వివరాలు వెల్లడిస్తున్న కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా
కడప అర్బన్ : కడప సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామం ముద్దనూరురోడ్డులో మంగళవారం ఉదయం క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల పరిధిలో క్రికెట్ బెట్టింగ్ భారీగా జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. పుల్లాసి గురుప్రసాద్‌కు సంబంధించిన ప్రసాద్ హోటల్‌లో తొమ్మిది మంది ఈ నెల 23న జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన డబ్బులను మార్పిడి చేసుకుంటూ, గంజాయి సంచితో కనిపించగా వారిని పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి రూ. 8.98 లక్షల నగదు, 1150 గ్రాముల నిషేధిత గంజాయి సంచి, కారు (ఏపీ04 ఏఎం7793), 16 సెల్‌ఫోన్లు, క్రికెట్ బెట్టింగ్ పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ప్రొద్దుటూరు దస్తగిరిపేటకు చెందిన కటిక సులేమాన్, ఎర్రగుంట్ల మండలం వలసపల్లెకు చెందిన తమ్మిశెట్టి బాలయ్య, వీఎన్ పల్లె మండలం ఉరుటూరు వాసి సొదుం రమేష్‌కుమార్‌రెడ్డి, ఎర్రగుంట్ల మండలం వలసపల్లె నివాసి రాజోలు బయపురెడ్డి, కర్చుకుంటపల్లె గ్రామానికి చెందిన బొందల వెంకటేశు, చిలంకూరుకు చెందిన పుల్లాసి గురుప్రసాద్, ఎర్రగుంట్ల పట్టణంలోని దొండపాడు రోడ్డులో నివసిస్తున్న చింతల వెంకటప్రసాద్ అలియాస్ నల్ల ప్రసాద్, అదే ప్రాంత నివాసి పిల్లిగోయిల శ్రావణ్‌కుమార్ అలియాస్ చిన్నా, ప్రొద్దుటూరు టౌన్ జిన్నారోడ్డులో నివసిస్తున్న షేక్ మహమ్మద్ ఉన్నారు.
నిందితులను పకడ్బందీగా అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, కడప రూరల్ సీఐ హేమసుందర్‌రావు, ఎర్రగుంట్ల ఎస్‌ఐ జె.శివశంకర్, పెండ్లిమర్రి ఎస్‌ఐ ఎస్‌కే రోషన్, కడప తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి, ఎర్రగుంట్ల కానిస్టేబుళ్లు పాములేటి, నాగాంజనేయులును డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment