వైఎస్సార్ జిల్లా : పూరిల్లు తగలబడటంతో రెండేళ్ల చిన్నారితో సహా తల్లి మంటల్లో కాలి బూడిదైంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌసల్య ఇంట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఆమెతో పాటు చిన్నారి భాను(2) కాలి బూడిదయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు మంటలంటుకుని సజీవ దహనమైందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తల్లీబిడ్డలు సజీవ దహనం
Published Thu, Mar 31 2016 4:01 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement