arrst
-
మేకలకు కటకటాలు!
చట్టం ముందు మనుషులైనా, మేకలైనా సమానమే అనుకున్నారు అమెరికన్ పోలీసులు. పాదచారులను వెంబడించే ఆకతాయిల మాదిరి వాషింగ్టన్ నగర వీధుల్లో ఓ రెండు మేకలు హల్చల్ చేశాయి. స్థానికుల ఇళ్ల ముంగిళ్లలో పెంచుకున్న తోటల్లోకి చొరబడి చెట్ల ఆకులు, గడ్డి తినటం, పాదచారులను వెంబడించటమే కాకుండా, అడ్డు వచ్చిన వారిని కుమ్మేస్తూ నానా బీభత్సం సృష్టించాయి. ఈ మేకల ధాటికి బెంబేలెత్తిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కారణంగా పోలీసులు ఆ రెండు మేకలనూ అదుపులోకి తీసుకుని, కటకటాల్లోకి నెట్టారు. అధికారులు వాటిని కింగ్ కౌంటీ యానిమల్ షెల్టర్‌కు తీసుకెళ్లి, వాటి యజమానిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి యజమాని ఎవరో తెలియలేదు కాని, ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేకల అరెస్టు వార్తపై ఎంతోమంది ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే, మరెంతోమంది జంతుప్రేమికులు మాత్రం ‘ఎవరైనా మూగ జీవులను జైల్లో పెడతారా?’ అంటూ మండిపడుతున్నారు. చెరలో ఉన్న ఆ రెండు మేకలనూ విడిపించుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ మేకలకు ఏం జరుగుతుందో చూడాలి మరి! ఆ రెండు మేకలకు చేసిన తప్పుకు జైలు శిక్ష పడుతుందో? లేక పోలీసులు సానుకూలంగా స్పందించి మేకలను విడుదల చేస్తారో? -
ఎవరూ పట్టించుకోలేదు..బాబూ!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి జిల్లాలోనుంచి కాన్వాయ్‌తో తీసుకెళుతుంటే అటు ప్రజల నుంచి కానీ, ఇటు సొంత పార్టీ టీడీపీ నాయకుల నుంచి కానీ స్పందన కరువైంది. 4.20 గంటల పాటు జిల్లాలో చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించింది. దాదాపు 175 కిలో మీటర్లు ప్రయాణించినా కూడా చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న దాఖలాలు శూన్యం. చీమకుర్తి మండలంలో ఒకటి, రెండు చోట్ల మినహా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దగా చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు తిరిగాయి. వ్యాపార సంస్థలు సైతం తెరిచే ఉంచారు. ఎక్కడా జనం కనిపించకపోవడంతో చంద్రబాబు సైతం ఢీలా పడ్డారు. జనం కనపడితే ఎప్పపుడూ విక్టరీ సింబల్ చూపించే ఆయన కాన్యాయ్ వెళుతున్న ప్రధాన కూడళ్లలో అరకొరగా ఉన్న జనాన్ని, పార్టీ నాయకుల్ని చూస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఈ స్కాంలో చంద్రబాబు తప్పుచేశాడన్న భావన ఆపార్టీ నేతల్లో సైతం వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. నంద్యాల నుంచి జిల్లాలోని గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామంలోకి ఉదయం 8.45 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ ప్రవేశించింది. అక్కడ నుంచి గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నుంచి కాన్వాయ్ మధ్యాహ్నం 1.05 గంటలకు జిల్లా సరిహద్దులు దాటింది. జిల్లాలో దాదాపు 100కు పైగా గ్రామాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా కాన్వాయ్ సాగింది. తొలుత గిద్దలూరు నియోజకవర్గంలోని దిగువమెట్ట వద్ద చంద్రబాబు కాన్వాయ్ ప్రవేశించింది. అయితే గిద్దలూరు నియోజకవర్గ ప్రజల నుంచి కానీ టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి కనీస స్పందన కరువైంది. మార్కాపురం నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగింది. జిల్లా కేంద్రం ఒంగోలులో కూడా ఆ పార్టీ కేడర్ నుంచే స్పందన కానరాలేదు. టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని టీడీపీ శ్రేణుల్లోనే నైరాశ్యం నెలకొంది. విజయవాడ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి జిల్లాలో ఆయన కాన్వాయ్ వెళుతున్నా ఆ పార్టీ నాయకుల్లో కూడా కనీసం కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే కుంభకోణం తీవ్రత ఎంతో టీడీపీ నాయకులే అర్థం చేసుకున్నట్లు ఉన్నారు. భగ్గుమంటదని ఎల్లో మీడియా ఊదర... చంద్రబాబును అరెస్ట్ చేస్తే రాష్ట్రం భగ్గుమంటుందని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. జనాలు స్వచ్ఛందంగా రోడ్డు ఎక్కుతారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అయితే అందుకు భిన్నంగా జిల్లాలో శనివారం కాన్వాయ్ వెళ్లినా ప్రజల్లో కనీస స్పందన కూడా లేదు. టీడీపీలో కూడా తూతూ మంత్రంగా ఒకటి రెండు చోట్ల మాత్రమే కాన్వాయ్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించారు. చీమకుర్తి బైపాస్‌లో, పేర్నమిట్ట వద్ద కొద్దిమంది రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేయాలని పూనుకున్నారు. పోలీసులు అప్రమత్తమై నిరసనకారులను చెదరగొట్టారు. జిల్లా కేంద్రం ఒంగోలులో పార్టీ ఆఫీసు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు తప్ప మరెలాంటి ఆందోళనలుకానీ, నిరసనలు కానీ చేపట్టలేదు. చంద్రబాబు కాన్వాయ్కి ఎలాంటి ఆటంకాలు లేకుండా జిల్లాలో సజావుగా సాగిపోయింది. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం, రామతీర్థం మధ్యలో 15 నిమిషాల పాటు చంద్రబాబు కాలకృత్యాలు తీర్చుకోవటానికి మాత్రమే పోలీసులు ఆపారు. అంతకు మినహా జిల్లాలో ఎక్కడా చంద్రబాబు కాన్వాయ్‌కు ఆటంకాలు ఏర్పడలేదు. పకడ్బందీగా బందోబస్తు ఒంగోలు టౌన్: వందలాది కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్టు చేసిన సమాచారం తెలిసిన వెంటనే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ మలికా గర్గ్ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబును శనివారం ఉదయం నంద్యాల నుంచి ఒంగోలు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారన్న సమాచారం అందగానే పోలీసు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లాలోకి ప్రవేశించిన నప్పటి నుంచి జిల్లా దాటి వెళ్లే వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. ఉదయం 8.45 నిమిషాలకు జిల్లాలోకి ప్రవేశించిన కాన్వాయ్ గిద్దలూరు, బేస్తవారిపేట జంక్షన్, పొదిలి, చీమకుర్తి, సంతనూతలపాడు గుండా ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలు నుంచి హైవే మీదుగా మద్దిపాడు గ్రోత్ సెంటర్ నుంచి చిలకలూరిపేట మీదుగా కాన్వాయ్ విజయవాడ వెళ్లింది. జిల్లాలో ప్రవేశించిన కాన్వాయ్‌కు దారిమధ్యలో ఎలాంటి ఆటంకాలు, అసౌకర్యం కలగకుండా పోలీసులు తగిన బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ పికెట్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ఆ పార్టీకి చెందిన 90 మంది ద్వితీయ శ్రేణి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు మహిళలు కొందరు నిరసన ప్రదర్శనలు చేసేందుకు ప్రయత్నించి ప్రజల మద్దతు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. నగరంలోని పాత మార్కెట్ వద్ద కొందరు టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. అద్దంకి బస్టాండు సెంటర్లో ధర్నాకు విఫలయత్నం చేశారు. ఒంగోలులోని గుంటూరు రోడ్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లను ఏర్పాటు చేశారు. నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేశారు. ఏఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డీఎస్పీ వి.నారాయణస్వామి రెడ్డిల పర్యవేక్షణలో సీఐలు పి.భక్తవత్సలరెడ్డి, టి.వెంకటేశ్వరరావు, జగదీష్, శ్రీనివాసరెడ్డిలతో పాటు మొత్తం 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో నకిలీ పోలీస్?
ఏలూరు (సెంట్రల్): పోలీసు కానిస్టేబుల్‌గా చెలామణి అవుతూ పేకాట స్థావరాల నుంచి వసూళ్లుకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం డొంక అంత కదిలినట్టు తెలిసింది. ఏలూరు ఆర్ఆర్ పేటకు చెందిన సదరు వ్యక్తి నుంచి పోలీసు దుస్తుల్లో దిగిన ఫొటోలు, నకిలీ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సదరు వ్యక్తిని మూడు రోజులుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సై, సీఐల తలలో నాలుకలా ఉంటూ.. నిందితుడు గతంలో నగరంలోని ఓ స్టేషన్లో పనిచేసి బదిలీపై వెళ్లిన ఇన్స్పెక్టర్కు తలలో నా లుకలా ఉండేవాడు. ఆ అధికారి జీపులోనే తిరుగుతూ బయటవారికి కానిస్టేబుల్‌గా పరిచయం అయ్యాడు. సదరు అధికారికి మామూళ్లను తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించేవాడని కొందరు పోలీసు సిబ్బంది చెబుతున్నారు. సదరు ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి బదిలీ అయిన కొన్ని రోజులకు ఏలూరుకు ఆనుకొని ఉన్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్దకు మకాం మార్చాడు. ఆ అధికారి వద్దనే తిరుగుతూ ఆ సర్కిల్ పరిధిలో జరిగే పేకా ట, కోడి పందాల స్థావరాల నుంచి డబ్బులు వ సూళ్లకు పాల్పడేవాడు. ఈ విషయం సదరు అధికారికి తెలియడంతో మందలించి పంపించి వేసినట్టు సమాచారం. వివాహిత ఫిర్యాదుతో కదిలిన డొంక నిందితుడు తాను పోలీసు కానిస్టేబుల్ని అని చెబుతూ ఓ వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. సదరు వివాహితను కొన్నిరోజులుగా వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలపై సం తకాలు చేయించుకోవడంతో ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పం దించిన పోలీసులు అతడిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నగరంలోని పలువురు పోలీసు సిబ్బందినీ అతడు జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అని బురిడీ కొట్టించినట్టు విచారణలో తేలింది. రాత్రిళ్లు ఓ వ్యక్తి వాహనచోదకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులతో సదరు వ్యక్తికి దీనికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చిట్టీల వ్యాపారి అరెస్ట్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): చీటీల పేరుతో జనాన్ని మోసం చేసి పరారైన వ్యాపారిని ఇనగుదురుపేట పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న అతన్ని కోర్టుకు హాజరుపరిచారు. శనివారం ఇనగుదురుపేట సీఐ ఎస్కే నబీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం రాజుపేటకు చెందిన అన్నం రాధాకృష్ణమూర్తి 30 ఏళ్లుగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఏడాదిగా వ్యాపారం సరిగా నడవకపోవటంతో కుటుంబంతో సహా రాధాకృష్ణమూర్తి మచిలీపట్నం నుంచి రాత్రికిరాత్రే ఉడాయించాడు. బాధితులు పలువురు ఫిబ్రవరిలో రాధాకృష్ణమూర్తిపై ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. పోలీసులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి అతనిని రాజుపేటలో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చీటీల పేరుతో సుమారు రూ. 50 లక్షలకుపైగా బాధితులకు టోకరా పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. రాధాకృష్ణమూర్తితోపాటు వ్యాపారానికి సంబంధించి మరి కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. అదుపులోకి తీసుకున్న అతన్ని కోర్టుకు హాజరుపరచి రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ కుమార్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
నలుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ ఓబులేసు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దొరసానిపల్లెకు చెందిన గుర్రం రాము, సగిలిగొడ్డుపల్లె గ్రామానికి చెందిన పెడవల్లి వెంకటసుబ్బారెడ్డి కొంత కాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు. ఈ క్రమంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి దొరసానిపల్లెలోని సాయిబాబా గుడి సమీపంలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో.. ఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు బుకీలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.60,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైపాస్ రోడ్డులోని చిన్నశెట్టిపల్లెకు వెళ్లే రహదారిలో ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన వజ్జల వెంకట అమర్నాథ్, పల్లా వెంకటరమణ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఆ ప్రాంత వాసులు సమాచారం అందించడంతో.. ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.37,500 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఏఎస్ఐ రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్
కరీంనగర్: నగరంలో కిడ్నాప్‌లకు పాల్పడుతోన్న ఆరుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి ఒక కంట్రీ మేడ్ 8 ఎంఎం తపంచా, నాలుగు రౌండ్ల తూటాలు, రూ. 20 వేల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ ముఠాలో ఓ మాజీ నక్సలైట్ కూడా ఉన్నాడు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు.