మాజీ ప్రియురాలిని వెంటాడి పట్టుకుని.. | Rome Student Burnt Alive By Ex-Boyfriend | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియురాలిని వెంటాడి పట్టుకుని..

Published Tue, May 31 2016 3:13 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

మాజీ ప్రియురాలిని వెంటాడి పట్టుకుని..

మాజీ ప్రియురాలిని వెంటాడి పట్టుకుని..

తనకు దూరమైందనే కోపంతో రోమ్ యూనివర్శిటీ విద్యార్థిని ఆమె మాజీ ప్రియుడు అతికిరాతకంగా చంపాడు.

రోమ్: తనకు దూరమైందనే కోపంతో రోమ్ యూనివర్శిటీ విద్యార్థిని ఆమె మాజీ ప్రియుడు అతికిరాతకంగా చంపాడు. తన కెరీర్లోనే ఇది అతి క్రూరమైన హత్యని ఓ విచారణాధికారి విస్తుపోయారు.

ఇటలీ రాజధాని రోమ్ యూనివర్శిటీ విద్యార్థిని సారా డి పీట్రంటోనియో (22), విన్కెంజో  పడానో (27) ప్రేమించుకున్నారు. కాగా కొంతకాలం తర్వాత విన్కెంజోకు సారా దూరమైంది. దీన్ని భరించలేకపోయిన విన్కెంజో ఆమెపై పగపెంచుకున్నాడు. సారా వెళ్తున్న కారును ఆపి విన్కెంజో నిప్పుపెట్టాడు. ఆమె కారులోంచి దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, విన్కెంజో ఆమెను వేటాడి పట్టుకుని సజీవదహనం చేశాడు. సారా ముఖం, ఒంటిపై ఆల్కాహాల్ పోసి, సిగరెట్ లైటర్తో నిప్పుపెట్టాడు.

హత్య జరిగిన ప్రాంతంలో కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు విన్కెంజోపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సారాను తాను చంపలేదంటూ మొదట నిరాకరించిన విన్కెంజో.. పోలీసుల సుదీర్ఘ విచారణ అనంతరం నేరాన్ని అంగీకరించాడు. తన 25 ఏళ్ల కెరీర్లో ఇలాంటి క్రూరమైన హత్య చూడలేదని పోలీస్ అధికారి లూగి సిలిపో చెప్పారు. విన్కెంజో ఓ పథకం ప్రకారం సారాను హత్య చేశాడని తెలిపారు.

సారా ప్రస్తుత ప్రియుడు ఇంటి నుంచి కారులో బయటకు వచ్చినపుడు విన్కెంజో ఆమెను ఆపాడని చెప్పారు. అతను బలవంతంగా రోడ్డు పక్కన కారును పార్క్ చేయించాడని వెల్లడించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు చెప్పారు. విన్కెంజో తన వెంట తీసుకెళ్లిన బాటిల్లోని మద్యాన్ని కారులోపల చెల్లి నిప్పుపెట్టాడని తెలిపారు. సారా ప్రాణాలు కాపాడుకునేందుకు కారు దిగి పరిగెత్తగా, కొంతదూరం వెళ్లాక విన్కెంజో ఆమెను పట్టుకుని కిరాతకంగా చంపాడని విచారణాధికారి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement