Produtur
-
వివేకా హత్య కేసు..నా చెల్లెల్ని తెచ్చుకున్నారు..
-
ప్రొద్దుటూరులో సీఎం జగన్ బస్సు యాత్రకు దిమ్మతిరిగే ఏర్పాట్లు
-
ప్రొద్దుటూరులో లోకేష్ పై కోడిగుడ్లు విసిరింది టీడీపీ అభిమానే
-
విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..
-
మాట నిలబెట్టుకోకుంటే మళ్లీ పోటీచేయను : రాచమల్లు
-
నలుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ ఓబులేసు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దొరసానిపల్లెకు చెందిన గుర్రం రాము, సగిలిగొడ్డుపల్లె గ్రామానికి చెందిన పెడవల్లి వెంకటసుబ్బారెడ్డి కొంత కాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు. ఈ క్రమంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి దొరసానిపల్లెలోని సాయిబాబా గుడి సమీపంలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో.. ఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు బుకీలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.60,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైపాస్ రోడ్డులోని చిన్నశెట్టిపల్లెకు వెళ్లే రహదారిలో ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన వజ్జల వెంకట అమర్నాథ్, పల్లా వెంకటరమణ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఆ ప్రాంత వాసులు సమాచారం అందించడంతో.. ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.37,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటెత్తిన పల్లె
‘స్థానిక’ ఘట్టం పూర్తయింది. శుక్రవారంతో రెండోవిడత పోలింగ్ కూడా ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కామనూరులో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు పంపి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పెండ్లిమర్రి మండలం మాచునూరు, తిప్పరాజుపల్లెలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మిట్టమీదపల్లిలో ఓటేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు ఎండదెబ్బకు తాళలేక మృతిచెందింది. కోగటం, పెద్దశెట్టిపల్లి, శంకరాపురం, కొత్తపేటలో ఈ ఎన్నికల్లో ఓటింగ్ జరగడం గమనార్హం. సాక్షి, కడప: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని 21 జెడ్పీటీసీ, 209 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకూ నెమ్మదిగా సాగిన ఓటింగ్ ఆ తర్వాత జోరందుకుంది. 9 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపే చాలాచోట్ల 50 శాతంపైగా ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. జిల్లా అంతటా 84.15 శాతం ఓటింగ్ నమోదైంది. కామనూరులో రిగ్గింగ్! ప్రొద్దుటూరు పరిధిలోని కామనూరులో రిగ్గింగ్ జరిగింది. వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలింగ్‌బూత్‌లో కూర్చోవడంతో కొద్దిసేపు పోలింగ్ జరిగింది. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డి బూత్‌లోకి వచ్చి బయటకు వెళ్లాలని వైఎస్సార్సీపీ ఏజెంట్లపై హుకుం జారీ చేశారు. దీంతో ఏజెంట్లు బయటకు వచ్చారు. ఆపై సాయంత్రం వరకూ విడతల వారీగా ‘సైకిల్’ గుర్తుపై రిగ్గింగ్ చేసుకున్నారు. కోగటంలో పోలింగ్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామం కోగటంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరగడం గమనార్హం. ఎమ్మెల్యే వీరశివాతో, పుత్తా నరసింహారెడ్డి ఏకం కావడంతో ఈ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ తప్పదని అంతా భావించారు. అయితే వీరశివా సోదరుడు ప్రతాప్‌రెడ్డి తనయులు ఏజెంట్లుగా కూర్చోవడంతో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇక్కడ 2833 ఓట్లు ఉండగా 2099 ఓట్లు పోలయ్యాయి. తమకు నచ్చిన వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేందుకు ఓటేయడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్ హామీతో ఓటింగ్ ప్రొద్దుటూరు నియోజకవర్గం చెన్నమరాజుపల్లె ఎంపీటీసీ పరిధిలోని నాగాయపల్లె ఎస్సీకాలనీలో జెడ్పీటీసీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. తమ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోలేదని ఇందిరమ్మ బిల్లుల నుంచి వీధిలైట్ల వరకూ అన్ని సమస్యలు ఉన్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. దీంతో ఆర్వో బాలసుబ్రహ్మణ్యం పరిస్థితిని కలెక్టర్‌కు వివరించారు. సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ పంచాయతీ సర్పంచ్ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి బంధువు కావడం విశేషం. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు...: పెండ్లిమర్రి మండలం మాచునూరులో వైఎస్సార్సీపీ, టీడీ పీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో ఏడగురు వైఎస్సార్సీపీ, ఆరుగురు టీడీపీ అభ్యర్థులకు గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పెండ్లిమర్రి మండలం తిప్పరాజుపల్లెలోనూ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ప్రొద్దుటూరు పరిధిలోని పెన్నానగర్లో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వన్‌టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ వర్గీయులపై కన్నెర్ర చేశారు.పెద్దశెట్టిపల్లి, శంకరాపురం, కొత్తపేట, నరసింహాపురంలో 20 ఏళ్ల తర్వాత స్వేచ్ఛాయుత ఓటింగ్ జరిగడం విశేషం. వేముల మండలం పెద్దజూటూరులో భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ నిర్వహించారు.సంతకొవ్వూరులో ఉదయం బ్యాలెట్ పేపర్‌పై ‘ముద్ర’ సరిగాపడలేదని ఓటర్లు ఆరోపించారు. దీంతో అధికారులు స్టాంపును పరిశీలించి పోలింగ్‌ను సజావుగా నిర్వహించారు. -
వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టండి
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై ఎన్నో ఇబ్బందులకు గురిచేశాయని.. ప్రస్తుతం మనం ఇన్నాళ్లు ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలని పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. స్థానిక గాంధీరోడ్డులోని పోసిన కాంపౌండ్‌లో సోమవారం వేలాది మంది మహిళలతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘ ఫ్యాన్ గాలికి కుమ్మక్కు రాజకీయాలు లేచిపోవాలి. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డిల వల్లే పట్టణానికి తాగునీటి సమస్య ఏర్పడింది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం వైఎస్ కుందూ-పెన్నా నీటి పథకాన్ని మంజూరు చేయగా.. వీరి వలనే పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం తాగునీటి సమస్యకు వీరే ముఖ్య కారణం’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి రాచమల్లు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ వైఎస్ హయాంలో వేటి ధరలు పెరగలేదని.. ఆయన మరణం తర్వాత నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. 9 ఏళ్ల హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదేళ్లకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలేదన్నారు. వైఎస్ హయాంలోనే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్, పావలావడ్డీ, 108, జలయజ్ఞం లాంటి వాటిని అమలు చేశారని గుర్తుచేశారు. వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమన్నారు. వరద 25 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నా మీ వద్దకు కనీసం 25 మార్లు అయినా వచ్చాడా అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లపాటు లింగారెడ్డికి అధికారం ఇస్తే నాలుగు బిందెలు నీరు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దోమలు, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్, ఇలా ఏ సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం వీరిద్దరు తాము కలిసిపోయామంటూ పత్రికల్లో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సేవ చేయాలన్న తపనతోఉన్న తమకు అవకాశం ఇస్తే మెరుగైన పాలన అందిస్తామన్నారు. ప్రధానంగా కుందూ-పెన్నా వరదకాలువ పనులు పూర్తి చేయించి తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వీఎస్ ముక్తియార్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్‌ను ఆధునీకరణ పేరుతో వరద కూల్చే యత్నం చేశాడన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని... బంగారంగళ్ల వీధులలో సొంత డబ్బుతో పార్కింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. ఈవీ సుధాకర్‌రెడ్డి, కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి అఖండ మెజారిటీ కట్టబెట్టాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, ఖాదీబోర్డు మాజీ డైరక్టర్ దొంతిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి నరసింహారెడ్డి, పాణ్యం సుబ్బరాయుడు, లాయర్ సుబ్బయ్య, సోములవారిపల్లె సర్పంచ్ ప్రశాంతి శేఖర్, పెద్దశెట్టిపల్లె సుధాకర్‌రెడ్డితోపాటు మున్సిపాలిటీ పరిధిలోని 40 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.