రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి | Fourmemers killed in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

Published Mon, Aug 8 2016 12:14 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Fourmemers killed in road accidents

రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
కరీమాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వరంగల్‌ మిల్స్‌కాలనీ సెకండ్‌ ఎస్సై సయ్యద్‌ అఫ్జలుద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్‌ ప్రాంతానికి చెందిన బొలిశెట్టి రాజ్‌కుమార్‌(28) ఆదివారం రాత్రి నర్సంపేట రోడ్‌ నుంచి తన పల్సర్‌ బైక్‌పై వరంగల్‌ వైపునకు వస్తున్నాడు. లేబర్‌ కాలనీలోని ఎస్‌బీఐ వద్దకు చేరుకోగానే బైక్‌ను ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్‌ పైనుంచి రాజ్‌కుమార్‌ కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ రాజ్‌కుమార్‌ పైనుంచి వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. అక్కడే రాస్తారోకోకు దిగారు. రాజస్థాన్‌కు చెందిన లారీ రాజ్‌కుమార్‌ను ఢీకొట్టిందని, అది అక్కడి నుంచి వెళ్లిపోతున్నా పోలీసులు పట్టుకోలేకపోయారని ఆరోపించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.  
బైక్‌పై వస్తుండగా చిరువ్యాపారి.. 
గోవిందరావుపేట : మండలంలోని చల్వాయి శివారులో ఉన్న గౌరారం చెరువు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంధం అంజయ్య(35) అనే చిరు వ్యాపారి మృతిచెందాడు. పస్రా ఎస్సై షేక్‌ యాసిన్‌ కథనం ప్రకారం.. వెంకటాపురం మం డలం అడవిరంగాపురం(తిమ్మాపూర్‌) గ్రామానికి చెందిన అంజయ్య గత కొద్దిరోజులుగా పస్రాలో నివాసంఉంటున్నాడు. అక్కడే ఉంటూ రోజూ ఏటూరునాగారానికి వెళ్లి రోడ్డు పక్కన టోపీలు,కళ్లద్దాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం ఉదయం చెల్పూరులో సమీప బంధువు చనిపోగా కర్మకు వెళ్లాడు. రాత్రి బైక్‌పై పస్రాకు తిరిగి వస్తుండగా, చల్వాయి సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన క్వాలిస్‌ వాహ నం అంజయ్యను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు, పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగుకు తరలించారు. 
హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మహిళ.. 
జనగామ : హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జనగామ శివారులోని జెర్సీ పాలకేంద్రం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ ఆది వారం రాత్రి మృతిచెందింది. ఎస్సై సంతోషం రవీందర్‌ తెలి పిన వివరాల ప్రకారం.. లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కొండ రేణుక(40) తన కుమారుడు అరవింద్‌తో కలిసి జనగామలోని వాసం ఉంటోం ది. పని ముగించుకొని ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లి కనిపిం^è లేదు. దీంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. రోడ్డు ప్రమాదం లో గుర్తుతెలియని మహిళ మృతిచెందిందని తెలుసుకొని, సంఘటనా స్థలానికి వెళ్లాడు. అక్కడ విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూసి బోరున విలపించాడు. ఇంటిపట్టున ఉండాల్సిన రేణుక రోడ్డువైపు వెళ్లడానికి గల కారణాలు తెలియాల్సిఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
లారీ ఢీకొనడంతో.. 
నర్సింహులపేట : మండలంలోని బీరిశెట్టిగూడెం శివారులోని వరంగల్‌–ఖమ్మం రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తొడుసు వెంకన్న(40) అనే వ్యక్తి మృతి చెం దాడు. ఎస్సై వెంకటప్రసాద్‌ కథనం ప్రకారం..మండలంలోని పెద్దనాగారానికి చెందిన వెం కన్న పనుల నిమిత్తం పడమటì  గూడేనికి వెళ్లా డు. అక్కడి నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా బీరిశెట్టిగూడెం వద్ద వరంగల్‌ వైపునకు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement