
గ్రామ శివారులోని తన రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కులవృత్తి చేస్తాడు. ఇటీవల పంట కోశాడు. యాసంగిలో మళ్లీ సాగు చేసేందుకు మంగళవారం ఉదయం వరి కొయ్యకాలుకు
జగిత్యాల క్రైం: మంటల నుంచి గడ్డి వామును కాపాడుకునే ప్రయత్నంలో ఓ రైతు సజీవ దహనమయ్యాడు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్‌గౌడ్ (60) మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ గ్రామ శివారులోని తన రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కులవృత్తి చేస్తాడు.
ఇటీవల పంట కోశాడు. యాసంగిలో మళ్లీ సాగు చేసేందుకు మంగళవారం ఉదయం వరి కొయ్యకాలుకు నిప్పు పెట్టాడు. పొలం సమీపంలోనే గడ్డివాము ఉంది. దానికి నిప్పు అంటుకోకూడదని పొలంలోని మంటల్ని కర్రలతో కొడుతూ ఆర్పుకుంటూ ముందుకు సాగాడు. కానీ వెనక నుంచి వచ్చే మంటల్ని గమనించలేదు.
ఈక్రమంలోనే లక్ష్మణ్‌గౌడ్ చుట్టూ మంటలు వ్యాపించాయి. తప్పించుకునే మార్గం లేక అందులోనే చిక్కుకుని కాలిపోయాడు. రూరల్ ఎస్‌ఐ అనిల్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: Telangana: కొత్తగా 205 మందికి కరోనా )