్టినా ఇంట్లోంచి ఎవరూ బయటకు రాలేదు. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపుల్ని పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. కుమార్తె, మనుమరాలు, మునిమనుమళ్లు విగతజీవులై పడి ఉన్నారు. ఆ నలుగురూ మరణించారని తెలిసి ఆయన గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈనెల 18న ఆ తల్లీకూతుళ్లు ఇద్దరు చిన్నారులకు నీటిలో విషం (గుళికలు) కలిపి తాగించి.. ఆ తరువాత వారూ తాగినట్టు పోలీసులు అక్కడి పరిస్థితులను బట్టి నిర్ధారణకు వచ్చారు. దుర్గంధం వెదజల్లుతున్నా గుర్తించలేకపోయారు వెంకటరమణ ఇంటినుంచి కొన్ని రోజులుగా విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నా చుట్టుపక్కల వారు ఆ నలుగురు మరణించినట్టు గుర్తించలేకపోయారు. ఆ ఇంటికి సమీపంలో పొదలు ఉండటం, చెత్తాచెదారం పేరుకుపోవడంతో.. వాటిమధ్య పంది మరణించి ఉంటుందని భావించారు. దానివల్లే భరించలేని దుర్వాసన వచ్చిందనుకున్నారు. వెంకటరమణ ఇంటికి తిరిగి వచ్చాక గాని ఈ విషాదాంతం వెలుగు చూడలేదు. ఇంటి పెద్దలు మరణించడంతో తాము అనాథలమయ్యామని భావించి తన కుమార్తె, మనుమరాలు చిన్నారులకు విషమిచ్చి వారూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వెంకటరమణ చెప్పారు. ఏఎస్పీ రత్న, డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీఐ అడపా నాగమురళి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలు బాగా కుళ్లిపోయి ఉండటంతో ఒక్కొక్క దానిని విడివిడిగా మూటలు గట్టి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గంజాయి తరలింపు కేసులో నలుగురి అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్ : టెంపోవ్యా¯ŒSలో గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు అర్బ¯ŒS జిల్లా తూర్పు మండలం డీఎస్పీ రమేష్‌బాబు తెలిపారు. బొమ్మూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ బి.రాజకుమారికి అందిన సమాచారంపై, తన ఆదేశాల మేరకు బొమ్మూరు సీఐ కనకారావు, ఎస్ఐలు కిషోర్‌కుమార్, నాగబాబు, సిబ్బందితో కలసి హుకుంపేట జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారని చెప్పారు. టెంపో వ్యా¯ŒSను తనిఖీ చేస్తుండగా పది బస్తాలలో ఉంచిన 277 కిలోల గంజాయి బయటపడిందన్నారు. దీంతో వ్యా¯ŒS డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి నుంచి 277 కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, రూ.12,730 నగదు, వ్యా¯ŒS స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిందితులైన రాజవోలు గాయత్రినగర్‌కు చెందిన గొలుగూరి వెంకట కృష్ణారెడ్డి, గంగవరం మండలం నెల్లిపూడికి చెందిన చింతల రాంబాబు, రావులపాలెంకు చెందిన పడాల చంద్రశేఖరరెడ్డి, రావులపాలెం మండలం బొక్కావారిపాలెంకు చెందిన కోనా వెంకటేశ్వరరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని డీఎస్పీ తెలిపారు. బొమ్మూరు సీఐ కనకారావు, సిబ్బందిని ఆయన అభినందించారు. -
పాస్‌పోర్టు కేసులో నలుగురి అరెస్టు
నంద్యాల : నకిలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు పొందడానికి యత్నించిన కేసులో గురువారం రాత్రి నలుగురిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన షఫీ సౌదీ అరేబియాకు వెళ్లేందుకు గోస్పాడు మండలం ఎం.