
సజీవ దహనం కేసు: ఆ యువతి పూజిత
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన యువతి మృతి కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ పంజాగుట్ట ఐఏఎస్ కాలనీలో శుక్రవారం కలకలం రేపిన యువతి సజీవ దహనానికి సంబంధించిన వివరాలను వారు కనుగొన్నారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఆ యువతి పేరు పూజితగా తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆమె ప్రస్తుతం సీఏ ఇంటర్ చదువుతోంది.
యువతి హైదరాబాద్ బయలుదేరే ముందు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తన అక్క రోహితకు ఉద్యోగం వచ్చిందని, తను ఇంకా ఉద్యోగం సాధించలేకపోయానని, జీవితం మీద విరక్తి చెంది చనిపోతున్నట్లుగా పూజిత సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజితను అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూజిత బాయ్ ఫ్రెండ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజిత మరణవార్త విని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు పూర్తి విషాదంలో మునిగిపోయారు.