నలుగురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌ | Cricket Betting Royal Arrested Proddatur | Sakshi
Sakshi News home page

నలుగురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌

Published Sat, Apr 21 2018 10:45 AM | Last Updated on Sat, Apr 21 2018 10:45 AM

Cricket Betting Royal Arrested Proddatur - Sakshi

క్రికెట్‌ బుకీలతో సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది

ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు క్రికెట్‌ బుకీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూరల్‌ సీఐ ఓబులేసు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దొరసానిపల్లెకు చెందిన గుర్రం రాము, సగిలిగొడ్డుపల్లె గ్రామానికి చెందిన పెడవల్లి వెంకటసుబ్బారెడ్డి కొంత కాలంగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించే వారు. ఈ క్రమంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించి దొరసానిపల్లెలోని సాయిబాబా గుడి సమీపంలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో.. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు బుకీలను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రూ.60,500 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే బైపాస్‌ రోడ్డులోని చిన్నశెట్టిపల్లెకు వెళ్లే రహదారిలో ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన వజ్జల వెంకట అమర్‌నాథ్, పల్లా వెంకటరమణ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని ఆ ప్రాంత వాసులు సమాచారం అందించడంతో.. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రూ.37,500 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్‌ఐ రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement