Cricket bettingu
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కడప అర్బన్ : కడప సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామం ముద్దనూరురోడ్డులో మంగళవారం ఉదయం క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల పరిధిలో క్రికెట్ బెట్టింగ్ భారీగా జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. పుల్లాసి గురుప్రసాద్‌కు సంబంధించిన ప్రసాద్ హోటల్లో తొమ్మిది మంది ఈ నెల 23న జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన డబ్బులను మార్పిడి చేసుకుంటూ, గంజాయి సంచితో కనిపించగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8.98 లక్షల నగదు, 1150 గ్రాముల నిషేధిత గంజాయి సంచి, కారు (ఏపీ04 ఏఎం7793), 16 సెల్ఫోన్లు, క్రికెట్ బెట్టింగ్ పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ప్రొద్దుటూరు దస్తగిరిపేటకు చెందిన కటిక సులేమాన్, ఎర్రగుంట్ల మండలం వలసపల్లెకు చెందిన తమ్మిశెట్టి బాలయ్య, వీఎన్ పల్లె మండలం ఉరుటూరు వాసి సొదుం రమేష్‌కుమార్‌రెడ్డి, ఎర్రగుంట్ల మండలం వలసపల్లె నివాసి రాజోలు బయపురెడ్డి, కర్చుకుంటపల్లె గ్రామానికి చెందిన బొందల వెంకటేశు, చిలంకూరుకు చెందిన పుల్లాసి గురుప్రసాద్, ఎర్రగుంట్ల పట్టణంలోని దొండపాడు రోడ్డులో నివసిస్తున్న చింతల వెంకటప్రసాద్ అలియాస్ నల్ల ప్రసాద్, అదే ప్రాంత నివాసి పిల్లిగోయిల శ్రావణ్‌కుమార్ అలియాస్ చిన్నా, ప్రొద్దుటూరు టౌన్ జిన్నారోడ్డులో నివసిస్తున్న షేక్ మహమ్మద్ ఉన్నారు. నిందితులను పకడ్బందీగా అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, కడప రూరల్ సీఐ హేమసుందర్రావు, ఎర్రగుంట్ల ఎస్ఐ జె.శివశంకర్, పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్కే రోషన్, కడప తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి, ఎర్రగుంట్ల కానిస్టేబుళ్లు పాములేటి, నాగాంజనేయులును డీఎస్పీ అభినందించారు. -
నలుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ ఓబులేసు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దొరసానిపల్లెకు చెందిన గుర్రం రాము, సగిలిగొడ్డుపల్లె గ్రామానికి చెందిన పెడవల్లి వెంకటసుబ్బారెడ్డి కొంత కాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు. ఈ క్రమంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి దొరసానిపల్లెలోని సాయిబాబా గుడి సమీపంలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో.. ఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు బుకీలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.60,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైపాస్ రోడ్డులోని చిన్నశెట్టిపల్లెకు వెళ్లే రహదారిలో ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన వజ్జల వెంకట అమర్నాథ్, పల్లా వెంకటరమణ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఆ ప్రాంత వాసులు సమాచారం అందించడంతో.. ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.37,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
ఎస్పీ సుమతి హెచ్చరిక సంగారెడ్డి క్రైం : క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బడుగుల సుమతి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఫోన్ తదితర సాధనాలు ఉపయోంచినా, లేదా నేరుగా బెట్టింగులకు పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, బెట్టింగులకు పాల్పడేవారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.బెట్టింగ్‌ల సమాచారాన్ని ఎవరైనా తమకు అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ముఖ్యంగా యువత బెట్టింగ్‌లకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బుకీలు, నిర్వాహకులు, బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.