నంద్యాల : నకిలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు పొందడానికి యత్నించిన కేసులో గురువారం రాత్రి నలుగురిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన షఫీ సౌదీ అరేబియాకు వెళ్లేందుకు గోస్పాడు మండలం ఎం.చింతకుంట వీఆర్వో రహంతుల్లాకు మూమూళ్లు ఇచ్చి నకిలీ జన్మధ్రువీకరణ పత్రం పొందాడు. దళారులు ఖాన్, బాషాల ద్వారా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. డాక్యుమెంట్లు నకిలీవిగా గుర్తించిన పోలీసులు.. ఇద్దరు దళారులతో పాటు వీఆర్వో, షఫీని అరెస్ట్ చేశారు.