చురుగ్గా సాగుతున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్ర నిర్మాణం
Published Wed, Mar 15 2017 9:12 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
– నెలాఖరులోపు సిద్ధం చేసేందుకు ప్రణాళిక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు ప్రధాన తపాలా కార్యాలయంలో సుమారు రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టిన పాస్‌పోర్టు సేవా కేంద్రం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి నెలాఖరు లోపు సిద్ధం చేసేందుకు పాస్‌పోర్టు, పోస్టల్ అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. పాస్‌పోర్టు అధికారుల బృందం సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి పర్యవేక్షించింది.
పర్యవేక్షించిన పోస్టల్ సూపరింటెండెంట్..
పాస్‌పోర్టు సేవా కేంద్రం నిర్మాణ పనులను పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలుకు పాస్‌పోర్టు సేవా కేంద్రం మంజూరు చేయడంలో పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కృషి ఉందని, ఆమె చేతుల మీదుగానే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. గోడ నిర్మాణం పూర్తయ్యాక ప్లాస్టరింగ్, వైరింగ్ వంటి దశలను పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. ఏదిఏమైనా పాస్‌పోర్టు కార్యాలయం నెలాఖరు నాటికి ప్రారంభిస్తారా లేదా అనేది అధికారుల పనితీరుపై ఆధార పడి ఉంటుంది.
Advertisement
Advertisement