చింతకుంట వీఆర్వో రహంతుల్లాకు మూమూళ్లు ఇచ్చి నకిలీ జన్మధ్రువీకరణ పత్రం పొందాడు. దళారులు ఖాన్, బాషాల ద్వారా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. డాక్యుమెంట్లు నకిలీవిగా గుర్తించిన పోలీసులు.. ఇద్దరు దళారులతో పాటు వీఆర్వో, షఫీని అరెస్ట్ చేశారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి కరీమాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వరంగల్ మిల్స్‌కాలనీ సెకండ్ ఎస్సై సయ్యద్ అఫ్జలుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన బొలిశెట్టి రాజ్‌కుమార్(28) ఆదివారం రాత్రి నర్సంపేట రోడ్ నుంచి తన పల్సర్ బైక్‌పై వరంగల్ వైపునకు వస్తున్నాడు. లేబర్ కాలనీలోని ఎస్బీఐ వద్దకు చేరుకోగానే బైక్‌ను ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్ పైనుంచి రాజ్‌కుమార్ కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ రాజ్‌కుమార్ పైనుంచి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. అక్కడే రాస్తారోకోకు దిగారు. రాజస్థాన్‌కు చెందిన లారీ రాజ్‌కుమార్‌ను ఢీకొట్టిందని, అది అక్కడి నుంచి వెళ్లిపోతున్నా పోలీసులు పట్టుకోలేకపోయారని ఆరోపించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. బైక్‌పై వస్తుండగా చిరువ్యాపారి.. గోవిందరావుపేట : మండలంలోని చల్వాయి శివారులో ఉన్న గౌరారం చెరువు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంధం అంజయ్య(35) అనే చిరు వ్యాపారి మృతిచెందాడు. పస్రా ఎస్సై షేక్ యాసిన్ కథనం ప్రకారం.. వెంకటాపురం మం డలం అడవిరంగాపురం(తిమ్మాపూర్) గ్రామానికి చెందిన అంజయ్య గత కొద్దిరోజులుగా పస్రాలో నివాసంఉంటున్నాడు. అక్కడే ఉంటూ రోజూ ఏటూరునాగారానికి వెళ్లి రోడ్డు పక్కన టోపీలు,కళ్లద్దాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం ఉదయం చెల్పూరులో సమీప బంధువు చనిపోగా కర్మకు వెళ్లాడు. రాత్రి బైక్‌పై పస్రాకు తిరిగి వస్తుండగా, చల్వాయి సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన క్వాలిస్ వాహ నం అంజయ్యను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు, పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగుకు తరలించారు. హైదరాబాద్ జాతీయ రహదారిపై మహిళ.. జనగామ : హైదరాబాద్ జాతీయ రహదారిపై జనగామ శివారులోని జెర్సీ పాలకేంద్రం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ ఆది వారం రాత్రి మృతిచెందింది. ఎస్సై సంతోషం రవీందర్ తెలి పిన వివరాల ప్రకారం.. లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కొండ రేణుక(40) తన కుమారుడు అరవింద్‌తో కలిసి జనగామలోని వాసం ఉంటోం ది. పని ముగించుకొని ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లి కనిపిం^è లేదు. దీంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. రోడ్డు ప్రమాదం లో గుర్తుతెలియని మహిళ మృతిచెందిందని తెలుసుకొని, సంఘటనా స్థలానికి వెళ్లాడు. అక్కడ విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూసి బోరున విలపించాడు. ఇంటిపట్టున ఉండాల్సిన రేణుక రోడ్డువైపు వెళ్లడానికి గల కారణాలు తెలియాల్సిఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొనడంతో.. నర్సింహులపేట : మండలంలోని బీరిశెట్టిగూడెం శివారులోని వరంగల్–ఖమ్మం రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తొడుసు వెంకన్న(40) అనే వ్యక్తి మృతి చెం దాడు. ఎస్సై వెంకటప్రసాద్ కథనం ప్రకారం..మండలంలోని పెద్దనాగారానికి చెందిన వెం కన్న పనుల నిమిత్తం పడమటì గూడేనికి వెళ్లా డు. అక్కడి నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా బీరిశెట్టిగూడెం వద్ద వరంగల్ వైపునకు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
107 కేసుల్లో గజదొంగలు అరెస్టు..!
- దోపిడీలతోపాటు హత్యలు - 107 కేసుల్లో నలుగురు నిందితులు, ఒక రిసీవర్ అరెస్ట్ - దొంగతనం, హత్యలు చేసిన 12 ఏళ్ల తర్వాత.. - అరెస్టయినవారిలో న్యాయవాది - 12 ఏళ్లుగా విజయవాడలో ప్రాక్టీస్ విజయవాడ: గొలుసు దొంగతనాలు, హత్యలు చేసే నలుగురు సభ్యులతో కూడిన ముఠాను విజయవాడ కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 50 లక్షలు విలువచేసే 1400 గ్రాముల బంగారం, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో విజయవాడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది, నిందితుల నుంచి బంగారం కొనుగోలు చేసే వ్యక్తి ఉన్నారు. ముఠాపై కమిషనరేట్ పరిధిలో 107 కేసులు ఉన్నాయి. దొరికింది ఇలా.. విజయవాడ నగర శివారులోని తాడిగడప సెంటర్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ముఠాకు సంబంధించిన కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ముఠా సభ్యులైన సింగారవేలు రామచంద్రన్, దేవర ప్రవీణ్‌కుమార్‌లు బుధవారం తాడిగడప 100 అడుగుల రోడ్డులో అనుమానంగా సంచరిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన సింగారవేలు రామచంద్రన్ అలియాస్ శిరివెళ్ల రాము అలియాస్ జోసఫ్ కారు పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన పాగోలు రాము ద్వారా బంకూరి వెంకట శివనాగరాజు (న్యాయవాది) పరిచయం అయ్యాడు. ఇద్దరికి జోడీ కుదిరింది. కొంతకాలం తర్వాత వీరికి ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కాలనీకి చెందిన కుడిపూడి శ్రీనివాసరావు అలియాస్ కొండపల్లి శ్రీను, అతని స్నేహితుడు తలారి రామబహదూర్, పెండెం నరేష్బాబులతో స్నేహం ఏర్పడింది. సులువుగా డబ్బు సంపాదించాలని అందరూ కలిసి కొన్నేళ్ల కిందట దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. ఇద్దరిద్దరి చొప్పున టీమ్ గా ఏర్పిడి దొంగతనాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నారు. దొంగతనాల కోసం ముందుగా ఒడిశా రాష్ట్రంలోని జార్ఫుగూడలో నివసించే తన స్నేహితుల ద్వారా 2001లో రూ. 50 వేలు పెట్టి ఒక తుపాకీ, ఆరు తూటాలను శివనాగరాజు కొనుగోలు చేశాడు. చోరీ తర్వాత తొందరగా తప్పించుకునేందుకు ఓ కారును దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. 2003 మే 15న కంకిపాడు-ఉయ్యూరు మార్గంలో నిందితులు రామచంద్రన్, శివనాగరాజులు ఏపీ16ఎల్1777 నంబర్ గల మారుతీ కారును వెంటాడి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి కారు యజమాని చలపతిరావు మరణించడంతో ఆ కారును దొంగిలించకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం వేరే ప్రాంతంలో చోరీల కోసం ఓ కారును దొంగిలించారు. నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి శివనాగరాజు 50 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బు చెల్లించాలంటూ అతను శివనాగరాజుపై ఒత్తిడి తేవడంతో అతన్ని అంతమొందించేందుకు అందరూ కలిసి కుట్ర పన్నారు. రాజమండ్రిలో డబ్బులు ఇస్తామంటూ చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చారు. అది తీసుకున్న నరేంద్ర రెడ్డి అపస్మారక స్థితికి చేరడంతో ఒంటిపై బట్టలు తీసేసి గోదావరిలో పారేశారు. 2003లో నరేంద్ర రెడ్డి మిస్సింగ్ కేసు నమోదయింది. 2004లో కాజ బ్యాంకులో దొంగతనం చేయడానికి ప్రయత్నించి విఫలం చెందారు. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపి తప్పించుకు పారిపోయారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. నిందితుడు శివనాగరాజుకు కళశాలలో చదివే రోజుల నుంచే నేర చరిత్ర ఉంది. 2004లో న్యాయశాస్త్రం నుంచి పట్టా పొందిన నాగరాజు బెజవాడ్ బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. 2004 నుంచి ముఠాకు కొంత దూరంగా ఉంటున్నాడు. కాగా, మిగిలిన మిత్రులు దొంగతనాలకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాడిగడపలో రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరిని అనుమానించిన పోలీసులు విచారించడంతో వాస్తవాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి ఇప్పటివరకు 28 కేసుల్లో 1,400 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. -
దారుణం.. బతికుండగానే నలుగురికి నిప్పు
ఫరిదాబాద్: ఇదొక దిగ్భ్రాంతిని కలిగించే ఘటన. హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఫరిదాబాద్‌లో ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు బతికుండగానే నిప్పంటించారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మంగళవారం వేకువ జామున 4గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో అవతలి వర్గం వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. నలుగురు బాధితులను ఢిల్లీలోని సప్థార్ జంగ్ ఆస్పత్రికి చికిత్స కోసం అత్యవసరంగా తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆనలుగురు
-
నలుగురు సజీవ దహనం
కారణమేమైనా దారుణం జరిగిపోయింది. నిద్ర నుంచి ఆ కుటుంబం మృత్యుఒడికి చేరిపోయింది. పడుకున్నవారు పడుకున్నట్టే బూది కుప్పలుగా మారిపోయూరు. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్న ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యుత్ కాంతులతో అందరి ఇళ్ల వద్ద క్రిస్మస్ స్టార్లు దేదీప్యమానంగా వెలుగుతుంటే, ఆ ఇంటి నుంచి మాత్రం అగ్నికీలలు ఎగజిమ్మాయి. ఉపాధి నిమిత్తం అతను ఎంచుకున్న మార్గమే అతనితోపాటు కుటుంబానికి మృత్యుపాశమైంది. అల్లుడే కాలయముడిగా మారి పిల్లనిచ్చిన అత్త, మామ, ఇద్దరు బావమరుదులను అతి కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఇప్పుడు మరణ మృదంగం మోగడంతో గ్రామస్తులు నిశ్చేష్టులయ్యారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ గ్రామానికి ఉరుకులు, పరుగులపై చేరుకుంది. యావత్ గ్రామస్తులను ఈ విషాదకర సంఘటన కంటతడి పెట్టించింది. భీమవరం అర్బన్/టౌన్:భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలోని ఎస్సీ పేటకు చెందిన మరపట్ల ప్రకాష్ (55) గల్ఫ్ ఏజెంట్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయనకు భార్య మరపట్ల రాజమణి (50), కుమార్తె దివ్య, కుమారులు దేవరాజ్ (17), ప్వధ్వీరాజ్ అలియూస్ వంశీ (14) ఉన్నారు. కుమార్తె దివ్య.. అదే గ్రామానికి చెందిన గంటా రవి ప్రేమించుకోవడంతో కొన్నేళ్ల క్రితం పెద్దలే వివాహం జరిపించారు. వారికిద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ నరసాపురంలోని హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. దివ్యను కుటుంబ పోషణార్థం తండ్రి ప్రకాష్ ఇటీవల కువైట్ పంపించాడు. ఇది ఇష్టంలేని అల్లుడు గంటా రవి తరచూ అత్తింటి వారితో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 1.30 సమయంలో ప్రకాష్ ఇంట్లో నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు గమనించారు. బంగాళా పెంకుటిల్లు కావడంతో మంటల తాకిడికి పెంకులు పగిలి ఎగిరిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వారు అక్కడకు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. నిద్రిస్తున్న వారు పూర్తిగా దహనమై కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారమందించారు. పోలీసుల రంగప్రవేశం జిల్లా ఎస్పీ రఘురామ్‌రెడ్డి, ఏఎస్పీ చంద్రశేఖర్, డీఎస్పీ రఘువీరారెడ్డి, సీఐలు జయసూర్య, కెనడీ, రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్టీమ్లతో ఆ ప్రాంతంలో ఆధారాలు, నిందితుల గుర్తింపు కోసం జల్లెడ పట్టారు. ఇంటి లోపల, వెలుపల నిశితంగా పరిశీలించారు. అక్కడ దొరికిన ప్రాథమిక ఆధారాలను బట్టి అల్లుడు గంటా రవి తన అత్తమామలను, బావమరుదులను కడతేర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి వరండాలోని ప్లాస్టిక్ టబ్‌లో సగం వరకు పెట్రోల్ ఉండటం, ఇంటి బయట తలుపుకు తాళం వేసి ఉండటంతో అనుమానం మరింత బలపడింది. అందరూ గాఢనిద్రలో ఉండగా బయట నుంచి లోపలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ట్టుగా భావిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇంత జరిగినా.. ఊరంతా అక్కడే ఉన్నా అల్లుడు రవి కనిపించకపోవడం అనుమానాలకు బలమిచ్చింది. ఆందోళన చెందినట్టే జరిగింది కాగా పోలీసుల దర్యాప్తులో మరపట్ల ప్రకాష్ కొవ్వాడ అన్నవరంలోని కుటుంబంతో పాటు భీమవరం పట్టణం లంకపేటలో ఉంటున్న తన బంధువు జీవమణితో సహజీవనం సాగిస్తున్నట్టు తెలిసింది. ఈ ఇరువురికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి జీవమణి ఇంటి వద్ద ప్రకాష్ ఉన్నట్టు తెలుస్తోంది.ఇటీవల అల్లుడు గంటా రవి తరచూ గొడవ పడుతుండటంతో ఏదైనా ప్రాణహాని తలపెడతాడేమోనని మరపట్ల ప్రకాష్ జీవమణి, కుటుంబ సభ్యుల వద్ద ఆందోళన చెందినట్టుగా పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి కొవ్వాడ అన్నవరంలోని తన ఇంటికి ప్రకాష్ వెళ్లడం, తెల్లవారు జామున కుటుంబంతో సహా మృత్యువాత పడటం జరిగిపోయూరుు. తీవ్రంగా గాలింపు జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు నిందితుల కోసం భీమవరం ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ తనిఖీ చేశారు. ఉదయం ఆరుగంటల సమయంలో టౌన్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై నిందితుడు రవి తిరుగాడినట్టు అక్కడ ఉన్న సీసీ కెమేరాల ద్వారా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. విశాఖపట్నం వెళుతున్న లోకమాన్యతిలక్ రైలులో నిందితుడు ఎక్కినట్టుగా పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తహసిల్దార్ గంధం చెన్ను శేషు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయిదుర్గరాజు తదితరులు వెళ్లి పరిశీలించారు. పోలీసుల నుంచి వివరాలు అడిగితెలుసుకున్నారు. భార్యను గల్ఫ్ పంపడాన్ని ఇష్టపడని అల్లుడు మరపట్ల ప్రకాష్ జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. భార్య రాజమణి పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వంట పనిచేసేది. పెద్ద కుమారుడు దేవరాజ్ భీమవరం పట్టణంలోని ప్రశాంతి ఒకేషనల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. రెండవ కుమారుడు ప్వధ్వీరాజ్ (వంశీ) స్థానిక స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రకాష్ తన కుమార్తె దివ్యను కువైట్‌కు పంపడం అల్లుడు రవికి ఇష్టంలేదు. దీంతో తరచూ అత్తింటి వారితో గొడవ పడేవాడు. రవి స్థానికంగా ఉన్న పాలకేంద్రంలో పనిచేస్తున్నాడు.